‘త్రిపుర’ షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ
తారాగణం: స్వాతి, నవీన్ చంద్ర, రావు రమేష్.
సంగీతం : కుమరన్, దర్శకత్వం : రాజ్ కిరణ్, నిర్మాతలు : ఎ చినబాబు, ఎమ్ రాజశేఖర్.
‘త్రిపుర’ ఒక హారర్ కామెడీ థ్రిల్లర్. కథ విషయానికి వస్తే, పల్లెటూరిలో ఎంతో అందమైన జీవితాన్ని గడిపే త్రిపుర (స్వాతి) అనే అమ్మాయిని డాక్టర్ నవీన్ చంద్ర ఎంతో ఇష్టపడి పెళ్ళిచేసుకుంటాడు. ఆ తర్వాత ఈ జంట నగరంలో కాపురం పెడుతుంది. వీరు అద్దెకు వుంటున్న అపార్ట్‌మెంట్ ఫ్లాట్లో దయ్యం వుందని తెలుస్తుంది. ఆ దయ్యం వారిని ఎలాంటి ఇబ్బందులు పెట్టింది, దాని బారి నుంచి వారు ఎలా బయటపడ్డారనేది ఈ సినిమా కథాంశం. ఈ సినిమాలో స్వాతి చక్కని నటనతో ఆకట్టుకుంది. హీరో నవీన్ చంద్ర తన పాత్రకు న్యాయం చేశారు. రావు రమేష్ తన మార్క్ చూపించాడు. ఈ హారర్ కామెడీని దర్శకుడు రాజ్ కిరణ్ ప్రతిభావంతంగానే డీల్ చేశాడు.