13 జిల్లాల్లో అడ్రస్ లేని బీజేపీ
బీహార్ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి ఎప్పటికీ మరచిపోలేని పీడకలలా మిగిలాయి. బీహార్లో అధికారంలోకి రావడం ద్వారా దేశంలోనే ఎదురులేని పార్టీగా నిలబడాలన్న బీజేపీ ఆశలను ఈ ఎన్నికలు కల్లలు చేశాయి. బీహార్లో బీజేపీ ఎంత ఘోరంగా ఓడిపోయిందంటే, రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఈ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. బ్సార్, బెగుసరాయ్, కిషన్ గంజ్, మాదేపురా, ముంగేర్, సమస్తీపూర్, షేక్ పురా, అరావల్, భోజ్పూర్, శివోర్, జెహనాబాద్, ఖగాడియా, సహర్ష జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ అడ్రస్ లేకుండా పోయింది.