అన్ని పార్టీలను తిట్టేస్తున్న ఓవైసీ.. ఒక్క టీఆర్ఎస్ ను తప్ప..
టీఆర్ఎస్ కు, మజ్లిస్ కు మధ్య రహస్య సంబంధాలు ఉన్నాయి అని ఎప్పటి నుండో అందరికి ఉన్న అనుమానాలే. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఏ పార్టీ వాళ్లు ఆ పార్టీ కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉన్నారు. అయితే ప్రచారంలో ఒక పార్టీ వాళ్లు ఇంకో పార్టీని విమర్శించడం కామన్. కానీ మజ్లిస్ వ్యవహారం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రచారంలో భాగంగా టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ఏకిపారేస్తున్నారు. తమ విజయాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్.. టీడీపీ.. బీజేపీలు ఏకమై తమ మీద కుట్ర చేస్తున్నాయని విమర్సిస్తున్నారు కానీ.. అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ను ఒక్క మాట కూడా అనడం లేదు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య సంబంధం గురించి ఇప్పుడు నిజమనే అనిపిస్తుంది అంటున్నారు రాజకీయ పెద్దలు.