కేంద్రం పద్మ అవార్డులు.. మీడియా మొగల్ రామోజీరావుకి పద్మవిభూషణ్.. రాజమౌళికి పద్మశ్రీ
2016 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ఈరోజు పలు పద్మ అవార్డులను ప్రకటించింది. పలు రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు ఈ అవార్డులు దక్కాయి. మన తెలుగు వారిలో మువీ మొగల్ రామోజీరావుకి పద్మవిభూషణ్ అవార్డు వరించింది. పత్రికా రంగంలో ఎనలేని కృషి చేసినందుకు గాను ఆయనకు ఈ అవార్డు అందించారు. ఇంకా తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ కు కూడా పద్మవిభూషణ్ అవార్డు దక్కింది. ఇంకా వీరితోపాటు నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి, ధీరూబాయ్ అంబానీ(మరణానంతరం), సంగీత విద్వాంసురాలు గిరిజాదేవి, శ్రీశ్రీ రవిశంకర్, జమ్మూకాశ్మీర్ మాజీ గవర్నర్ జగ్మోహన్, విశ్వనాథన్ శాంత, డా. వాసుదేవ్ కులకుంటె ఆత్రే, అవినాశ్ దీక్షిత్(భారత సంతతి) అవార్డు వరించింది. . కాగా టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళికి పద్మశ్రీ అవార్డు దక్కింది
పద్మభూషణ్ అవార్డు గ్రహీతలు వీరే.
సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, సానియా మీర్జా టెన్నిస్ క్రీడాకారిణి, యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, ఉదిత్ నారాయణన్, వినోద్ రాయ్(మాజీ కాగ్), హేస్నమ్ కన్హయిలాల్, ఎన్ఎస్ రామనుజ తాతాచార్య, బరిందర్ సింగ్ హమ్దర్ద్, డి. నాగేశ్వర్ రెడ్,డి స్వామి తేజోమయానంద, రాబర్ట్ డి బ్లాక్‌విల్(భారత యూఎస్ మాజీ అంబాసిడర్), ఇందూ జైన్ రవిచంద్ర భార్గవ రాం, వి సుతార్ హఫీజ్, కాంట్రాక్టర్ వెంకట్ రామారావు ఆళ్ల, బ్రిజేందర్ సింద్
పద్మ శ్రీ అవార్డ్ గ్రహీతలు:
ఉజ్వల్ నికమ్(సీనియర్ లాయర్), బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్, ఎస్ఎస్ రాజమౌళి(బాహుబలి దర్శకుడు), భోజ్‌పురి గాయని మాళిని అవాస్థి, ప్రెడ్రగ్ కె నికిక్ (యోగా-సైబీరియా), హూయి లాన్ ఝాంగ్(యోగా-చైనా)