JAGAN

జగన్ వి స్వార్థ రాజకీయాలంటున్న బీజేపీ మంత్రి

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ స్వార్థంతోనే గుంటూరులో దీక్షకు దిగుతున్నారని ఏపీ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు ఆరోపించారు, విభజన సమయంలో రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోని జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తాననడం విడ్డూరమన్నారు. ఏపీ ప్రయోజనాల విషయంలో జగన్ కు చిత్తశుద్ధి లేదన్న మాణిక్యాలరావు... రాష్ట్రాభివృద్ధికి బీజేపీ కృషిచేస్తోందని అన్నారు, అడిగినా అడగకపోయినా పోలవరం ముంపు మండలాల విషయంలో ఎన్డీఏ సర్కార్ ఆర్డినెన్స్ జారీ చేసిందని గుర్తుచేసిన ఆయన, మిగతా ప్రాజెక్టులు కూడా పరిశీలన దశలో ఉన్నాయని తెలిపారు.

cm kcr

సింగరేణి కార్మికులకు కేసీఆర్ వరాల జల్లు

తెలంగాణ సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికులకు వరాలు కురిపించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో సింగరేణిపై నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న ఆయన సింగరేణి కార్మికులకు పలు వరాలు కురిపించారు. అయితే గతంలో ఎప్పటినుండో కార్మికులు తమ వేతనాల నుండి వృత్తి పన్ను వసూలు చేయోద్దని ప్రభుత్వాన్నికోరుతున్న నేపథ్యంలో కార్మికుల వేతనాల నుండి వృత్తిపన్ను రద్దు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. అంతేకాదు 2014 - 15 ఆర్థిక సంవత్సరంలో సంస్థ సాధించిన రూ.491 కోట్లు లాభాలు సాధించగా దానిలో 21 శాతం అంటే రూ 103.11 కోట్ల రూపాయలను కార్మికులకు పంచాలని ఆయన అధికారులకు సూచించారు. అయితే రాష్ట్రం విడిపోక ముందు ఉమ్మడి రాష్ట్ర ఉన్నప్పుడు వచ్చిన లాభాల్లో 18 శాతమే కార్మికులకు పంచేవారని.. కానీ రాష్ట్ర విడిపోయిన తరువాత 20 శాతం పెంచామని.. ఈ ఏడాది దీనిని 21 శాతానికి పెంచుతున్నామని తెలిపారు. మొత్తం 60 వేల మంది కార్మికులు ఉన్నారని, ఒక్కో కార్మికునికి రూ.15 వేల నుంచి రూ.20 వేల దాకా అందే అవకాశాలున్నట్లు పేర్కొంది.

bihar polls

బీహార్ లో హోరాహోరీ... ఎన్డీఏకే మొగ్గు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ పక్షాలు, మహాకూటమి హోరాహోరీగా తలపడతున్నాయి, నువ్వానేనా అన్నట్లుగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు, విమర్శలు ప్రతివిమర్శలతో బీహార్ ను వేడెక్కిస్తున్నారు, అయితే పలు సర్వేల్లో ఎన్డీఏకే మొగ్గు ఉందని తేలింది, తాజాగా టైమ్స్ నౌ ఛానల్ ...సి ఓటర్ తో కలిసి జరిపిన సర్వేలో ఇరుపక్షాల మధ్య హోరాహోరీగా పోటీ సాగుతున్నా ఎన్డీఏకే ఆధిక్యం ఉందంటూ చెప్పుకొచ్చింది. టైమ్స్ నౌ ఛానల్ ...సి ఓటర్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ ప్రకారం ఎన్డీఏకు 117 స్థానాలు, మహాకూటమికి 112 సీట్లు దక్కుతాయని అంచనా వేసింది, ఇతరులు 14 స్థానాల్లో గెలవొచ్చని తెలిపింది

cm chandrababu

జగన్ దీక్ష.. చచ్చిపోతామంటే అనుమతిస్తామా.. చంద్రబాబు

సింగపూర్ పర్యటన అనంతరం తిరిగి వచ్చిన చంద్రబాబు ఢిల్లీలో కేంద్రమంత్రులతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల ఏపీకి అన్యాయం జరిగిందని.. ఏపీకి న్యాయం చేయాలని.. విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. అంతేకాదు ఇరు రాష్ట్రాల మధ్య తెలత్తిన సమస్యలను పరిష్కరించాలని కోరామని అన్నారు. భూసేకరణ ద్వారా ఏపీ రాజధాని కోసం 50వేల ఏకరాల భూమిని సేకరించామని.. ఈ భూములను డీనోటిఫై చేయాలని.. అంతేకాదు తిరుపతి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా కొన్ని భూములను కూడా డీనోటిఫై చేయాలని అడిగినట్లు, అందుకు మంత్రి సానుకూలంగా ప్రతిస్పందించినట్లు ఆయన తెలిపారు. కాగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైకాపా అధినేత జగన్ దీక్షకు పూనుకున్ననేపథ్యంలో దాని గురించి మాట్లాడుతూ.. దీక్షకు అనుమతి ఇచ్చేది లేదంటూ.. చచ్చిపోతామంటే అనుమతి ఇస్తామా అని చంద్రబాబు.

cm Chandrababu

చంద్రబాబు.. లగడపాటి భేటీ.. ఆంతర్యం ఏమిటో?

  రాష్ట్రం విడిపోతే తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పి.. చెప్పిన మాట ప్రకారం నిజంగానే రాజకీయాలకు దూరంగా ఉన్నారు విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. రాష్ట్రం విడిపోయి దాదాపు 15 నెలలు పైనే అయిపోయింది. అప్పటినుండి ఇప్పటి వరకూ లగడపాటి పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం లోకి మారబోతున్నారనే హాట్ టాపిక్ నడుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. లగడపాటి రాజగోపాల్ ఇద్దురు భేటీ అయిన నేపథ్యంలో పలు అనుమానాలు రేకెత్తున్నాయి. సింగపూర్ పర్యటన అనంతరం  చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమైన సంగతి తెలిసిందే.. దీనిలో భాగంగానే ఆయన లగడపాటిని కూడా కలవడం జరిగింది. దీంతో చంద్రబాబు లగడపాటిని ఎందుకు కలిశారు.. వారి భేటీ వెనుక ఆంతర్యమేంటి? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ భేటీలో చంద్రబాబుతోపాటు ఏపీ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు, విజయవాడ ఎంపీ కేశినేని నానిలు ఈ సమావేశంలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ భేటీలో ఎలాంటి రాజకీయ పరమైన అంశాలపై చర్చ జరగలేదని.. కేవలం వ్యాపార అంశాలమీద చర్చించామని తెలుపుతున్నారు. ఏదీ ఏమైన చంద్రబాబు.. రాజగోపాల్ దేని నిమిత్తం భేటీ అయిన రాజగోపాల్ టీడీపీలో చేరే నేపథ్యంలోనే చంద్రబాబును కలిశారని వార్తులు వినిపిస్తున్నాయి.

ramoji

రామోజీ కోడలు... జగన్ భార్యకు స్నేహం ఉందా?

రాజకీయంగానూ, వ్యాపారపరంగా, ప్రతికాధిపతులుగానూ భిన్న ధృవాలైనా రామోజీ-జగన్ భేటీ వెనుక ఆయన కోడలు శైలజాకిరణ్ ఉన్నారనే వార్తలు వినపడుతున్నాయి. మంచు మనోజ్ పెళ్లిలో కలిసిన శైలజాకిరణ్, జగన్ భార్య భారతి కొద్దిసేపు మాట్లాడుకున్నారని, అది వారిద్దరి మధ్యా సత్సంబంధాలు ఏర్పడ్డటానికి దోహదపడిందని చెబుతున్నారు. ఆ సత్సంబంధాలే జగన్ ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీని కలిసేలా చేశాయని అంటున్నారు. ఎవరితోనూ శత్రుత్వం వద్దన్న శైలజాకిరణ్ సూచన మేరకే జగన్ కు రామోజీ అపాయింట్ మెంట్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీని కలవడం జగన్ కు పొలిటికల్ మైలేజ్ తెచ్చిపెడుతుందని, కమ్మ కమ్యూనిటీలో జగన్ పై కొంత సానుకూలత ఏర్పడే అవకాశముందని భావిస్తున్నారు

ramojirao

రామోజీ-జగన్ భేటీ వెనుక కేసీఆర్ ఉన్నారా?

రామోజీరావు, జగన్మోహన్ రెడ్డి భేటీ వెనుక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది, అందుకే ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీని కలిసేవరకూ ఏపీ ప్రభుత్వానికి గానీ, ముఖ్యమంత్రి చంద్రబాబుకు గానీ, ఏపీ ఇంటలిజెన్స్ కి గానీ తెలియలేదట. ఉద్యమ సమయంలో ఏవోవో అన్నా, ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం రామోజీతో కేసీఆర్ మాంచి రిలేషన్ షిప్ నే మెయింటైన్ చేస్తున్నారు. సీఎం అయ్యాక ఒకసారి కేసీఆర్ ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీని మర్యాదపూర్వకంగా కలవగా, ఓసారి రామోజీయే వచ్చి క్యాంప్ ఆఫీస్ లో కేసీఆర్ ను కలవడం, ఇలా ఈ ఇద్దరి మధ్యా చిగురించిన స్నేహబంధం బలపడిందని, ఆ చనువుతోనే జగన్ ను రామోజీకి దగ్గర చేసేందుకు కేసీఆర్ మీటింగ్ ఏర్పాటు చేశారని అంటున్నారు.

ramoji

రామోజీ, జగన్... ఇద్దరిలో ఎవరు మెట్టుదిగారు?

మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ పెళ్లిలో రామోజీరావు, జగన్ మాట్లాడుకుంటున్న విజువల్స్ ను చూసి రాజకీయ నేతలతోపాటు జనాలు కూడా ఆశ్చర్యపోయారు, మనోజ్ పెళ్లిలో జగన్ రాకను గమనించి రామోజీరావే ముందుగా జగన్ ను విష్ చేయగా, జగన్ కూడా రామోజీకి ప్రతి నమస్కారం చేశారు. ఈ అరుదైన ఈ దృశ్యాన్ని చూసి కలా నిజమా అన్నరీతిలో అందరూ అవాక్కయ్యారు. ఆరోజు మంచు మనోజ్ పెళ్లి కంటే రామోజీ-జగన్ కలయికే పెద్ద హైలెట్ అయ్యింది, ఇవాళ మరోసారి జగన్...రామోజీతో భేటీకావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. రామోజీ అంటే పడని జగన్....ఎందుకు ఫిల్మ్ సిటీకి వెళ్లిమరీ కలిశాడనే చర్చ మొదలైంది, రామోజీరావే పెద్దరికాన్ని చూపించాడా? లేక జగన్ మెట్టుదిగాడా అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలియదు గానీ...వీరిద్దరి భేటీ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.

jagan

జగన్... రామోజీని కలిసేవరకూ బాబుకి కూడా తెలియదా?

రామోజీరావును జగన్ కలవడంపై తెలుగుదేశం వర్గాల్లో కలకలం రేగుతోంది,  తెలుగుదేశానికి వెన్నుదన్నులా నిలిచే రామోజీరావు ఇలా సడన్ గా జగన్ కు అపాయింట్ మెంట్ ఇవ్వడంపై ఎవరికి తోచిన విధంగా వాళ్లు మాట్లాడుకుంటున్నారు. జగన్ కి రామోజీ అపాయింట్ మెంట్ ఇచ్చిన సంగతి కనీసం చంద్రబాబుకి కూడా తెలియదని, రామోజీ-జగన్ భేటీని ఏపీ ఇంటలిజెన్స్ కూడా పసిగట్టలేకపోయిందని అంటున్నారు, జగన్ ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీని కలిశాక మాత్రమే ప్రభుత్వ వర్గాలకు, పార్టీ నేతలకు తెలిసిందని చెప్పుకుంటున్నారు, అసలు జగన్ ఎందుకు రామోజీని కలిశాడు, ఏం మాట్లాడు అంటూ ఇంటలిజెన్స్ ఆరా తీసే పనిలో పడిందట.

Mecca

700కి చేరిన మక్కాలో మృతుల సంఖ్య

  సౌదీ అరేబియాలో ముస్లింల పవిత్ర పుణ్యక్షేత్రం మక్కాకు సుమారు మూడు కి.మీ. దూరంలో ఉన్న మైన పట్టణంలో గురువారం ఉదయం జరిగిన త్రొక్కిసలాటలో 717 మంది మరణించారు. సుమారు 800మందికి పైగా గాయపడ్డారు. ప్రతీ ఏటా జరిగే హజ్ యాత్రలో భాగంగా మైన వద్దగల మూడు స్తంభాలను రాళ్ళతో కొట్టే ఆచారం పాటిస్తారు. దానిలో పాల్గొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల నుండి సుమారు 20 లక్షల ముస్లిములు వచ్చేరని సౌదీ ప్రభుత్వం అంచనా.   గురువారం ఉదయం ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఒకేసారి జనం ముందుకు త్రోసుకు రావడంతో చాలా మంది క్రింద పడిపోయారు. ఆ త్రొక్కిసలాటలో ఇంత వరకు 717మంది మరణించినట్లు సౌదీ సివిల్ డిఫెన్స్ అధికారులు ప్రకటించారు. సంఘటాన స్థలంలో సుమారు 4,000 మంది సిబ్బందిని, 220 అంబులెన్స్ వాహనాలను ఏర్పాటు చేసి గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు.   1990సం.లో ఇదే ప్రదేశంలో 1426 మంది త్రోక్కిసలాటలో మరణించారు. ఆ తరువాత కూడా చాల సార్లు అదే ప్రదేశంలో త్రొక్కిసలాటలో చాలా మంది చనిపోతూనే ఉన్నారు. కానీ మళ్ళీ ఒకేసారి ఇన్ని వందలమంది చనిపోవడం ఇదే మొదటిసారి. ఇటువంటి సంఘటనలు నివారించదానికి సౌదీ ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ నానాటికీ యాత్రికుల సంఖ్య అంచనాలకు మించి చాలా భారీగా పెరిగిపోతుండటం ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం అవుతున్నాయి.

CHIRANJEEVI

చిరంజీవి...బీజేపీలో చేరతారంటూ ఓ పత్రిక కథనం

మెగాస్టార్ చిరంజీవి బీజేపీలో చేరతారంటూ ఓ ఆంగ్ల పత్రిక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి చిరంజీవి ప్రయత్నించడం లేదని ఇటీవల రాహుల్ గాంధీ క్లాస్ పీకారని, పైగా కేంద్రమంత్రి పదవి ఇచ్చి చిరంజీవికి జాతీయ గుర్తింపు వచ్చేలా చేస్తే, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయకుండా తన 150వ సినిమాపైనే ఫోకస్ పెట్టారని రాహుల్ చిర్రుబుర్రులాడారట, దాంతో తీవ్ర అసంతృప్తికి గురైన మెగాస్టార్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేసి భారతీయ జనతా పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారని రాసుకొచ్చింది, బీజేపీ కూడా మెగా ఫ్యామిలీ పట్ల సానుకూలంగా ఉందని, రామ్ చరణ్ ఎయిర్ లైన్స్ సంస్థకు ఎన్డీఏ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని రాసుకొచ్చింది, పవన్ కూడా బీజేపీ మద్దతుదారుడైనందున చిరంజీవి బీజేపీలో చేరతారంటూ విశ్లేషణాత్మక కథనం ఇచ్చింది.

musunooru mro vanajakshi

నిరూపిస్తే రాజీయాలనుండి తప్పుకుంటా

  ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి పై గతంలో దాడి జరిగినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పుడు జేసీ శర్మ కమిటీ విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో విచారణ జరుపుతున్నారు. దీనిలో భాగంగా వనజాక్షి కమిటీ ముందు తన వాదనలు వినిపించింది. అనంతరం చింతమనేని ప్రభాకర్ తన వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆయన ఈ దాడిలో తనకు సంబంధం లేదని.. వనజాక్షి తన సరిహద్దులు దాటి ఇసుక ర్యాంపులోకి వచ్చారని అన్నారు. అంతేకాని తాను ఆమెపై ఎటువంటి దాడి చేయలేదని ఒక వేళ తాను చేసినట్టు నిరూపిస్తే రాజకీయలనుండి తప్పుకుంటానని కమిటీ ముందు చెప్పినట్టు తెలుస్తోంది. తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఈప్రచారం చేయడం వెనుక కుట్రలు వున్నాయని అన్నారు.

pm modi

ఇచ్చినమ్మ వాయినం.. పుచ్చుకుంటినమ్మ వాయినం చందాగా మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ బిజీబిజీగా విదేశాల పర్యటన చేస్తున్నారు. ఈ పర్యటనల వల్ల దేశానికి వచ్చే లాభం ఎంత ఉందో తెలియదు కాని ఇప్పుడు ప్రధాని పర్యటన అనగానే ఆయన అక్కడి ప్రధానికి ఏం బహుమతి తీసుకెళుతున్నారు.. వారు ప్రధానికి ఏం బహుమతి ఇస్తున్నారు అనే విషయ తెలుసుకోవడంపై ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే ఆయన విదేశీ పర్యటనలకు వెళ్లేప్పుడు ఒట్టి చేతులతో వెళ్లరు. ప్రస్తుతం ఐర్లాండ్ పర్యటనలో ఉన్న మోడీకి అక్కడి ప్రభుత్వం ఘన స్వాగతం అందించింది. అనంతరం ప్రధాని మోడీ ఐర్లాండ్ ఎండా కెన్నికి విలువైన పత్రాల్ని అందించారు. దీనికి ప్రధాని కెన్ని మోడీకి ఆదేశ జాతీయ క్రీడ అయిన హర్లింగ్ బ్యాట్.. బంతి.. జెర్సీలను బహుమతులుగా అందించారట. అంతేకాదు ఐర్లాండ్ పర్యటనతో మోడీ అరుదైన ఘనత కూడా దక్కింది. దాదాపు 60 ఏళ్ల తరువాత భారత ప్రధాని ఐర్లాండ్ లో పర్యటించండం ఇదే. ఈ విషయాన్ని దౌత్య వర్గాలు కూడా ఘనంగా ప్రకటించారు. మొత్తానికి మోడీ బహుమతులు ఇచ్చిపుచ్చుకునే కాన్సెప్ట్ బాగానే ఉందని అనుకుంటున్నారు.

ఏపీ ప్రత్యేక హోదా.. వారంలో ఏదో ఒకటి తేల్చేస్తాం.. జైట్లీ

  ఏపీ ప్రత్యేక హోదా పై ఇప్పటికీ వస్తుందా రాదా అనే సందేహాలే ఉన్నాయి అందరిలో. దీనిలో భాగంగానే ఇప్పటికే అధికార పక్షం కానీ.. ప్రతి పక్షాలు కానీ నిరసనలు చేస్తూనే ఉన్నారు. గతంలో సీఎం చంద్రబాబు ప్రధాని మోడీ మధ్య ప్రత్యేక హోదా గురించి చర్చ జరిగినా అప్పుడు కూడా దానిపై స్పష్టత రాలేదు. అయితే దీనికి సంబంధించి వారం రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ చెప్పడం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన ముగించుకొని అనంతరం ఢిల్లీలోని కేంద్రమంత్రులను కలిసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే ఆయన కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతో కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరువురు ఏపీ ప్రత్యేక హోదా గురించి చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా చంద్రబాబు విభజన చట్టంలో ఏపీకి ఇస్తానన్న అంశాలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని... జాప్యమయ్యేకొద్ది రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతోందని వివరించారు. దీనికి జైట్లీ ఏపీ ప్రత్యేక హోదాపైన.. ప్రత్యేక ప్యాకేజ్ పైన అటో ఇటో తేల్చేస్తామని.. వారం రోజుల్లో ఏదో ప్రకటన చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఇప్పటికి కళ్లు తెరిచిన ఏపీ సర్కార్

చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడంలా ఉంది ఏపీ ప్రభుత్వం తీరు. రాష్ట్రం విడిపోయి ఏపీ ఆర్ధిక లోటుతో ఉన్న ముఖ్యమంత్రి కానీ... ఇతర నేతలు.. అధికారులు కానీ ఖర్చుచేయడంలో ఏమాత్రం తగ్గరు. ఏవైనా పార్టీ కార్యక్రమాలు ఉంటే కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టడం.. ముఖ్యంగా విమాన ప్రయాణాలు.. దీనిపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. అయితే ఇప్పుడు ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ కళ్లు తెరిచినట్టుంది. ఎందుకంటే సీఎం చంద్రబాబు హైదరాబాద్ లో ఉండి.. ఏపీ పాలన చేయడం కష్టమని భావించిన నేపథ్యంలో ఇప్పుడు ఎక్కువ శాతం అక్కడే ఉంటున్నారు. అయితే హైదరాబాద్ ఉన్న అధికారులు చంద్రబాబును కలవడం.. ఇక్కడ ఎమన్నా సమావేశాలు.. సమీక్షలు ఉన్నా తరచూ ఇక్కడికి రావడంతో రాకపోకలు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఎక్కువ విమాన ప్రయాణం చేయడంతో వాళ్లిచ్చే బిల్లులతో ప్రభుత్వానికి తడిసి మోపెడవుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం ఓ కండీషన్ పెట్టింది. హైదరాబాద్ నుండి విజయవాడకు విమాన ప్రయాణం చేయాలంటే రానుపోనూ కలిపి రూ. 10వేల రూపాయలు మించకూడదని.. అలాకాకపోతే కారులో ప్రయాణించాలని సూచించింది. అంతేకాదు ఒక్కసీఎం.. ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి తప్ప ఇంకా ఏ ఉన్నతాధికారి తమ వెంట సిబ్బందికి తెచ్చుకోవద్దని.. అందునా స్టార్ హోటళ్లలో కాకుండా టూరిజం హోటళ్లలో బస చేయాలని ఆదేశించింది. మొత్తానికి ఏపీ ప్రభుత్వం ఇన్ని రోజులకు కళ్లు తెరిచి పొదుపు బాట పట్టినట్టుంది. ఈ పని ఎప్పుడో చేసుంటే ఇప్పటికి కొన్ని కోట్ల రూపాయలు మిగిలేవి.

అది కరెక్ట్ కాదు.. చంద్రబాబుకి సింగపూర్ టీమ్ హెచ్చరిక

నవ్యాంధ్ర రాజధాని నిర్మాణాన్ని రూపొందించే బాధ్యతను ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ ప్రతినిధులకు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యమైన సింగపూర్ ప్రభుత్వం సీఎం చంద్రబాబుకు కొన్ని హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అదేంటంటే..  రాజధాని నిర్మాణంలో భాగంగా చంద్రబాబు కొన్ని ప్రైవేట్ సంస్థలకు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి అర్బన్ రీజియన్ డెవలప్ మెంట్ రద్దుచేస్తూ ఏపీ కాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ (సీఆర్ డీఏ) పేరుతో ప్రైవైట్ సంస్థలకు వాటి బాధ్యతలు అప్పగించారు. దీనిలో కూడా సరైన సిబ్బంది లేరు. రాజధాని నిర్మాణం.. పరిసర ప్రాంతాల సుందరీకరణ త్వరలో జరగబోయే రాజధాని శంఖుస్థాపన కోసం దాదాపు 30 మంది కన్సల్ టెంట్ లను నియమించారు. ఈనేపథ్యంలోనే సింగపూర్ బృందం తమ అభ్యంతరాలను సీఎం ముందు వ్యక్తపరిచినట్టు తెలుస్తోంది. రాజధాని నిర్మాణం అనేది చాలా జాగ్రత్తగా జరగాల్సిన ప్రక్రియ అని.. ఎంతో కీలకమైన రహస్యం ఉంటుందని.. కాబట్టి ప్రభుత్వ సిబ్బంది లేకుండా ప్రైవేటు వ్యక్తుల ద్వారా చేయడం సరికాదని హెచ్చరించినట్టు తెలిసింది. మరి సింగపూర్ చెప్పిన దానిపై సీఎం ఆలోచిస్తారో లేదో చూడాలి.

ఏపీకి కేంద్రసాయం.. సాయంతంలోగా ప్రకటన.. సుజనా

  ఏపీకి కేంద్రం అందించే సాయంపై సాయంత్రంలోగా ప్రకటన వచ్చే అవకాశం ఉందని కేంద్రమంతి సుజనా చౌదరి తెలిపారు. రాజధాని గురించి.. వెనుకబడ్డ ప్రాంతాల గురించి కేంద్రంతో చర్చించామని..దీనిపై వివిధ శాఖల మంత్రులతో చర్చిస్తున్నామని.. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతో మరోసారి కలిసేందుకు తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అంతేకాదు ఎన్డీయే ప్రభుత్వం ఏపీకి న్యాయం చేస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు. ఇప్పటికే ఏపీ రాష్ట్రాభివృద్ధికి సాయం పై నీతి అయోగ్ లో రెండు సార్లు చర్చించామని.. ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ కోసం తాము కేంద్రంతో చర్చిస్తున్నామని.. ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ వర్కవుట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. కాగా కేంద్రం జిల్లాకో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుందని తెలిపారు.