rakjasingh resignation kalakalam in bjp

కమల దళంలో కలకలం!

భారతీయ జనతా పార్టీ  రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక ఆలస్యం అయితే అయ్యింది.. ఇప్పటికైనా అంతా సవ్యంగా జరిగిందా అంటే అదీ లేదు. నిజానికి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు ముందుగానే తెర పైకి వచ్చింది. అయినా నామినేషన్ విషయంలో గందరగోళం నెలకొంది. ఓ వంక ఎవరైనా నామినేషన్ వేయవచ్చుని పార్టీ మాజీ అధ్యక్షుడు  బండి సంజయ్ మీడియా ముందు చెపుతున్న సమయంలోనే.. అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్  తమ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసేందుకు వచ్చిన  స్టేట్ కౌన్సిల్ సభ్యులను బెదిరించి  వెనక్కి పంపారని  ఆరోపించారు.అక్కడితో ఆగకుండా.. మీకో దండం,మీ పార్టీకో దండం  అంటూ పార్టీకి రాజీనామా  చేస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి.. రాజాసింగ్  ఇప్పుడే కాదు చాలా కాలంగా, చాలా సందర్భాలలో పార్టీ పనితీరు పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. జిల్లా అధ్యక్షుల  ఎన్నిక విషయంలో కానీ..  ఇతరత్రా పార్టీలో జరుగతున్న పరిణామాల విషయంలో కానీ  రాజాసింగ్  పార్టీ పెద్దలతో విభేదించడం కొత్త కాదు. విభేదించడం మాత్రమే కాదు.. అనేక మార్లు ఆయన  నాయకత్వం టార్గెట్ గా బహిరంగ విమర్శలు చేశారు.  ఒకటికి పదిసార్లు  ఆయన పార్టీ నాయకత్వాన్ని తప్పు పట్టారు. ఒక దశలో..  పార్టీలో పుట్టి పెరిగిన సీనియర్ నాయకులు అందరినీ మూకుమ్మడిగా బయటకు పంపితేనే పార్టీకి భవిష్యత్ ఉంటుందనీ, పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, సంచలన వ్యాఖ్యలు, విమర్శలు చేశారు. ముఖ్యంగా.. పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  టార్గెట్ గా బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలతో ఆయన  కుమ్ముక్కయ్యారని, పేరు పెట్టి మరీ ఆరోపించారు.  నిజానికి.. ఇప్పుడు కూడా రాజాసింగ్   2014 నుంచి తాను,టెర్రరిస్ట్ థ్రెట్స్  సహా   వ్యక్తిగతంగా , కుటుంబ పరంగా అనేక కష్టనష్టాలు భరిస్తూ కూడా పార్టీ కోసం పనిచేసినా, కొందరు నాయకుల పార్టీ ఎదుగుదలను అడ్డుకున్నారని, అందుకే ఇక లాభాల లేదనే నిర్ణయానికి వచ్చి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా, రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఇచ్చిన రాజాసింగ్, ఆ లేఖను అసెంబ్లీ స్పీకర్ కు పంపి, తనను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయమనాలని కిషన్ రెడ్డిని తాను కోరినట్లు చెప్పారు. అదలా ఉంటే.. మరో వంక బీజేపీ నాయకులు రాజాసింగ్  రాజీనామాను అంత సీరియస్ గా  తీసుకోవలసిన అవసరం లేదని అంటున్నారు. నిజానికి పార్టీలో ప్రతి నాయకుడికి  ఏదో విషయంలో,ఎన్నోకొన్ని సమస్యలు ఉంటాయి. అలాగే.. పదవుల విషయంలో ఇతరత్రా అసంతృప్తి  ఉంటుంది. అయినా.. సర్దుకు పోవాలి, కాదంటే, పార్టీ సమావేశాల్లో నాయకత్వ దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరిచుకోవాలి కానీ, ఇలా అయిన దానికి  కాని దానికి, చీటికి మాటికీ మీడియాకు ఎక్కడం మచిది కాదని పార్టీ నాయకులు భావిస్తున్నారు. నిజంగా రాజాసింగ్  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయ దల్చుకుంటే నేరుగా స్పీకర్ కే రాజీనామా లేఖ సంర్పించాలని బీజేపీ నాయకులు అంటున్నారు. మరోవంక రాజాసింగ్ కు ప్రజల్లో ఉన్న మద్దతు దృష్ట్యా ఇంతవరకు చూసీ చూడనట్లు ఉన్నా..  ఇకపై తీవ్ర చర్యలు తపప్క పోవచ్చని అంటున్నారు. అయితే..  రాజాసింగ్   ఎపిసోడ్ చివరకు ఏ మలుపు తిరుగుతుంది?  అనేది చూడవలసి ఉంటుందని అంటున్నారు.

POLICE CUSTODY TO CHEVIREDDI

ఏపీ లిక్కర్ స్కామ్.. పోలీసు కస్టడీకి చెవిరెడ్డి..ఆయన ఇద్దరు పీఏల అరెస్టు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో  సిట్ మరో ఇద్దరు కీలక వ్యక్తులను అరెస్టు చేసింది. ఈ ఇద్దరూ కూడా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పీఏలు కావడం గమనార్హం. ఎన్నికల సమయంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు రూ. 8.20 కోట్ంల రూపాయలు తీసుకువచ్చారన్న ఆరోపణలనై చెవిరెడ్డి పీఏ బాలాజీ తో పాటుగా మరో పీఏ నవీన్ ను కూడా సిట్ అధికారులు అరెస్టు చేశారు. వీరిరువురూ గత కొంత కాలంగా పరారీలో ఉండగా, బాలాజీ ఫోన్ లొకేషన్ ఆధారంగా వారు ఇండోర్ లో ఉన్నట్లు గుర్తించిన సిట్ అధికారులు అక్కడకు వెళ్లి బాలాజీనీ, అతనితో పాటు నవీన్ ను కూడా అరెస్టు చేశారు. ఇరువురినీ విజయవాడ తరలించారు.  ఇలా ఉండగా చెవిరెడ్డి ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. ఆయనను మూడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారం (జూన్ 30) ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం (జులై1) నుంచి గురువారం (జులై 3) వరకూ చెవిరెడ్డిని, ఇదే కేసులో మరో ప్రధాన నిందితుడు వెంకటేష్ నాయుడిని కోర్టు పోలీసు కస్టడీకి అనుమతించింది.   

35 dead in  sigachi chemical factory blast

సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు.. 35కు చేరిన మృతుల సంఖ్య

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలో సోమవారం (జూన్ 30) జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పారిశ్రామిక వాడలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో  సంభవించిన పేలుడు, మంటల వల్ల ఇప్పటివరకు 35 మంది మరణించారు. మరో 35 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పలువురి జాడ ఇంకా తెలియరాలేదు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.   ఎన్డీఆర్ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది, పోలీసు శాఖ సహాయ చర్యలలో నిమగ్నమై ఉన్నారు. భారీ వర్షం కురుస్తున్నా సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.  ఇలా ఉంగగా సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటనపై కేంద్రం స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.   కాగా సంఘటనా స్థలాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం (జులై1) సందర్శిస్తారు. క్షతగాత్రులను పరామర్శిస్తారు. కాగా సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు అనంతరం.. ఆ పారిశ్రామిక వాడలో పక్కన ఉన్న పలు ఫ్యాక్టరీలను మూసివేశారు. ఎలాంటి కెమికల్ లీకేజీ లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.  ఇలా ఉండగా ప్రమాదానికి కారణం పరిశ్రమ నిర్వాహకుల నిర్లక్ష్యమేనని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ సహా పలువురు ప్రముఖులు సంఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.  కాగా ఈ ఘటనలో మరణించిన వారి దేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన తరువాతనే మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు. 

the selection of AP and Telangana BJP presidents  beyond expectations

అంచనాలకు అందని ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుల ఎంపిక

బీజేపీ తన వ్యూహాత్మక నిర్ణయాలతో ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల ఎంపికలో  ఈ విషయం మరోసారి ప్రస్ఫుటమైంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్‌ను, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా సీనియర్ నేత ఎన్. రామచంద్రరావును పార్టీ ఎంపిక చేసింది. ఈ రెండు స్థానాల కోసం అనేకమంది పోటీలో ఉన్నప్పటికీ, ఆరెస్సెస్ అండదండలు ఉన్నవారికి, పార్టీలో సుదీర్ఘ అనుభవం కలిగినవారికి, సౌమ్యులకు ఈ బాధ్యతలను అప్పగించింది.  ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అధ్యక్ష పదవి కోసం విష్ణువర్ధన్ రెడ్డి, భానుప్రకాశ్, డాక్టర్ పీవీ పార్థసారథి, సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి తదితరులు పోటీ పడ్డారు. అయితే, పార్టీ హైకమాండ్ పీవీఎన్ మాధవ్‌ను ఎంపిక చేసింది. ఆరెస్సెస్‌తో  సంబంధాలు మాధవ్ ఎంపికకు బలమైన కారణం అయ్యాయి. పైగా ఆయన రెండోతరం బీజేపీ నాయకుడు. ఆయన తండ్రి పీవీ చలపతి రావు బీజేపీ సీనియర్  నేత. గతంలో ఆరేళ్లపాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. మాధవ్ బీసీ నేత కావడం కూడా ఆయనను ఏపీ పార్టీ అధ్యక్షుడిగా బీజేపీ ఎంపిక చేయడానికి మరో కారణం. అన్నిటికీ మించి సౌమ్యుడు. రాజకీయ వివాదాలకు దూరంగా ఉంటారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆ పార్టీలతో కూడా సమన్వయం చాలా అవసరం. ఆ కారణంగానే బీజేపీ అధిష్ఠానం మాధవ్ కు పార్టీ ఏపీ అధ్యక్షుడిగా ఎంపిక చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    ఇక తెలంగాణలో బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ, ఎం. రఘునందన్ రావు వంటి పలువురు నాయకులు పోటీలో ఉన్నారు. అయితే, పార్టీ ఎన్. రామచంద్ర రావును ఎంపిక చేసింది. రామచంద్ర రావు ఆరెస్సెస్ నేపథ్యం కలిగిన నాయకుడు. ఆయన ఎబివిపిలో చురుకైన పాత్ర పోషించారు. బీజేపీలో సుదీర్ఘ అనుభవం కలిగిన నేత. రాష్ట్ర రాజకీయాలపై లోతైన అవగాహన ఉంది. పార్టీ కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలున్నాయి. పైగా సౌమ్యుడు. అందరినీ కలుపుకు పోగలరు.

mla raja singh resign to bjp

బీజేపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారు. బీజేపీ అధ్యక్ష పదవిని ఆశించి భంగపడ్డ ఆయన పార్టీ అధ్యక్షుడిగా రామచంద్రరావును పార్టీ ప్రకటించడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోవాలి కానీ, నీవాడు.. నావాడు అంటూ ఎంపిక చేయడం సరి కాదని విమర్శలు గుప్పించారు. పార్టీ రాష్ట్ర చీఫ్ గా రామచంద్రరావు ఎంపిక వల్ల పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందని ఆయన పేర్కొన్నారు.  హిందుత్వ కోసం పనిచేసే వారికే పదవి ఇవ్వాలని సూచించారు. అంతే కాకుండా పార్టీ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేయడానికి ఆయన ప్రయత్నించారు. అయితే ఆయన నామినేషన్ వేయడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని కూడా విఫలం చేసి ఆయన అనుచరులను బెదరించడంతో రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అందజేశారు.  ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో బీజేపీ గెలవకూడదనుకునే వారు ఎక్కువయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  

congress telangana affairs incharge meenakshi natarajan different to congress culture

మీనాక్షినటరాజన్ కు ‘చేతి’ నిండా పని! 

కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ వ్యవహార శైలి, కాంగ్రెస్ కల్చర్ కు  చాలా భిన్నంగా ఉంటుందని  రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ వర్గాల్లో చాలా  కాలంగా వినిపిస్తోంది. అవును.. కాంగ్రెస్ నాయకులు, శ్రేణులతో పాటుగా  ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలలో కూడా మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ కల్చర్ కు భిన్నంగా వ్యహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది.  నిజానికి.. ఆమె ఎంట్రీనే  కాంగ్రెస్  కల్చర్’కి భిన్నంగా జరిగింది. ఎలాంటి స్వాగత సత్కార్యాలు, మేళతాళాలు, కటౌట్లు, బ్యానర్లు  నినాదాలు లేకుండా అలా రైలు దిగి ఇలా నడచుకుంటూ, బసకు చేరి అటు నుంచి నేరుగా గాంధీ భవన్ లోకి ఎంట్రీ ఇవ్వడంలోనే మీనాక్షి నటరాజన్  తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇక అక్కడి నుంచి ప్రతి పనిలోనూ ఆమె తమ  ప్రత్యేకత చాటుకుంటూనే ఉన్నారు. బహుశా ఆమెకు  మరే ఇతర బరువు బాధ్యతలు, వ్యాపార, వ్యవహారాలు లేక పోవడంవల్లనో ఏమో కానీ  పార్టీ కోసం  పూర్తి సమయాన్నికేటాయించి పనిచేస్తున్నారు.  నిజానికి  కాంగ్రెస్ పార్టీలో.. ఆ మాట కొస్త, బీజేపీలో అయినా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌  అంటే సహజంగా  ఏదో అలా చుట్టపు చూపుగా వచ్చి..  వచ్చిన పని చక్క  పెట్టుకుని పోవడమే కానీ.. ఇలా రాష్రంలోనే తిష్టవేసి పనులు చక్కబెట్టడం గతంలో అంతగా లేదు. కానీ..  మీనాక్షి నటరాజన్ అలా కాదు. అందుకే..  ఆమె కమిట్మెంట్ తో పనిచేస్తున్నారనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోం ది. అందుకే.. కాంగ్రస్ శ్రేణులు  మీనాక్షి మేడం  ప్రత్యేకం అంటున్నారు. అందుకే ఆమె  కేవలం ఇన్‌చార్జ్‌  మాత్రమే కాదు..  అంతకంటే ఎక్కువ అనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో ఏర్పడింది. అందుకే ప్రభుత్వంలో, పార్టీలో పదవులు కోరుకునే నాయకులు తరతమ బేధం లేకుండా గాంధీ భవన్ కు క్యూకడుతున్నారు. ఆమెను కలుస్తున్నారు.  విజ్ఞాపన పత్రాలు ఇచ్చి పోతున్నారు.  అయితే..  పరిస్థితి మెల్లమెల్లగా మారుతోంది. ఆమె ఎంత కమిట్మెంట్ తో పనిచేసినా..  పెద్దగా ఫాయిదా లేకుండా పోతోందని  పార్టీ నాయకులే పెదవి విరుస్తున్నారు. ఆమె ఎంత  స్ట్రిక్ట్ గా ఉన్నా.. ఎంత గట్టిగా గీతలు గీస్తున్నా.. గీత దాటుతున్న నేతల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోందని అంటు న్నారు. అందుకే..  ఆమెను ఎంట్రీ టైములో మెచ్చుకున్న నాయకులే ఇప్పడు  పెదవి విరుస్తున్నారు.ఏ దో అనుకుంటే ఇంకేదో జరిగింది అన్నట్లుగా పరిస్థితి వుందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ముందుకంటే ఇప్పుడు మరింత గందరగోళ పరిస్థితులు ఉన్నాయని  అంటున్నారు. ప్రస్తుతం వరంగల్ కాంగ్రెస్ నేతలు మధ్య సాగుతున్న వర్గ పోరు గానీ..  కొద్ది రోజుల క్రితం మహిళా కాంగ్రెస్ నాయకులు, మధ్యలో ఎస్సీ ఎమ్మెల్యేలు, ఆ తర్వాత గొర్రెల మందతో సహా గాంధీ భవన్  ప్రాంగణంలోనే యాదవులు ధర్నాచేయడం వంటి సంఘటనలు చోటు  చేసుకోవడంతో మీనాక్షి నటరాజన్ మీద పెట్టుకున్న ఆశలు మెల్లమెల్లగా ఆవిరై పోతున్నాయని అంటున్నారు.   ఇక జిల్లాల్లో పరిస్థితి గురించి అయితే చెప్పుకోనక్కర లేదు. వేదిక పై జిల్లా మంత్రి ఉన్నా మరో నాయకుడు ఉన్నా, పార్టీ సమావేశాలు, చాలవరకు రసాబాసగా ముగుస్తున్నాయి.     మొత్తంగా చూస్తే  పార్టీలో ముందుకన్నా ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలు ఎక్కువ అయ్యాయని అంటున్నారు. మీనాక్షి మేడం ఎంట్రీకి ముందు జిల్లాలకే పరిమితమైన అంతర్గత కుమ్ములాటలు  ఇప్పుడు గాంధీ భవన్  కు చేరుకున్నాయి. అలాగే మంత్రి పదవులు మొదలు నామినేటెడ్ పోస్టుల వరకూ  పదవులు ఆశించి భంగ పడిన వారు, పదవులు ఆశిస్తున్న వారు గాంధీ భవన్ ని ధర్నాచౌక్ గా మార్చేస్తున్నారని అంటున్నారు. చివరకు  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని గట్టి వార్నింగ్ ఇచ్చినా పరిస్థితిలో మార్పు రాలేదు సరికదా.. మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ, కొండా మురళీ తాజా ఎపిసోడ్ తో క్రమశిక్షణ కట్లు తెంచుకున్నన వైనం కనిపిస్తోందని అంటున్నారు.  మరో వంక మంత్రుల మధ్య సయోధ్య  లేకపోవడం, మంత్రుల పని తీరు పట్ల ముఖ్యమంత్రి అసంతృప్తిని వ్యక్తం చేయడం.. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు అనివార్యం కావడంతో..  రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ కు చేతి నిండా పనుందని.. అలాగే  అంతర్గత, బహిర్గత రాజకీయం వేడెక్కుతున్న నేపథ్యంలో  మీనాక్షి నటరాజన్ కు చేతి నిండా పని మాత్రమే కాదు, సవాళ్ళూ చాలానే ఉన్నాయని అంటున్నారు.  నిజానికి, అసలు టెస్ట్ ఇప్పుడే మొదలైందని అంటు న్నారు.

bjp telangana chief ramachandrarao

తెలంగాణ బీజేపీ హెడ్ గా రామ‌చంద్ర‌రావు.. బాబు అనుకూలుడికి అధ్య‌క్ష పీఠ‌మా?

మొన్న‌టి వ‌ర‌కూ కిష‌న్ రెడ్డిని కేసీఆర్ ప్రోగా ఉండే బీజేపీ అధ్య‌క్షుడంటూ ఒక గొడ‌వ న‌డిచేది. అన్న‌ట్టుగానే బీజేపీ తెలంగాణ‌లో గ‌ట్టి పోటీ  ఇవ్వ‌లేక‌.. సెకండ్ ప్లేస్ టు థ‌ర్డ్ ప్లేస్ కి ప‌డిపోయింది  క‌మ‌లం పార్టీ. క‌ట్ చేస్తే ఇప్పుడు రామ‌చంద్ర‌రావు తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడిగా ఎన్నిక  కాబోతున్న ప‌రిస్థితుల్లో ఆయ‌న చంద్ర‌బాబుకు అనుకూలుడు కాబ‌ట్టి ఆయ‌న ఎన్నిక వెన‌క తెలుగుదేశం ఉందంటూ బీఆర్ఎస్ అప్పుడే మొద‌లు పెట్టేసింది. సోష‌ల్ మీడియాలో ఈ త‌ర‌హా పోస్టులు పెడుతూ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఇక్క‌డ బీఆర్ఎస్ గుర్తించాల్సింది  ఏంటంటే చంద్ర‌బాబుకు అనుకూలుడైన  రామ‌చంద్ర‌రావు ఉండ‌టం  కూడా ఒకందుకు పార్టీకి మంచిదే  క‌దా? వ‌చ్చే రోజుల్లో ఏపీకి  ఎన్డీయే కూట‌మి ఎలాగో స‌రిగ్గా అలాగే ఇక్క‌డ స్థానిక సంస్థ‌లు, గ్రేట‌ర్ ఎన్నిక‌లు, ఆపై 2023లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డానికి వెస‌లుబాటు ఉంటుంది క‌దా? ఈ విష‌యం  ఎందుకు గుర్తించ‌డం లేదు? అన్న కామెంట్ వినిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ జ‌న‌సేన, బీజేపీ కూట‌మి క‌ట్టి ఒక ఎన్నిక‌ల‌ను ఎదుర్కున్నాయి. కానీ ఏమంత స‌క్సెస్ ఫుల్ ఆప‌రేష‌న్ జ‌ర‌గ‌లేదు. క‌నీసం కూక‌ట్ ప‌ల్లి వంటి ఆంధ్ర ఓటు బ్యాంకు ఎక్కువ‌గా  ఉన్న  ఏరియాలో కూడా ఈ  బాండింగ్ రిజ‌ల్ట్ ఇవ్వ‌లేదు. 2024 ఎన్నిక‌ల్లో ఏపీలో కూట‌మి విజ‌య దుందుభి మోగించాక కూట‌మి కంటూ కొంత బ‌లం కనిపిస్తోంది. దాని ఫ‌లితాలు క్ర‌మంగా వ‌చ్చేలా తెలుస్తోంది. ఇప్ప‌టి  వ‌ర‌కూ బీజేపీ త‌న  పూర్తి సామ‌ర్ధ్యం క‌న‌బ‌ర‌చ‌లేక పోయింది. మొద‌ట నెట్  ప్రాక్టీస్ గా స్థానిక సంస్థ‌ల  నుంచి మొద‌లు పెడితే, అది గ్రేట‌ర్ త‌ర్వాత అసెంబ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కూ బండి లాగొచ్చు. అందుకు చంద్ర‌బాబుకు అనుకూల నేత ఉండ‌టం వ‌ల్ల ఆ పార్టీకి ఇంకా మేలు చేస్తుందే త‌ప్ప కీడు చేయ‌దు క‌దా? అన్న ప్ర‌శ్న ఉద‌యిస్తోంది. మ‌రి బీఆర్ఎస్ చేస్తున్న ఈ ప్ర‌చారానికి కార‌ణ‌మేంటి?అంటే బీఆర్ఎస్ కి  అప్ప‌టికీ ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ  విల‌న్ చంద్ర‌బాబే. చంద్ర‌బాబును బూచిగా  చూపించి నెగ్గుకు రావాల‌నే ప్ర‌య‌త్నిస్తోంది. త‌న పార్టీ పేరులోని తెలంగాణ సెంటిమెంటును తీసేశాక కూడా ఈ ధోర‌ణిలోంచి కారు పార్టీ బ‌య‌ట‌కు రావ‌డం లేద‌న్న‌మాట‌. 

jagan to reach tadepally gained significance

జగన్ తాడేపల్లి వస్తున్నారహో.. మరో పరామర్శయాత్రకు ముహూర్తం ఫిక్స్!

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి సోమవారం (జూన్ 30)సాయంత్రం బయలుదేరి తాడేపల్లికి రానున్నారు. 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత జగన్ ఆంధ్రప్రదేశ్ కు, తాడేపల్లిలోని ఆయన ప్యాలెస్ కు చుట్టపు చూపుగానే వస్తున్నారు. దీంతో జగన్ తాడేపల్లి ప్యాలెస్ రాకకు పెద్దగా ప్రధాన్యత ఉండే అవకాశం లేదు. కానీ ఆయన సోమవారం (జూన్ 30) తాడేపల్లికి రానుండటం మాత్రం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఇటీవల ఆయన పల్నాడులోని రెంటపాళ్ల పర్యటన సందర్బంగా జరిగిన సంఘటనే. పోలీసు ఆంక్షలను ధిక్కరించి మరీ ఇయన  వందలాది వాహనాలు, వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీగా రెంటపాళ్ల పర్యటన చేశారు. ఆ సందర్భంగా ఆయన ఉన్న వాహనం కిందనే పడి వైసీపీ కార్యకర్త సంగమయ్య మరణించారు. దీనికి సంబంధించి జగన్ ఏ2గా కేసు నమోదైంది. దీంతో ఈ కేసు కొట్టివేయాలంటూ ఆయన కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు జగన్ పిటిషన్ విచారణను జూన్ 1 కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో జగన్ జూన్ 30 సాయంత్రానికి తాడేపల్లి ప్యాలెస్ కు రానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ క్వాష్ పిటిషన్ పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న తరుణంలో  జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో సోమవారం (జూన్ 30) రాత్రి పార్టీ కీలక నేతలతో భేటీ కానుండటం ప్రాముఖ్యత సంతరించుకుంది.  అంతే కాకుండా వచ్చే నెల 2న జగన్  నెల్లూరు జైలులో ఉన్న మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాణి గోవర్దన్ రెడ్డిని పరామర్శించుంకుదు నెల్లూరు పర్యటనకు వెళ్లనున్నారు. వైసీపీ అధినేత జగన్ పర్యటన అన్నారంటే అతి కచ్చితంగా పరామర్శ యాత్రే అయి ఉంటుంది. జగన్ తన పరామర్శయాత్రల ద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించడమే ధ్యేయమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అందుకే సాధారణంగా తన పరామర్శ యాత్రలు దిగ్విజయమయ్యాయనీ, జన స్పందన బ్రహ్మాండంగా ఉందనీ సొంత మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇక జగన్ యాత్రలలో పరామర్శ సంగతి పక్కన పెడితే.. చంద్రబాబుపై విమర్శలు, ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన  తాడేపల్లి ప్యాలెస్ లో పార్టీ కీలక నేతలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చారంటే.. ఏదో ఒక పరామర్శ యాత్రకు బయలుదేరడానికేనని పార్టీ శ్రేణులే చెప్పుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆయన సోమవారం తాడేపల్లి ప్యాలస్ కు రావడం, పార్టీ కీలక నేతలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఒక వైపు క్వాష్ పిటిషన్ పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది, మరో వైపు బుధవారం (జులై2 ) నెల్లూరు పర్యటనలో అనుసరించాల్సిన వ్యూహమేంటి అన్నదానిపై చర్చించేందుకే జగన్ తాడేపల్లి చేరుకోనున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

blast in chemical factory

కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు.. ఐదుగురు కార్మికులు మృతి

పఠాన్‌చెరు మండలం పాశ మైలారం పారిశ్రామిక వాడలోని సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం  (జూన్ 30) ఉదయం సంభవించిన భారీ పేలుడులో కనీసం ఎనమండుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. కార్మికులు పని చేస్తున్న సమయంలో ఒక్కసారిగా రియాక్టర్ పేలిపోయి మంటలు ఎగసిపడ్డాయి. పేలుడు ధాటికి రియాక్టర్ వద్ద పని చేస్తున్న కార్మికులు దాదాపు వంద మీటర్ల దూరానికి ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే ఐదుగురు కార్మికులు మరణించగా, మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.  ఘటనా స్థలానికి చేరుకున్న   ఫైర్‌ ఇంజిన్లు మంటలను అదుపుచేశాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు.  

new twist in swetcha sucide case

స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. నా భర్త అమాయకుడంటున్నపూర్ణచందర్ భార్య

తెలుగు న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ భార్య స్వప్న   తెరపైకి వచ్చి సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త అమాయకుడని, అసలు బాధితురాలు తనేనంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఈ కేసులో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి.  స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో నిందితుడైన  పూర్ణచందర్‌ను వెనకేసుకొస్తూ ఆయన భార్య స్వప్న మాట్లాడారు. తన భర్త ద్వారానే స్వేచ్ఛ తనకు పరిచయమైందనీ, అప్పుడు వారిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి తనకు తెలియదని చెప్పిన స్వప్న, ఆ తరువాత వారి మధ్య ఎఫైర్ తెలిసి భర్తకు దూరమయ్యానని వివరించారు.   అంతేకాకుండా..  స్వేచ్ఛ తనను మానసికంగా  వేధించిందని స్వప్న ఆరోపించారు. అదే విధంగా పూర్ణచందర్‌ను స్వేచ్ఛ బ్లాక్‌మెయిల్ చేసిందని, తన పిల్లలను కూడా "అమ్మా" అని పిలవాలంటూ భయపెట్టిందని చెప్పారు. స్వేచ్ఛ కుమార్తె అరణ్య తన భర్తపై చేస్తున్న ఆరోపణల్లో ఇసుమంతైనా నిజం లేదని స్వప్నచెప్పిన స్వప్న పూర్ణచందర్ అరణ్యను సొంత కూతురిలాగే చూసుకున్నాడన్నారు.  నిందితుడి భార్య మృతురాలిపై ఆరోపణలు చేయడం ఈ కేసు దర్యాప్తులో ఈ వ్యాఖ్యలు కీలకంగా మారే అవకాశం ఉంది.

telugu states bjp persidents selected

నాగపూర్ నిర్ణయం మేరకే తెలుగు రాష్టాలకు బీజేపీ కొత్త సారథులు?

ఉభయ తెలుగు రాష్ట్రాలకు బీజేపీ నూతన అధ్యక్షులు ఎవరో తేలిపోయింది? ఇంతవరకు అనేక కోణాల్లో, అనేక సమీకరణలు ఆధారంగా  లెక్కలు కట్టిన కమల దళం చివరకు నాగపూర్ ఎంపిక చేసిన పాత కాపులకే పట్టం కట్టింది. ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రానికి మాజీ ఎమ్మెల్సీ పీవీ మాధవ్, తెలంగాణకు మాజీ ఎమ్మెల్సీ  రామచంద్రరావు పేర్లను, బీజీపీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు ఇద్దరు నేతలకు ఆధిస్థానం నుంచి ఆదేశాలు  అందినట్లు తెలుస్తోంది.   నిజానికి..  ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్ష పదవి కోసం  సీనియర్ నాయకులు చాలా  మంది పోటీ పడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మొదలు, పాత, కొత్త నాయకులు చాలా మందే రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశించారు.  ఇక తెలంగాణలో అయితే..  చెప్పనే అక్కర లేదు. ఎంపీలు ఈటల రాజేందర్ , ధర్మపురి అరవింద్, డీకే అరుణ,మాజీ అధ్యక్షులు లక్ష్మణ్ , బండి  సంజయ్ ఇలా చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. ఒక దశలో ఈటల పేరు ఖరారు అయినట్లే ప్రచారం జరిగింది.. అయితే.. చివరి క్షణంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ సంఘ్ (ఆర్ఎస్ఎస్) బ్యాక్ గ్రౌండ్ ఉన్న  పీ మాధవ్, రామచంద్రరావు పేర్లను ఆదిష్ఠానం ఖరారు చేసింది.  దీంతో ఇదరి ఎంపిక నాగపూర్ నిర్ణయంగా భావిస్తునారు. నిజనికి  ఇద్దరూ కూడా సంఘ్  సిద్దాంత పునాదులపై  ఎదిగిన నాయకులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ, పీవీ చలపతి రావు కుమారుడు మాధవ్, బీజేపీలో సాధారణ కార్యకర్త మొదలు అనేక బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుత రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే, రామచంద్ర రావు బాల్యం నుంచి సంఘ్  సంపర్కంలో పెరిగారు  ఏబీవీపీ లో క్రియాశీలంగా పనిచేసిన ఆయన బీజేపీలో లీగల్ సెల్ బాధ్యలతో పాటుగా పార్టీ బాధ్యలు నిర్వహించారు. సోమవారం (జూన్ 30) మధ్యాన్నం 2 గంటల తర్వాత  ఏపీలో మాధవ్,   తెలంగాణలో రామచంద్ర రావు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోది. అయితే.. ఒక్కరొక్కరే నామినేషన్ వేస్తారా?  ఇతరులు కూడా నామినేషన్ వేసే అవకాశ్ ఉందా అనే విషయంలో క్లారిటీ లేదు. తెలంగాణలో మాత్రం ఈటల కూడా నామినేషన్ వేసే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే రాజాసింగ్ తాను కూడా నామినేషన్ వేస్తానని చెబుతున్నట్లు తెలుస్తోంది. 

subinspector wife sucide

పురుగుల మందు తాగి ఎస్సై భార్య ఆత్మహత్య

పురుగుల మందు తాగి ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖమ్మం జిల్లాలో  జరిగింది. ఖమ్మం రైల్వే ఎస్సై రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆమెను వెంటనే ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. అయితే మృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం రాణాప్రతాప్ వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. ఇలా ఉండగా రాణాప్రతాప్ ది తొలి నుంచీ దుందుడుకు వ్యవహరించే తత్వమనీ, ఖమ్మంలో ట్రైనీగా ఉన్న సమయంలోనే ఆయన వ్యవహార శైలి వివాదాస్పదంగా ఉండేదనీ చెబుతున్నారు. ఇలా ఉండగా ఆత్మహత్య చేసుకున్న రాణా ప్రతాప్ భార్య మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

amarawathi as center of quantam technology

క్వాంటం పరిశోధనలకు కేంద్రం అమరావతి.. చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటం వ్యాలీపై ఈ రోజు విజయవాడలో నిర్వ‌హించ‌నున్న‌ నేషనల్ క్వాంటం వర్క్‌షాప్ లో పాల్గొనేందుకు అంతర్జాతీయ ఐటీ సంస్థలు,  బహుళజాతి కంపెనీల ప్రతినిధులు  రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారికి తన ఉండవల్లి నివాసంలో  ఆదివారం  విందు ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా ఆయన విందులో పాల్గొన్న   ప్రతినిధులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ సమావేశంలో క్వాంటమ్ వ్యాలి లక్ష్యాలను వివరించారు. అమరావతిలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్న క్వాంటం వ్యాలీ ప్రాజెక్టు ద్వారా అమరావతిని క్వాంటం పరిశోధనకు కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు.  దేశంలోనే  ఈ స్థాయిలో క్వాంటం టెక్నాలజీకి అంకితమైన పార్కు ఇదు మొదటిదని చెప్పారు.  ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి ప్రముఖ సంస్థల సహకారంతో క్వాంటం వ్యాలీని అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.   కాగా చంద్రబాబు ఇచ్చిన విందుకు టీసీఎస్ ప్రెసిడెంట్ అండ్ గ్లోబల్ హెడ్  వి. రాజన్న, మైక్రోసాఫ్ట్ ఇండియా ఎండీ రాజీవ్ కుమార్, ఏటీ అండ్ టీ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ సిద్ధు, వార్నర్ బ్రదర్స్ ఇండియా ఇన్నోవేషన్ సెంటర్ హెడ్ మనీష్ వర్మ, భారత్ బయోటెక్ వ్యవస్థాపకురాలు సుచిత్రా కె. ఎల్లా, హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్‌, నేషనల్ క్వాంటం మిషన్ డైరెక్టర్ జె.బి.వి. రెడ్డి, రెడ్డీ ల్యాబ్స్ ఫణి మిత్ర, అస్ట్రా జెన్గా ఎండీ ప్రవీణ్ రావు, ఐబీఎం ఇండియా వైస్ ప్రెసిడెంట్ స్కాట్ క్రౌడర్, కేంద్ర శాస్త్రసాంకేతిక మంత్రిత్వశాఖ కార్యదర్శి అభయ్ కరాండికర్, కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అజయ్ కుమార్ సూద్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. 

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో  అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అప్పపీడనం రానున్న రెండు రోజుల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ వైపు పయనించే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ రాజస్థాన్, ఉత్తర గుజరాత్ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. ఈ ప్రభావంతో వచ్చే మూడు రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయససీమలలో  వర్షాలు కురుస్తాయని తెలిపింది.  

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

అన్నమయ్య జిల్లాలో ఈ తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. తిరుమల నుంచి కర్నాటకలోని బాగేపల్లి వెడుతున్న టెంపుల్ ట్రావెల్ ను లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటన తంబళ్లపల్లి నియోజకవర్గ పరిధిలోని కురబలకోట మండలం చెన్నామర్రిమిట్ట వద్ద జరిగింది. దుర్ఘటన జరిగిన సమయంలో టెంపుల్ ట్రావెల్ లో డ్రైవర్ సహా 14 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు సంఘటనా స్థలంలోనే కన్నుమూశారు. మరో తొమ్మది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటున్నారు. ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. 

ఏపీలో 10 జాతీయ రహదారుల విస్తరణ..డీపీఆర్‌కు కేంద్రం ఆదేశాలు

  ఆంధ్రప్రదేశ్‌లో పది జాతీయ రహదారులు విస్తరణకు నోచుకోనున్నాయి. రోడ్లపై వాహన రద్దీతో పాటు మున్ముందు మరింత ట్రాఫిక్‌ పెరిగే అవకాశం ఉందని గుర్తించడంతో వాటి విస్తరణపై కేంద్రం దృష్టిపెట్టింది. ఆయా జాతీయ రహదారులను 988 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించింది. 988 కిలోమీటర్ల విస్తరణకు డీపీఆర్‌ తయారీకి కేంద్రం ఆదేశాలు - 2025-26 వార్షిక ప్రణాళికలో చేర్చిన మోర్త్‌ కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు 380 కిలోమీటర్ల NH-216ని నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. ఇందులో కత్తిపూడి నుంచి కాకినాడ వరకు 27 కిలోమీటర్లు ఇప్పటికే నాలుగు వరుసలుగా ఉంది. దీనిని ఆరు వరుసలు చేయనున్నారు. మిగిలిన భాగం ప్రస్తుతం రెండు వరుసలు ఉండగా నాలుగు వరుసలుగా విస్తరిస్తారు.  కర్నూలు నుంచి నంద్యాల, కడప, రాయచోటి, పీలేరు, చిత్తూరు మీదుగా తమిళనాడులోని రాణీపేట వరకు ఉన్న NH-40ని కడప నుంచి చిత్తూరు జిల్లాలోని రంగంపేట క్రాస్‌ వరకు 148 కిలోమీటర్లు 4 వరుసలుగా విస్తరించనున్నారు శ్రీ సత్యసాయి జిల్లాలోని కొడికొండ చెక్‌పోస్ట్‌ నుంచి సిర వరకు 99 కిలోమీటర్లు 4వరుసలు చేస్తారు. ఏపీ, కర్ణాటక సరిహద్దు నుంచి కదిరి, ముదిగుబ్బ మీదుగా అనంతపురం వరకు 86 కిలోమీటర్లు 4 వరుసలుగా విస్తరిస్తారు. ఇందులో కదిరి, ముదిగుబ్బల వద్ద బైపాస్‌లు కూడా ఉన్నాయి. పలమనేరు నుంచి కుప్పం మీదుగా తమిళనాడులోని కృష్ణగిరి సరిహద్దు వరకు 97 కిలోమీటర్ల విస్తరిస్తున్నారు