LATEST NEWS
గడిచిన ఏడు వారాలుగా ప్రపంచాన్ని వణికించిన పర్షియన్ గల్ఫ్ ఉద్రిక్తతలు ఒక కీలక మలుపు తిరిగాయి. అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ ప్రభుత్వం పూర్తిగా పునఃప్రారంభించింది. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ఈ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా నిలిచిపోతుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే, ప్రస్తుత కాల్పుల విరమణ నేపథ్యంలో ఈ మార్గం తిరిగి తెరవడంతో గ్లోబల్ ఎకానమీకి భారీ ఊరట లభించినట్లయింది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పరిణామాలు కనిపించాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో ఐదో వంతు వాటా కలిగిన ఈ మార్గం గుండా నౌకల రాకపోకలు సాఫీగా సాగడంతో, ముడి చమురు ధరలు 10 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. అటు అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మరియు యూరోప్ దేశాలకు, ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్, చైనా వంటి దేశాలకు ఇది తక్షణ ఆర్థిక ఊపిరిని అందించింది.
అయితే, హోర్ముజ్ జలసంధి తెరుచుకున్నంత మాత్రాన సమస్య పూర్తిగా సర్దుమణిగిందని భావించలేము. ఇక్కడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో ద్వంద్వ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల కోసం జలసంధిని ఓపెన్ చేసినప్పటికీ.. ఇరాన్ లోని ప్రధాన ఓడరేవులపై అమెరికా నౌకాదళ దిగ్బంధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అంటే.. ప్రపంచానికి చమురు అందుబాటులోకి వచ్చేలా చేస్తూనే.. ఇరాన్ సొంత ఆర్థిక వ్యవస్థను మాత్రం అమెరికా తన అదుపులో ఉంచుకుంది. శాంతి చర్చలలో ఇరాన్‌ను లొంగదీసుకోవడానికి వాషింగ్టన్ దీనిని ఒక బలమైన 'లీవరేజ్'గా ఉపయోగిస్తోంది. శాంతి చర్చల తదుపరి ఘట్టం ఇప్పుడు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు చేరడం విశేషం. ఈ వారాంతంలోనే అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య రెండో రౌండ్ ప్రత్యక్ష చర్చలు ఇక్కడ జరిగే అవకాశం ఉంది. పాకిస్థాన్‌కు అటు అమెరికాతో రక్షణ సంబంధాలు, ఇటు ఇరాన్‌తో సున్నితమైన సరిహద్దు సంబంధాలు ఉండటంతో ఇస్లామాబాద్‌ను వేదికగా ఎంచుకున్నారు.
ఒకవేళ ఇక్కడ ఒప్పందం ఖరారైతే, స్వయంగా ట్రంప్ పాకిస్థాన్ సందర్శించే అవకాశం ఉందన్న వార్తలు ఆ దేశ దౌత్య ప్రతిష్ఠను పెంచుతున్నాయి. కేవలం పాకిస్థాన్ మాత్రమే కాకుండా, సౌదీ అరేబియా, ఖతర్ మరియు టర్కీ వంటి దేశాలు కూడా ఈ సంక్షోభ నివారణకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నాయి. పాక్ సైన్యాధిపతి జనరల్ ఆసిమ్ మునీర్ ఇప్పటికే తెహ్రాన్‌లో పర్యటించి కీలక నేతలతో భేటీ అయ్యారు. గల్ఫ్ ప్రాంతంలో శాశ్వత శాంతి నెలకొల్పడం మరియు భవిష్యత్తు భద్రతా ముసాయిదాను రూపొందించడంలో ఈ ప్రాంతీయ దేశాల పాత్ర కీలకంగా మారింది.ప్రస్తుతం చర్చల బల్లపై ఉన్న ప్రధాన అంశం 'డబ్బుకు ప్రతిగా అణు నియంత్రణ'. సుమారు మూడు పేజీల ఫ్రేమ్‌వర్క్ డాక్యుమెంట్‌పై ఇరు దేశాల ప్రతినిధులు కసరత్తు చేస్తున్నారు.
దీని ప్రకారం, అమెరికా ఆంక్షల వల్ల విదేశాల్లో స్తంభించిపోయిన బిలియన్ల కొద్దీ డాలర్ల నిధులను ఇరాన్ తిరిగి పొందుతుంది. దీనికి బదులుగా, ఇరాన్ తన వద్ద ఉన్న ఎన్‌రిచ్డ్ యురేనియం నిల్వలను తగ్గించుకోవాలి లేదా వేరే దేశానికి తరలించాలి. అణ్వాయుధ తయారీ దిశగా ఇరాన్ అడుగులు వేయకుండా కఠినమైన అంతర్జాతీయ పర్యవేక్షణ ఉండాలని అమెరికా పట్టుబడుతోంది.ఇరాన్ సైతం తన సార్వభౌమత్వానికి భంగం కలగకుండా, ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా చర్చలు జరుపుతోంది. తమ అణు కార్యక్రమం శాంతియుతమైనదని వాదిస్తున్న తెహ్రాన్, గౌరవప్రదమైన రీతిలో ఆంక్షల నుంచి విముక్తి కోరుకుంటోంది. గతంలో జరిగిన దాడుల్లో ధ్వంసమైన సైట్ల నుంచి 'న్యూక్లియర్ డస్ట్' ఇచ్చేందుకు సిద్ధమనడం ద్వారా, పర్యవేక్షణకు తాము వ్యతిరేకం కాదనే సంకేతాన్ని ఇరాన్ పంపింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభం అనేది శాంతి దిశగా పడిన ఒక ముందడుగు మాత్రమే, అది అంతిమ పరిష్కారం కాదు. ప్రస్తుతం ఇరు పక్షాల మధ్య చర్చల్లో వేగం పెరిగినప్పటికీ, ఆంక్షల తొలగింపు, అణు వెరిఫికేషన్ మెకానిజంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఏదైనా చిన్న పొరపాటు లేదా మూడో పక్షం ప్రమేయం జరిగితే ఈ చర్చలు మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉంది.
ఆ ప్రమాదం ఇప్పటికే ముంచుకొచ్చింది కూడా. ట్రంప్ నౌకాదళ దిగ్బంధనం ప్రకటన చేసిన తరువాత ఇరాన్ షార్ప్ గా రియాక్టైంది. హర్మూజ్ జలసంధిని మూసేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లైంది. ఈ పరిస్థితుల్లో ఇస్లామాబాద్ లో శాంతి చర్చల వ్యవహారం కూడా డోలాయమానంగా మారింది.
- సీతారాం కంఠమనేని
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై బీజేపీ మండిపడుతోంది. దేశంలోని సగం జనాభా ప్రయోజనాలను విపక్షాలు కాలరాశాయని ఫైర్ అవుతోంది. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. చారిత్రాత్మకమైన ఈ బిల్లును అడ్డుకోవడం ద్వారా ప్రతిపక్షాలు తమ మహిళా వ్యతిరేక ధోరణిని బయటపెట్టుకున్నాయని విమర్శిస్తోంది.పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు తగినంత మెజారిటీ లభించకపోవడంతో అది వీగిపోయిన సంగతి తెలిసిందే. రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఓటింగ్‌లో పాల్గొన్న 528 మంది సభ్యులలో 298 మంది బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా, 230 మంది వ్యతిరేకించారు. బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 352 ఓట్లు అవసరం.
ఈ పరిణామంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వంటి పార్టీలు అడ్డుకున్నాయన్నారు. నారీ శక్తిని గౌరవించని విపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ ఓటమి కేవలం ప్రభుత్వానిది కాదని, దేశంలోని కోట్లాది మంది మహిళల ఆకాంక్షలకు తగిలిన దెబ్బగా బీజేపీ అభివర్ణించింది.
రాజ్యాంగ సవరణ బిల్లుతో ముడిపడి ఉన్న డీలిమిటేషన్ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లులను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మహిళా రిజర్వేషన్ల అమలుకు పునర్విభజన ప్రక్రియ కీలకమని ప్రభుత్వం వాదించినప్పటికీ.. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందనే ఆందోళనతో విపక్షాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించాయి. ముఖ్యంగా 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సంఖ్యను పెంచడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు వాదించారు.
మహిళల హక్కులను అడ్డుకున్న విపక్షాల అసలు రంగును బయటపెడతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ హెచ్చరించారు. గ్రామం నుంచి నగరం వరకు నిరసనలుతెలియజేయాలని బీజేపీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలతో సమావేశమైన బీజేపీ నేతలు.. రానున్న రోజుల్లో చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాలపై కార్యాచరణ రూపొందించారు. పార్లమెంట్ ఆవరణలో కూడా ఎన్‌డీఏ మహిళా ఎంపీలు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. విపక్షాల మహిళా వ్యతిరేక ముఖం బయటపడిందంటూ నినాదాలు చేశారు.
మహిళా రిజర్వేషన్ల విషయంలో గత కొన్ని దశాబ్దాలుగా ఉన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు మోదీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని విపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుకున్నాయని విమర్శించారు. ఒకవైపు ప్రభుత్వం తన ప్రయత్నాన్ని సమర్థించుకుంటుండగా, మరోవైపు విపక్షాలు డీలిమిటేషన్ సాకుతో బీజేపీ రాజకీయ ప్రయోజనాలను పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బీజేపీ పిలుపునిచ్చిన దేశవ్యాప్త నిరసనలు ఏ మేరకు ప్రభావం చూపుతాయో చూడాలి.ఈ బిల్లు వీగిపోవడం వల్ల 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ల అమలుపై సందిగ్ధత నెలకొంది. నియోజకవర్గాల పునర్విభజన లేకుండా మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతోంది. ఈ రాజకీయ ప్రతిష్టంభన మధ్య మహిళా హక్కుల అంశం ఇప్పుడు వీధి పోరాటంగా మారనుంది.
కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం మహిళలను మోసం చేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. మహిళా సాధికారత వైపు భారత్ వేయాల్సిన చారిత్రాత్మక అడుగును కాంగ్రెస్ అడ్డుకుందని విమర్శించారు. సమానహక్కులు, సముచిత ప్రాతినిథ్యం కోరుతున్న కోట్లాది మంది మహిళలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ఇది కేవలం రాజకీయపరమైన అడ్డంకి మాత్రమే కదన్న ఆయన కాంగ్రెస్ ద్రోహాన్ని దేశం ఎప్పటికీ మరిచిపోదని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ALSO ON TELUGUONE N E W S
- సౌందర్య మౌనం వెనుక విషాదం ఏంటి?
- ఆ లేఖలో ఏముంది?
- జ్ఞాపకాల పందిరిలో శ్రీకాంత్
టాలీవుడ్ ఫ్యామిలీ హీరో శ్రీకాంత్, అందాల నటి సౌందర్య కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేశాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో, శ్రీకాంత్ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఎమోషనల్ అవ్వడం అభిమానుల హృదయాలను హత్తుకుంటోంది. ముఖ్యంగా సౌందర్యకు సంబంధించిన ఒక సీన్ మరియు ఆమె రాసినట్లుగా భావిస్తున్న లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
నిన్నే ప్రేమిస్తా చిత్రంలోని ఈ వీడియోలో శ్రీకాంత్ తన గతాన్ని తలచుకుంటూ ఒక పాత ఫోటోను చూసి కన్నీటి పర్యంతమవ్వడం కనిపిస్తుంది. ఆ ఫోటోలో సౌందర్య రూపం సగం చిరిగిపోయి ఉండటం ఆ సన్నివేశంలోని గాఢతను తెలియజేస్తోంది. ఆ తర్వాత వచ్చే సన్నివేశాల్లో, ఒక పోస్ట్‌మ్యాన్ వచ్చి శ్రీకాంత్‌కు ఒక లేఖను అందజేస్తాడు. ఆ లేఖ చదివిన శ్రీకాంత్ ముఖంలో చెప్పలేని వేదన కనిపిస్తుంది.
ఈ కథలో అసలు ట్విస్ట్ ఏమిటంటే, సౌందర్య తన మనసులోని మాటలను ఆ లేఖ ద్వారా వ్యక్తపరిచినట్లు తెలుస్తోంది. తన ప్రేమను నేరుగా చెప్పలేక, రాతపూర్వకంగా శ్రీకాంత్‌కు తెలియజేయడం ఈ సీన్‌కే హైలైట్ అని చెప్పాలి. శ్రీకాంత్ తన స్నేహితుడితో కలిసి ఆ జ్ఞాపకాలను వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో ఎదురయ్యే సంఘటనలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తున్నాయి.
వీడియో చివరలో శ్రీకాంత్ మరియు సౌందర్య ఒక దేవాలయం వద్ద ఎదురుపడతారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య ఎటువంటి మాటలు లేకపోయినా, కేవలం చూపులతోనే ఎంతో భావోద్వేగాన్ని పండించారు. శ్రీకాంత్ కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా, సౌందర్య మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోవడం చూస్తుంటే వారి మధ్య ఉన్న బంధం ఎంత బలమైనదో అర్థమవుతుంది.
ఈ ఎమోషనల్ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "అప్పట్లో శ్రీకాంత్-సౌందర్య జోడీ అంటే ఒక వెలుగు వెలిగింది" అని కొందరు అంటుంటే, "ఈ సీన్ చూస్తుంటే పాత సినిమాలు గుర్తొస్తున్నాయి" అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ పాత వీడియో మళ్లీ వెలుగులోకి రావడంతో పాత తరం సినిమాలపై ఉన్న క్రేజ్ మరోసారి నిరూపితమైంది. ఇలాంటి మరిన్ని ఎమోషనల్ వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.
- సినిమాల్లో సీఎం అవ్వడం వేరు, నిజ జీవితం వేరు
- దళపతిపై ఘాటు విమర్శలు
- హీరోలను నమ్మి అధికారం ఇస్తామా?
తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతున్న 'దళపతి' విజయ్, 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆయన పొలిటికల్ ఎంట్రీపై అటు అభిమానుల్లో ఉత్సాహం ఉన్నప్పటికీ, ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, విజయ్ రాజకీయ ప్రస్థానంపై చేసిన కొన్ని పరోక్ష వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలోనూ, రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారాయి.
చెన్నైలో జరిగిన ఒక రాజకీయ ప్రచార సభలో పాల్గొన్న ప్రకాష్ రాజ్, ప్రస్తుతం తమిళనాడులో ఉన్న రాజకీయ పరిస్థితులపై తనదైన శైలిలో స్పందించారు. సినిమాలో హీరోగా నటించడం, ఒక మూడు గంటల పాటు వెండితెరపై ముఖ్యమంత్రిగా కనిపించడం వేరని.. కానీ నిజ జీవితంలో ప్రజా సమస్యలను పరిష్కరించడం అంత సులభం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక నటుడు రాజకీయాల్లోకి రావడం తప్పు కాదు కానీ, కేవలం స్టార్‌డమ్ చూపి ఓట్లు అడగడం కరెక్ట్ కాదని ఆయన పేర్కొన్నారు.
ప్రకాష్ రాజ్ తన ప్రసంగంలో విజయ్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ, ఆయన మాటలు 'తమిళ సినిమా మోడల్' రాజకీయాల గురించి ఉండటంతో అవి విజయ్‌ను ఉద్దేశించినవే అని విశ్లేషకులు భావిస్తున్నారు. "మనం ఒక హీరోను ఇష్టపడితే థియేటర్లలో ఈలలు వేయొచ్చు, గోల చేయొచ్చు.. కానీ కేవలం ఆ అభిమానంతో రాష్ట్రాన్ని వారి చేతుల్లో పెట్టేయగలమా?" అంటూ ప్రకాష్ రాజ్ సంధించిన ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజలకు కష్టమొచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారో ఆలోచించాలని ఆయన హితవు పలికారు.
గతంలో కూడా ప్రకాష్ రాజ్ సామాజిక అంశాలపై స్పందిస్తూ తన గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. కేవలం నటుడిగానే కాకుండా ఒక బాధ్యతాయుతమైన ఓటరుగా ప్రజలకు వాస్తవాలు చెప్పడమే తన బాధ్యత అని ఆయన గట్టిగా నమ్ముతారు. తమిళనాడులో ప్రస్తుతం ద్రావిడ సిద్ధాంతాలు, జాతీయ రాజకీయాల మధ్య నడుస్తున్న పోరులో సినీ తారల ఎంట్రీ ఎంతవరకు ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.
విజయ్ గతంలో ప్రకాష్ రాజ్‌తో కలిసి 'గిల్లి' (తెలుగులో ఒక్కడు రీమేక్), 'పోకిరి' వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. వెండితెరపై వీరిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. అలాంటిది ఇప్పుడు రాజకీయాల నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అభిమానుల్లో చర్చకు దారితీసింది. విజయ్ పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉంటే, ఆయనను విమర్శించే వారి సంఖ్య కూడా మెల్లగా పెరుగుతోంది.
మరోవైపు, విజయ్ అభిమానులు మాత్రం ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. విజయ్ కేవలం స్టార్‌డమ్ నమ్ముకుని కాకుండా, క్షేత్రస్థాయిలో సేవా కార్యక్రమాలు చేస్తూ రాజకీయాల్లోకి వచ్చారని వారు వాదిస్తున్నారు. సోషల్ మీడియాలో 'దళపతి' ఫ్యాన్స్ మరియు ప్రకాష్ రాజ్ మద్దతుదారుల మధ్య పెద్ద ఎత్తున యుద్ధమే జరుగుతోంది.
త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్ తన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. రాజకీయ రణక్షేత్రంలో విజయ్ తన సత్తా చాటుతారా? లేదా ప్రకాష్ రాజ్ అన్నట్టు సినిమాలకు, రాజకీయాలకు ఉన్న వ్యత్యాసాన్ని గ్రహించి మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తారా? అనేది వేచి చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ఈ 'సినిమా వర్సెస్ పాలిటిక్స్' రచ్చ తమిళనాడు దాటి తెలుగు రాష్ట్రాల్లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
2022లో సోహెల్ కతురియాతో ఘనంగా పెళ్లి
గత నెల 11 న డైవర్స్
తొలిసారి స్పందించిన హన్సిక
హమ్మయ్య ఇప్పుడు హన్సిక(Hansika Motwani)అభిమానులు ఫుల్ హ్యాపీ. తన భర్త సోహెల్ కతురియాతో మార్చి 11, 2026న విడాకులు తీసుకున్నా కూడా అభిమానుల్లో ఏ మూలనో హన్సిక కి విడాకులు తీసుకోవడం ఇష్టమేనా, లేక ఎవరి బలవంతమైన ఉందా అని మదన పడుతూ ఉన్నారు. కానీ రీసెంట్ గా హన్సిక స్పందించడంతో వాళ్లంతా ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
రీసెంట్ గా హన్సిక ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో ఆమె మాట్లాడుతు మనం ఎప్పుడైనా తెలియక తప్పుడు రైలు ఎక్కినప్పుడు అది తప్పు అని తెలిసిన వెంటనే దిగిపోవడమే మంచిది. బాధపడుతు ప్రయాణాన్ని కొనసాగించడంలో అర్థం లేదు. నేను తీసుకున్న నిర్ణయం పట్ల ఎలాంటి పశ్చాత్తాపం లేదు.ప్రస్తుతం నేను మానసిక ప్రశాంతతతో చాలా సంతోషంగా ఉన్నాను. విడాకులకి దారితీసిన కారణాలు వ్యక్తిగతం. వాటిని బయటపెట్టడానికి నాకు ఇష్టం లేదు. కష్టకాలంలో నా తల్లి, సోదరుడు అండగా నిలిచారు. వారి మద్దతుతోనే ఆ చీకటి రోజులని దాటగలిగానని హన్సిక చెప్పుకొచ్చింది.
also read: Nagababu: రాముడు vs నాగబాబు vs ప్రకాష్ రాజ్.. ప్రకాష్ రాజ్ అస్సలు ఊహించి ఉండడు
హన్సిక, సోహెల్ కతురియాల వివాహం 2022లో చాలా ఘనంగా జరిగింది. సోహైల్ కి హన్సికతో రెండవ వివాహం. 2024 నుంచే విడిగా ఉంటున్న ఈ జంట పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకోవడం జరిగింది.
- నాలుగు సినిమాలపై క్లారిటీ!
- తారక్ ఫ్యాన్స్‌కు పండగే..
- మే 20న ఎన్టీఆర్ డబుల్ ధమాకా
మే నెల వచ్చిందంటే చాలు నందమూరి అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. దానికి కారణం మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడమే. అయితే ఈ ఏడాది తారక్ బర్త్ డే వేడుకలు కేవలం సోషల్ మీడియా విషెస్‌కే పరిమితం కాకుండా, బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించేలా ప్లాన్ చేస్తున్నారట. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు భారీ ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్స్ ఒకేరోజు రాబోతున్నాయని ఫిల్మ్ నగర్ టాక్.
ప్రస్తుతం ఎన్టీఆర్ లైనప్‌లో ఉన్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'డ్రాగన్'. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను బర్త్ డే స్పెషల్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. నీల్ మార్క్ ఎలివేషన్లతో కూడిన ఈ చిన్న వీడియో అభిమానులకు అసలైన కనువిందు చేయనుందని సమాచారం.
మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'దేవర' పార్ట్ 1 సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఫ్యాన్స్ 'దేవర 2' ఎప్పుడు మొదలవుతుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. స్క్రిప్ట్ పనులు పూర్తయినప్పటికీ, షూటింగ్ షెడ్యూల్‌పై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మే 20న దేవర పార్ట్ 2పై ఒక పక్కా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందనే విషయంలో ఆరోజు అధికారిక ప్రకటన రావచ్చని తెలుస్తోంది.
ఇక అందరి కళ్లు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్ట్ పైనే ఉన్నాయి. 'అరవింద సమేత' తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న 'గాడ్ ఆఫ్ వార్' సినిమాపై ఇప్పటికే క్రేజీ బజ్ నడుస్తోంది. ఈ సినిమాను ఎప్పుడు మొదలుపెడతారు? అసలు కథా నేపథ్యం ఏంటి? అనే విషయాలపై తారక్ పుట్టినరోజున ఒక స్పెషల్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీనితో పాటు కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు వెట్రిమారన్‌తో ఎన్టీఆర్ చేయబోయే సినిమాపై కూడా ఈసారి ముహూర్తం కుదిరేలా కనిపిస్తోంది.
వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్, తన అప్ కమింగ్ ప్రాజెక్టుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 'డ్రాగన్' తర్వాత ఏ సినిమా ముందుగా సెట్స్ పైకి వెళ్తుంది? 'దేవర 2' ముందా లేక త్రివిక్రమ్ సినిమానా? అనే సస్పెన్స్‌కు ఈ పుట్టినరోజుతో తెరపడనుంది. సోషల్ మీడియాలో ఇప్పటికే #NTRBirthday2026 ట్రెండింగ్ మొదలైపోయింది. ఈ అప్డేట్ల వర్షంలో తారక్ తన అభిమానులకు ఎలాంటి సర్‌ప్రైజ్ ఇస్తారో చూడాలి.
-ప్రకాష్ రాజ్ పై మండిపడుతున్న రామభక్తులు
-అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన నాగబాబు
-నాగబాబుకి రిప్లై ఇస్తాడా!
ప్రకాష్ రాజ్(Prakash Raj),నాగబాబు(Nagababu)కి మధ్య మంచి రిలేషన్ ఉన్న విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్ 'మా' మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నాగబాబు బహిరంగంగానే మద్దతు తెలిపాడు. నాగబాబు నిర్మాతగా వచ్చిన ఆరెంజ్ లో ప్రకాష్ రాజ్ చెయ్యడంతో పాటు టోటల్ మెగా ఫ్యామిలీతో ప్రకాష్ రాజ్ కి మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు ఆ అనుబంధానికి ఫుల్ స్టాప్ పడే విధంగా నాగబాబు చేసిన ట్వీట్ ఉంది. పూర్తి మ్యాటర్ చూద్దాం.
ప్రకాష్ రాజ్ ఇటీవల రాముడు, లక్ష్మణుడుని అవమానిస్తూ మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై రీసెంట్ గా నాగబాబు స్పందిస్తు మిస్టర్ ప్రకాష్ రాజ్, మిమ్మల్ని మీరు 'క్రిస్టియన్ నాస్తికుడిని' అని చెప్పుకున్నప్పటికీ, మీ తల్లిగారి అంత్యక్రియల సమయంలో ఆమె విశ్వాసాలను గౌరవించారు. అదే స్ఫూర్తితో కోట్ల మంది ప్రజల నమ్మకాలని కూడా గౌరవించాలి. నాస్తికత్వం అంటే దేవుళ్లనో లేదా భక్తులనో ఎగతాళి చేయడం కాదు, అది ఒక హేతుబద్ధమైన ఆలోచనా విధానం. నాస్తిక వాదాన్ని కూడా తనలో కలుపుకొని, దానికి తగిన స్థానాన్ని కల్పించిన ఏకైక ధర్మం హిందూ ధర్మం మాత్రమే. అటువంటి గొప్ప సంప్రదాయాన్ని కించపరచడం సరికాదు. వేరే దేశాల్లో గనుక మీరు ఇలాంటి మాటలు మాట్లాడి ఉంటే తీవ్రమైన ఇబ్బందుల్లో పడేవారు. భవిష్యత్తులో గౌరవప్రదంగా ప్రవర్తించని మీలాంటి వ్యక్తుల మాటలకి నేను ఎప్పుడు స్పందించనని తెలిపాడు.
also read: Raasi: అజయ్ ఘోష్ పై రాశి ఆసక్తికర వ్యాఖ్యలు.. నేను అనుకుంది ఆ హీరోని
నాగబాబు నిన్న మాత్రం ప్రకాష్ రాజ్ పేరు ఎత్తకుండా 'శ్రీరాముడు కేవలం హిందువుల దేవుడు మాత్రమే కాదు. ధర్మానికి ప్రతీక. ఆయనని అవమానించడం లేదా తగ్గించాలని చూడటం ధైర్యం కాదు. అదొక మానసిక అంధత్వం. రాముడిని ఎగతాళి చేసేవారు తమని తాము నష్టపర్చు కుంటున్నారు. అజేయమైన ధర్మాన్ని కాపాడే శక్తులు నిరంతరం పని చేస్తుంటాయి. చరిత్రలో న్యాయానికి వ్యతిరేకంగా నిలిచినవారు పతనమయ్యారు. రాముడిపై విషం చిమ్మే వారి భవిషత్తు కూడా అదే అవుతుంది. రాముడి పేరే ఒక కవచం. కథ ఖడ్గం. ఉనికి నాగరికతకి అచంచలమైన కోట' అని పోస్ట్ చేసారు. అలాంటిది ఈ రోజు డైరెక్ట్ గా పేరుతోనే పోస్ట్ చెయ్యడం గమనార్హం.
https://x.com/NagaBabuOffl/status/2045409819939819722?
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు.
టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.
జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్‌లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్‌డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్‌స్టర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు.
చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్ విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది.
ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.
అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి 15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్ పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు ఒకే సారి ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.
రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .
దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.
ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు. వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే.. పిల్లలు అంత గొప్పగా ఎదుగుతారని అనుకుంటారు. కానీ ఇది చాలా తప్పు.. కేవలం పిల్లల కోసం డబ్బు ఖర్చు చేస్తే పిల్లలు తెలివైన వారుగా, మంచి విద్యార్థులుగా, మేధావులుగా ఎదుగుతారు అనుకోవడం మూర్ఖత్వం. రోజువారీ తల్లిదండ్రులు చేసే చిన్న మార్పులు పిల్లల ఆలోచన, ప్రవర్తన , భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. దైనందిన జీవితంలో కొన్ని సాధారణ అలవాట్లను అలవర్చుకోవడం వల్ల పిల్లలు చదువులో రాణించడమే కాకుండా, వారు తెలివైనవారుగా, సృజనాత్మకంగా , తమకు తామే ప్రేరణ ఇచ్చుకుంటూ ముందుకు సాగుతారు. పిల్లలను గొప్పగా తీర్చిదిద్దాలంటే.. తల్లిదండ్రులు అనుసరించాల్సిన ఐదు మార్గాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..
మాట్లాడటం..
నేటి తీరికలేని జీవితాలలో తల్లిదండ్రులు తరచుగా పిల్లలతో కూర్చొని మాట్లాడటాన్ని మరచిపోతుంటారు, కానీ ఈ చిన్న అలవాటు పెద్ద మార్పును తీసుకురాగలదు. ప్రతిరోజూ 10-15 నిమిషాలు పిల్లలతో మనసు విప్పి మాట్లాడాలి. వారి రోజు ఎలా గడిచిందో, పాఠశాలలో ఏమి జరిగిందో, వారి స్నేహితులు ఎలా ఉన్నారో అడగాలి. ఇది పిల్లలు తమ విషయాలను స్వేచ్ఛగా పంచుకోవడానికి ప్రోత్సహిస్తుంది. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అంతేకాకుండా, ఇది వారి ఆలోచనా విధానం, మాట్లాడే సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది.
ప్రశ్నలకు సమాధానాలు..
పిల్లలు ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటారు. కొన్నిసార్లు, వారి ప్రశ్నలతో తల్లిదండ్రులు విసుగు చెంది, వారిని మౌనంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు, ఇది తప్పు. పిల్లలు ప్రశ్న అడిగినప్పుడు, శ్రద్ధగా విని, వివరించడానికి ప్రయత్నించాలి. ఒకవేళ తల్లిదండ్రులకు సమాధానం తెలియకపోతే, ఇద్దరూ కలిసి దాన్ని కనుక్కోవడానికి ప్రయత్నించాలి. ఇది పిల్లల ఆలోచనా సామర్థ్యాన్ని, తర్కాన్ని , సృజనాత్మకతను వేగంగా మెరుగుపరుస్తుంది.
స్క్రీన్ టైం..
ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లు, టీవీలు, టాబ్లెట్లు పిల్లల జీవితంలో ఒక భాగమైపోయాయి. కానీ, స్క్రీన్ ముందు ఎక్కువ సేపు గడపడం వారి మెదడుకు, ఆరోగ్యానికి హానికరం. పిల్లల స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడానికి ప్రయత్నించాలి. దానికి బదులుగా, పుస్తకాలు చదవమని, బొమ్మలు గీయమని, ఆటలు ఆడమని లేదా పజిల్స్ పరిష్కరించమని వారిని ప్రోత్సహించాలి. ఇది వారి ఏకాగ్రతను, ఊహాశక్తిని బలపరుస్తుంది. పిల్లలు ఇవన్నీ ఇష్టంతో చేయాలంటే.. తల్లిదండ్రులు కూడా పిల్లలతో పాటు స్క్రీన్ టైం తగ్గించి వారికి సహకరించాలి.
ఎంకరేజ్..
ప్రతి పిల్లవాడు తమ పనికి ప్రశంసలు పొందాలని కోరుకుంటారు. చిన్న చిన్న విజయాలను సైతం ప్రశంసించడం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆ ప్రశంస హృదయపూర్వకంగా, నిజాయితీగా ఉండేలా చూసుకోవాలి. గద్దించడానికి బదులుగా, ప్రేమతో చెప్పాలి. ఇది పిల్లలు భయపడకుండా నేర్చుకోవడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ప్రోత్సాహం అందిస్తుంది.
తమ పని తాము చేసుకోవడం..
పిల్లలకు వారి బ్యాగ్ వారే సర్దుకోవడం, పుస్తకాలు పెట్టుకోవడం లేదా వారి గదిని శుభ్రం చేసుకోవడం వంటి చిన్న చిన్న బాధ్యతలు అప్పగించడం ముఖ్యం. ఇది వారిలో క్రమశిక్షణ, బాధ్యతను పెంపొందిస్తుంది. క్రమంగా, వారు తమ సొంత నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటారు, ఇది వారి భవిష్యత్తుకు చాలా కీలకం.
పైన చెప్పుకున్నవన్నీ పిల్లల జీవితంలో భాగం చేయగలిగితే.. ఆ పిల్లలు భవిష్యత్తులో మేధావులుగా మారడాన్ని ఎవరూ ఆపలేరు.
*రూపశ్రీ.
మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హిమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు ఒకటుందని కూడా తెలియదు. హీమోఫిలియా అనేది శరీరం రక్తం గడ్డకట్టే సామర్థ్యాన్ని ప్రభావితం చేసే ఒక ఆరోగ్య పరిస్థితి. శరీరంలో రక్తం గడ్డకట్టే కారకాలు లోపించడం వల్ల, చిన్న గాయాలు కూడా ఎక్కువసేపు రక్తస్రావానికి కారణమవుతాయి. ఇది తరచుగా కుటుంబాలలో వంశపారంపర్యంగా వచ్చే ఒక జన్యుపరమైన వ్యాధి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన ప్రపంచ హీమోఫిలియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ జబ్బు గురించి, ఈ జబ్బు లక్షణాల గురించి, ఈ జబ్బుకు గల కారణాల గురించి వివరంగా తెలుసుకుంటే..
హీమోఫిలియా లక్షణాలు..
గాయం తర్వాత ఎక్కువసేపు రక్తస్రావం కావడం, కీళ్లలో వాపు , నొప్పి, ఎటువంటి కారణం లేకుండా ముక్కు నుండి రక్తస్రావం కావడం, చిన్న గాయాలు కూడా మానడంలో ఆలస్యం కావడం, శరీరంపై నీలి గుర్తులు ఏర్పడటం హీమోఫిలియా వ్యాధి లక్షణాలు.
ఏప్రిల్ 17 వ తేదీన ఎందుకు జరుపుకుంటారు?
ప్రపంచ హిమోఫిలియా దినోత్సవాన్ని 1989లో ప్రపంచ హిమోఫిలియా సమాఖ్య (World Federation for Hemophilia) మొదటిసారిగా స్థాపించింది. WFH వ్యవస్థాపకుడైన ఫ్రాంక్ ష్నాబెల్ పుట్టినరోజుతో ఏకీభవించేలా ఈ రోజును ఎంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధిపై అవగాహన పెంచడం, రోగులకు మెరుగైన చికిత్స అందించడం దీని ఉద్దేశ్యం.
థీమ్ ఇదే..
వ్యాధి నిర్థారణే.. సంరక్షణకు మొదటి మెట్టు అనేది ఈ ఏడాది ప్రపంచ హీమోఫిలియా వ్యాధి దినోత్సవానికి థీమ్ గా ఎంపిక చేశారు. ఈ వ్యాధికి చికిత్స, సంరక్షణ మొదలైనవి.. కేవలం వ్యాధి నిర్థారించడంతోనే సాధ్యమవుతుందని, చికిత్సను సులువు చేస్తుందని దీని అర్థం.
హీమోఫిలియా..
శరీరంలో ఏ చిన్న గాయం అయినా.. రక్తం గడ్డకట్టడం ద్వారా రక్తస్రావం ఎక్కువ జరగకుండా ఉండటానికి శరీరంలో కొన్ని కారకాలు ఉంటాయి. ఇవి లోపిస్తే.. హీమోఫిలియా వ్యాధి వస్తుంది. రక్తస్రావం ఆగకుండా ఉండటం వల్ల శరీరంలో రక్తం కోల్పోయి అతి చాలా ప్రమాదకరమైన పరిస్థితికి దారి తీస్తుంది. ఈ సమస్యను ఎంత తొందరగా గుర్తించి, నిర్థారించగలిగితే.. మనిషి ప్రాణాన్ని అంత తొందరగా సంరక్షించుకునే అవకాశాలు ఎక్కుువగా ఉంటాయి.
ఈ వ్యాధి మీద అవగాహన పెంచడానికి, ప్రజలను అప్రమత్తం చేయడానికి, లక్షణాలను గమనించేలా ప్రజలను సన్నద్ధం చేయడానికి ప్రపంచ హీమోఫిలియా దినోత్సవం ఒక వేదికగా నిలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి గురించి అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం, జబ్బు పట్ల ప్రజలలో అపోహలు తొలగించడం, ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం వంటివి ఈ ప్రపంచ హీమోఫిలియా దినోత్సవం సందర్బంగా నిర్వహిస్తారు.
*రూపశ్రీ.
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది. ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు. కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని. ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ ఏదో ఒక గొడవలో మునిగి తేలుతూ ఉంటుంది. అత్తగారు సంతోషంగా , లేకపోతే ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అందుకే అత్తాకోడళ్ల బంధం అంటే.. గొడవలు, పోట్లాటలు, వాదించుకోవడాలతో నిండి ఉంటుంది అనుకుంటారు. అయితే అత్తాకోడళ్లు ఒకరినొకరు అర్థం చేసుకుని, అవగాహన, గౌరవం , ఆప్యాయతతో ఉంటేనే అత్తాకోడోళ్ల బంధం బాగుంటుంది. ప్రతి అమ్మాయి అత్తగారు తనతో బాగుండాలని కోరుకుంటుంది. అత్తగారు తన కోడలిని మెచ్చుకోవాలంటే.. కోడలిలో కొన్ని లక్షణాలు ఉండాలని రిలేషన్షిప్ నిపుణులు చెబుతున్నారు. ఆ లక్షణాలు ఏంటో తెలుసుకుంటే..
మద్దతు..
అత్తమామలకు అండగా నిలబడి, వారికి పూర్తిగా మద్దతు ఇస్తే.. ఆ కోడలిని అత్తగారు ఎంతో ఇష్టపడతారు. అలా కాకుండా అదే పనిగా గొడవలు చేసుకుని పుట్టింటికి వెళుతూ ఉంటే.. ఏ అత్తగారు కూడాతన కోడలిని ఇష్టపడరట. గొడవలు జరిగినా సరే.. వారి మధ్య మాత్రమే గొడవలు ఉండి, నలుగురిలో అత్తమామలను, భర్తను గౌరవించే కోడలిని అత్తగారు ఎప్పుడూ వదులుకోరు.
గౌరవం, మర్యాద..
అత్తమామలకు ఇష్టమైన కోడలిగా ఉండాలనుకుంటే, గౌరవప్రదంగా ఉండాలి. నలుగురు మెచ్చుకునేలా, నలుగురిలో హుందాగా, కుటుంబాన్ని నలుగురిలో గొప్పగా చూపించేలా ఉండాలి. ఇది అత్తాకోడళ్ల బంధాన్ని బలంగా మారుస్తుంది.
బాధ్యత..
ప్రతి అత్తగారు తన కోడలు ఇంటికి రాగానే అన్ని బాధ్యతలూ తీసుకోవాలని కోరుకుంటుంది. ఇంటి పనుల పట్ల ఆసక్తి చూపించి, బాధ్యతలన్నింటినీ చక్కగా నిర్వర్తిస్తే మంచి కోడలు అనిపించుకోగలరట.
ప్రేమ, అనుబంధం..
అత్తగారి పట్ల ఒక తల్లిలా ప్రేమ, ఆప్యాయత చూపించాలి. అలా చేయడం వల్ల, ఆమె కోడలిని మనస్ఫూర్తిగా ఆదరిస్తుంది, తెలియకుండానే కోడలి పట్ల ఆమెకు చాలా ఇష్టం ఏర్పడుతుంది.
మనసు విప్పి మాట్లాడటం..
ఏవైనా విషయాల గురించి బాధగా అనిపిస్తే, ఆ సంబంధాన్ని దీర్ఘకాలం పాటు నిలబెట్టుకోవడానికి ఆ క్షణంలోనే మనసు విప్పి మాట్లాడటం ద్వారా అన్నింటినీ పరిష్కరించుకోవాలి. ఏ సమస్యనైనా మనసులో పెట్టుకోకుండా, సరైన సమయంలో దాన్ని పరిష్కరించుకోవాలి. ఇలా చేస్తే అత్తగారు కూడా కోడలిని బాధపెట్టకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది.
పైన చెప్పుకున్నవన్నీ పాటించే కోడళ్లు కూడా ఉంటారు. అయినా సరే.. అత్తగారు కోడలిని ఇష్టపడరు. కొందరు అత్తగార్లు.. తమ కోడలిని బాధపెట్టడం, ఏడిపించడం, చులకన చేసి మాట్లాడటం.. ఇవన్నీ తన హక్కుగా భావిస్తూ.. వాటికే అంటిపెట్టుకుని ఉంటారు. ఇలాంటి అత్తగార్ల దగ్గర ఎంత మంచి ప్రవర్తనతో మెలిగినా.. దున్నపోతు మీద వర్షం కురినట్టే అవుతుంది. కాబట్టి అలాంటి వ్యక్తుల విషయంలో అత్తగార్లదే తప్పు అవుతుంది కానీ.. కోడళ్లది అసలు తప్పు ఉండదు. మంచి కోడలు అనిపించుకోవడానికి అతిగా బాధలు అనుభవించడం మానితేనే కోడళ్లకు కూడా మంచిది.
*రూపశ్రీ.
గడిచిన ఏడు వారాలుగా ప్రపంచాన్ని వణికించిన పర్షియన్ గల్ఫ్ ఉద్రిక్తతలు ఒక కీలక మలుపు తిరిగాయి. అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ ప్రభుత్వం పూర్తిగా పునఃప్రారంభించింది. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ఈ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా నిలిచిపోతుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే, ప్రస్తుత కాల్పుల విరమణ నేపథ్యంలో ఈ మార్గం తిరిగి తెరవడంతో గ్లోబల్ ఎకానమీకి భారీ ఊరట లభించినట్లయింది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పరిణామాలు కనిపించాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో ఐదో వంతు వాటా కలిగిన ఈ మార్గం గుండా నౌకల రాకపోకలు సాఫీగా సాగడంతో, ముడి చమురు ధరలు 10 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. అటు అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మరియు యూరోప్ దేశాలకు, ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్, చైనా వంటి దేశాలకు ఇది తక్షణ ఆర్థిక ఊపిరిని అందించింది.
అయితే, హోర్ముజ్ జలసంధి తెరుచుకున్నంత మాత్రాన సమస్య పూర్తిగా సర్దుమణిగిందని భావించలేము. ఇక్కడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో ద్వంద్వ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల కోసం జలసంధిని ఓపెన్ చేసినప్పటికీ.. ఇరాన్ లోని ప్రధాన ఓడరేవులపై అమెరికా నౌకాదళ దిగ్బంధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అంటే.. ప్రపంచానికి చమురు అందుబాటులోకి వచ్చేలా చేస్తూనే.. ఇరాన్ సొంత ఆర్థిక వ్యవస్థను మాత్రం అమెరికా తన అదుపులో ఉంచుకుంది. శాంతి చర్చలలో ఇరాన్‌ను లొంగదీసుకోవడానికి వాషింగ్టన్ దీనిని ఒక బలమైన 'లీవరేజ్'గా ఉపయోగిస్తోంది. శాంతి చర్చల తదుపరి ఘట్టం ఇప్పుడు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు చేరడం విశేషం. ఈ వారాంతంలోనే అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య రెండో రౌండ్ ప్రత్యక్ష చర్చలు ఇక్కడ జరిగే అవకాశం ఉంది. పాకిస్థాన్‌కు అటు అమెరికాతో రక్షణ సంబంధాలు, ఇటు ఇరాన్‌తో సున్నితమైన సరిహద్దు సంబంధాలు ఉండటంతో ఇస్లామాబాద్‌ను వేదికగా ఎంచుకున్నారు.
ఒకవేళ ఇక్కడ ఒప్పందం ఖరారైతే, స్వయంగా ట్రంప్ పాకిస్థాన్ సందర్శించే అవకాశం ఉందన్న వార్తలు ఆ దేశ దౌత్య ప్రతిష్ఠను పెంచుతున్నాయి. కేవలం పాకిస్థాన్ మాత్రమే కాకుండా, సౌదీ అరేబియా, ఖతర్ మరియు టర్కీ వంటి దేశాలు కూడా ఈ సంక్షోభ నివారణకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నాయి. పాక్ సైన్యాధిపతి జనరల్ ఆసిమ్ మునీర్ ఇప్పటికే తెహ్రాన్‌లో పర్యటించి కీలక నేతలతో భేటీ అయ్యారు. గల్ఫ్ ప్రాంతంలో శాశ్వత శాంతి నెలకొల్పడం మరియు భవిష్యత్తు భద్రతా ముసాయిదాను రూపొందించడంలో ఈ ప్రాంతీయ దేశాల పాత్ర కీలకంగా మారింది.ప్రస్తుతం చర్చల బల్లపై ఉన్న ప్రధాన అంశం 'డబ్బుకు ప్రతిగా అణు నియంత్రణ'. సుమారు మూడు పేజీల ఫ్రేమ్‌వర్క్ డాక్యుమెంట్‌పై ఇరు దేశాల ప్రతినిధులు కసరత్తు చేస్తున్నారు.
దీని ప్రకారం, అమెరికా ఆంక్షల వల్ల విదేశాల్లో స్తంభించిపోయిన బిలియన్ల కొద్దీ డాలర్ల నిధులను ఇరాన్ తిరిగి పొందుతుంది. దీనికి బదులుగా, ఇరాన్ తన వద్ద ఉన్న ఎన్‌రిచ్డ్ యురేనియం నిల్వలను తగ్గించుకోవాలి లేదా వేరే దేశానికి తరలించాలి. అణ్వాయుధ తయారీ దిశగా ఇరాన్ అడుగులు వేయకుండా కఠినమైన అంతర్జాతీయ పర్యవేక్షణ ఉండాలని అమెరికా పట్టుబడుతోంది.ఇరాన్ సైతం తన సార్వభౌమత్వానికి భంగం కలగకుండా, ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా చర్చలు జరుపుతోంది. తమ అణు కార్యక్రమం శాంతియుతమైనదని వాదిస్తున్న తెహ్రాన్, గౌరవప్రదమైన రీతిలో ఆంక్షల నుంచి విముక్తి కోరుకుంటోంది. గతంలో జరిగిన దాడుల్లో ధ్వంసమైన సైట్ల నుంచి 'న్యూక్లియర్ డస్ట్' ఇచ్చేందుకు సిద్ధమనడం ద్వారా, పర్యవేక్షణకు తాము వ్యతిరేకం కాదనే సంకేతాన్ని ఇరాన్ పంపింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభం అనేది శాంతి దిశగా పడిన ఒక ముందడుగు మాత్రమే, అది అంతిమ పరిష్కారం కాదు. ప్రస్తుతం ఇరు పక్షాల మధ్య చర్చల్లో వేగం పెరిగినప్పటికీ, ఆంక్షల తొలగింపు, అణు వెరిఫికేషన్ మెకానిజంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఏదైనా చిన్న పొరపాటు లేదా మూడో పక్షం ప్రమేయం జరిగితే ఈ చర్చలు మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉంది.
ఆ ప్రమాదం ఇప్పటికే ముంచుకొచ్చింది కూడా. ట్రంప్ నౌకాదళ దిగ్బంధనం ప్రకటన చేసిన తరువాత ఇరాన్ షార్ప్ గా రియాక్టైంది. హర్మూజ్ జలసంధిని మూసేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లైంది. ఈ పరిస్థితుల్లో ఇస్లామాబాద్ లో శాంతి చర్చల వ్యవహారం కూడా డోలాయమానంగా మారింది.
- సీతారాం కంఠమనేని
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై బీజేపీ మండిపడుతోంది. దేశంలోని సగం జనాభా ప్రయోజనాలను విపక్షాలు కాలరాశాయని ఫైర్ అవుతోంది. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. చారిత్రాత్మకమైన ఈ బిల్లును అడ్డుకోవడం ద్వారా ప్రతిపక్షాలు తమ మహిళా వ్యతిరేక ధోరణిని బయటపెట్టుకున్నాయని విమర్శిస్తోంది.పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు తగినంత మెజారిటీ లభించకపోవడంతో అది వీగిపోయిన సంగతి తెలిసిందే. రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఓటింగ్‌లో పాల్గొన్న 528 మంది సభ్యులలో 298 మంది బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా, 230 మంది వ్యతిరేకించారు. బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 352 ఓట్లు అవసరం.
ఈ పరిణామంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వంటి పార్టీలు అడ్డుకున్నాయన్నారు. నారీ శక్తిని గౌరవించని విపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ ఓటమి కేవలం ప్రభుత్వానిది కాదని, దేశంలోని కోట్లాది మంది మహిళల ఆకాంక్షలకు తగిలిన దెబ్బగా బీజేపీ అభివర్ణించింది.
రాజ్యాంగ సవరణ బిల్లుతో ముడిపడి ఉన్న డీలిమిటేషన్ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లులను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మహిళా రిజర్వేషన్ల అమలుకు పునర్విభజన ప్రక్రియ కీలకమని ప్రభుత్వం వాదించినప్పటికీ.. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందనే ఆందోళనతో విపక్షాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించాయి. ముఖ్యంగా 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సంఖ్యను పెంచడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు వాదించారు.
మహిళల హక్కులను అడ్డుకున్న విపక్షాల అసలు రంగును బయటపెడతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ హెచ్చరించారు. గ్రామం నుంచి నగరం వరకు నిరసనలుతెలియజేయాలని బీజేపీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలతో సమావేశమైన బీజేపీ నేతలు.. రానున్న రోజుల్లో చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాలపై కార్యాచరణ రూపొందించారు. పార్లమెంట్ ఆవరణలో కూడా ఎన్‌డీఏ మహిళా ఎంపీలు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. విపక్షాల మహిళా వ్యతిరేక ముఖం బయటపడిందంటూ నినాదాలు చేశారు.
మహిళా రిజర్వేషన్ల విషయంలో గత కొన్ని దశాబ్దాలుగా ఉన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు మోదీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని విపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుకున్నాయని విమర్శించారు. ఒకవైపు ప్రభుత్వం తన ప్రయత్నాన్ని సమర్థించుకుంటుండగా, మరోవైపు విపక్షాలు డీలిమిటేషన్ సాకుతో బీజేపీ రాజకీయ ప్రయోజనాలను పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బీజేపీ పిలుపునిచ్చిన దేశవ్యాప్త నిరసనలు ఏ మేరకు ప్రభావం చూపుతాయో చూడాలి.ఈ బిల్లు వీగిపోవడం వల్ల 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ల అమలుపై సందిగ్ధత నెలకొంది. నియోజకవర్గాల పునర్విభజన లేకుండా మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతోంది. ఈ రాజకీయ ప్రతిష్టంభన మధ్య మహిళా హక్కుల అంశం ఇప్పుడు వీధి పోరాటంగా మారనుంది.
కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం మహిళలను మోసం చేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. మహిళా సాధికారత వైపు భారత్ వేయాల్సిన చారిత్రాత్మక అడుగును కాంగ్రెస్ అడ్డుకుందని విమర్శించారు. సమానహక్కులు, సముచిత ప్రాతినిథ్యం కోరుతున్న కోట్లాది మంది మహిళలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ఇది కేవలం రాజకీయపరమైన అడ్డంకి మాత్రమే కదన్న ఆయన కాంగ్రెస్ ద్రోహాన్ని దేశం ఎప్పటికీ మరిచిపోదని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా వేసవి కాలంలో నీటిశాతం అధికంగా ఉన్న పండ్లను ఎంత తీసుకుంటే అంత మంచిదని చెబుతూ ఉంటారు. కానీ చాలామంది వేసవి కాలంలో పండ్ల జ్యూసులు, ఫ్రూట్ మిల్క్ షేక్ లు తాగడానికే ఇష్టపడతారు. ప్రూట్ జ్యూస్ లు, ఫ్రూట్ షేక్ లు తాగినప్పుడు శరీరానికి చాలా స్వాంతన లభిస్తుంది. అయితే.. కొన్ని రకాల పండ్లతో ప్రూట్ మిల్క్ షేక్ తయారు చేసుకుని తాగడం అస్సలు మంచిది కాదట. ఏ పండ్లతో మిల్క్ షేక్ లు తయారు చేసుకుని తాగకూడదు? దీనికి గల కారణాలు ఏంటి? మిల్క్ షేక్ అంటే తెగ ఇష్టపడే ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి..
సిట్రస్ ఫ్రూట్స్..
నారింజ, నిమ్మకాయ వంటి సిట్రస్ ప్రూట్స్ ను పాలతో కలిపి మిల్క్ షేక్ లు తయారుచేసుకుని తాగడమే కాదు.. అసలు పాలతో కలిపి తీసుకోకూడదు కూడా. వీటిలోని సిట్రిక్ యాసిడ్ పాలతో చర్య జరపడం వల్ల అది హానికరంగా మారుతుంది. ఇలా తీసుకున్నప్పుడు ఎసిడిటీ, కడుపునొప్పి వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
పైనాపిల్..
పైనాపిల్ లో ఉండే ఎంజైమ్ లు పాలతో చర్య జరపడం వల్ల కడుపు సమస్యలు చాలా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పైనాపిల్ ను పాలతో తీసుకోకూడదు, పైనాపిల్ మిల్క్ షేక్ తాగకూడదు.
జామకాయ..
జామకాయను పాలతో కలిపి తీసుకోకూడదట. ఎందుకంటే జామకాయ మిల్క్ షేక్ కడుపునొప్పికి కారణం కావచ్చు, అంతేకాకుండా.. కడుపు బరువుగా, ఉబ్బరంగా మారే అవకాశం ఉంటుంది.
సిట్రస్ పండ్లు+ అరటిపండ్లు మిల్క్ షేక్..
సిట్రస్ పండ్ల షేక్ తాగడమే ఆరోగ్యానికి మంచిది కాదు..అలాంటిది కొందరు సిట్రస్ షేక్ ను అరటిపండ్లతో కలిపి తాగుతుంటారు. ఇది అస్సలు మంచిది కాదు.. ఈ కాంబినేషన్ జీర్ణక్రియను నెమ్మది చేస్తుంది. జీర్ణక్రియను దెబ్బతీస్తుంది.
బొప్పాయి..
బొప్పాయి పండును మిల్క్ షేక్ గా తీసుకోవడం అస్సలు మంచిది కాదు. ఇది చర్మానికి, జీర్ణక్రియకు అస్సలు మంచిది కాదు.
నిమ్మజాతి పండ్లు +మామిడి పండ్లు..
నిమ్మజాతి పండ్లు అయిన నారింజ, నిమ్మ, బత్తాయి మొదలైన పండ్లను మామిడి పండ్లతో కలిపి తినకూడదట. ఈ కాంబినేషన్ శరీర వేడిని పెంచి కడుపు సమస్యలను పెంచుతుంది.
*రూపశ్రీ.
నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య కిడ్నీ వ్యాధులు (Kidney Issues). కిడ్నీల పనితీరు మందగించినప్పుడు మనం తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఎంతో ముఖ్యం. సరైన డైట్ పాటించడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి తగ్గడమే కాకుండా, వ్యాధి తీవ్రతను కూడా నియంత్రించవచ్చు.
ప్రముఖ వైద్యులు డాక్టర్ బి. అరవింద్ రెడ్డి (Dr. B Aravind Reddy) ఈ వీడియోలో కిడ్నీ రోగులు పాటించాల్సిన ఆహార నియమాల గురించి సవివరంగా వివరించారు.
ఈ వీడియోలోని ముఖ్య అంశాలు:
తినవలసిన ఆహారం: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి?
నియంత్రించాల్సిన పదార్థాలు: ఉప్పు, పొటాషియం మరియు ఫాస్పరస్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను ఎందుకు తగ్గించాలి?
నీటి వినియోగం: కిడ్నీ రోగులు రోజుకు ఎంత పరిమాణంలో నీరు తాగాలి?
పిల్లల కోసం ప్రత్యేక జాగ్రత్తలు: చిన్న పిల్లల్లో కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన డైట్ జాగ్రత్తలు.
నిత్య జీవిత మార్పులు: ఆహారంతో పాటు జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులేమిటి?
మీ కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరియు డయాలసిస్ వంటి పరిస్థితుల నుండి దూరంగా ఉండటానికి డాక్టర్ గారు చెప్పిన ఈ సూచనలను తప్పక పాటించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి.
మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 [TeluguOne Health] (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
తిండి కలిగితే కండ కలదోయ్ అని అంటుంటారు. అలాగే కొందరు ఎంత కారంగా ఉన్న ఆహారం తింటే.. శరీరం అంత దృఢంగా ఉంటుందని కూడా అంటుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు బాగా కారంగా ఉన్న ఆహారం తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. నేటికాలంలో బాగా కారంగా ఉన్న ఆహారం తినడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఎండు మిరపకాయల చట్నీ మొదలుకొని, ఆహారంలో కారం బాగా ఎక్కువ వేసుకుని తిడం చాలా మందికి ఇష్టంగా ఉంటోంది దాని రుచి వారికి బాగా నచ్చిందని చెబుతూ ఉంటారు. కారం తినడం చాలా గొప్ప అని చెప్పుకుంటూ కూడా ఉంటారు. కానీ నిజానికి కారం ఎక్కువ తినడం గొప్ప అనడానికి బదులుగా.. దాని వల్ల కలిగే నష్టాల గురించి ఆలోచించమంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. ఎక్కువ కారం తినడం వల్ల కడుపులో సమస్యలు మాత్రమే కాకుండా.. శరీరంలోని ఇతర భాగాల పై కూడా చాలా ప్రబావం చూపిస్తుందని అంటున్నారు.
గుండెల్లో మంట, ఎసిడిటీ..
కారం ఎక్కువ తినడం అంటే కేవలం కారం ఎక్కువ తినడం కాదు.. అందులో మసాలాలు ఎక్కువ ఉండటం కూడా ప్రమాదమే.. మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తిన్నప్పుడు, కడుపులో ఆమ్ల స్థాయి పెరుగుతుంది. దీనివల్ల గుండెల్లో మంట, త్రేనుపులు , గ్యాస్ రావచ్చు. ఇలాంటి ఆహారాన్ని ఎక్కువ కాలం పాటు తినడం వల్ల ఎసిడిటీ ఒక దీర్ఘకాలిక సమస్యగా మారి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.
జీర్ణవ్యవస్థ..
అతిగా మసాలా, కారం ఉండే ఆహారాలు జీర్ణవ్యవస్థకు చికాకు కలిగిస్తాయి. దీనివల్ల పేగుల్లో చికాకు, అజీర్ణం, కడుపు నొప్పి, కొన్నిసార్లు విరేచనాలు కూడా కలగవచ్చు. ఇప్పటికే బలహీనమైన జీర్ణశక్తి ఉన్నవారికి ఇది మరింత హానికరం కావచ్చు.
నోరు, గొంతు సమస్యలు..
అతిగా మసాలా ఉండే ఆహారాలు నాలుక, చిగుళ్ళు , గొంతు లోపలి పొరను చికాకు పెడతాయి. దీనివల్ల చికాకు, బొబ్బలు , పుండ్లు, వాపు రావచ్చు. ఈ ఆహారాలను ఎప్పుడూ తీసుకోవడం వల్ల టేస్ట్ బడ్స్ బలహీనపడతాయి.
అల్సర్ల ప్రమాదం..
క్రమం తప్పకుండా మసాలా, ఘాటైన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కడుపు లోపలి పొర దెబ్బతిని, గ్యాస్ట్రిక్ అల్సర్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీని లక్షణాలలో తీవ్రమైన నొప్పి, వాంతులు, , కొన్నిసార్లు రక్తస్రావం కూడా ఉండవచ్చు, ఇది ఒక తీవ్రమైన పరిస్థితిగా మారే అవకాశం ఉంటుంది.
చర్మ సమస్యలు..
మసాలా ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల శరీర వేడి పెరిగి, ముఖంపై మొటిమలు, మచ్చలు మరియు ఎరుపుదనం ఏర్పడవచ్చు. ఈ సమస్య ముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్నవారిలో సర్వసాధారణం.
పైల్స్..
మసాలా పదార్థాలు తినడం వల్ల మలవిసర్జన సమయంలో మంట , నొప్పి పెరగవచ్చు. దీనివల్ల పాయువులో వాపు వచ్చి, మొలలు మరింత తీవ్రమవుతాయి. ముందు నుంచే మొలలు ఉన్న రోగులు ముఖ్యంగా మసాలా, కారం పదార్థాలకు దూరంగా ఉండాలి.
నిద్ర..
రాత్రిపూట మసాలాలు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో వేడి, చికాకు పెరుగుతాయి. దీనివల్ల నిద్ర పట్టడం కష్టమవుతుంది. తరచుగా మెలకువలు రావచ్చు. సరిగ్గా నిద్రపోకపోవడం మానసిక , శారీరక ఆరోగ్యం రెండింటినీ ప్రభావితం చేస్తుంది.
మసాలా ఆహారాలు తినకూడదా?
మసాలా ఆహారం మంచిదే, కానీ దాని పరిమాణం పరిమితంగా ఉండాలి. సమతుల్య ఆహారం పాటించడం ద్వారా మాత్రమే కడుపు, చర్మం , మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
*రూపశ్రీ.
