LATEST NEWS
లోక్‌సభలో వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు
విపక్షాల ఐక్యతతో కేంద్రానికి చుక్కెదురు!
మెజారిటీ లేక చతికిలబడ్డ కేంద్రం.
భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. నియోజకవర్గాల పునర్విభజన (డెలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ల అమలు దిశగా ప్రతిపాదించిన ఈ బిల్లుకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లభించకపోవడంతో సభలో ఆమోదం పొందలేదు. విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి బిల్లును వ్యతిరేకించడంతో మోదీ ప్రభుత్వానికి ఇది పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
ఓటింగ్ ప్రక్రియలో భాగంగా బిల్లుకు అనుకూలంగా 278 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 211 ఓట్లు పడ్డాయి. రాజ్యాంగ సవరణ జరగాలంటే కనీసం 362 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే, మిత్రపక్షాల సహకారం ఉన్నప్పటికీ, మేజిక్ ఫిగర్‌ను అందుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ఈ బిల్లు ద్వారా లోక్‌సభ స్థానాల సంఖ్యను 850కి పెంచాలని, 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన పునర్విభజన చేపట్టాలని కేంద్రం భావించింది.
ఈ చర్చలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. జనాభా నిష్పత్తికి అనుగుణంగా ప్రాతినిధ్యాన్ని కల్పించడమే ఈ బిల్లు ఉద్దేశమని స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని, సీట్ల సంఖ్య పెరగడం వల్ల అన్ని ప్రాంతాలకు మేలు జరుగుతుందని భరోసా ఇచ్చారు. మహిళా రిజర్వేషన్లను 2029 నుంచి అమలు చేయాలంటే ఈ సవరణలు తప్పనిసరని ఆయన పేర్కొన్నారు.
అయితే, విపక్ష నేత రాహుల్ గాంధీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది మహిళా రిజర్వేషన్ల కోసం కాదని, దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే కుట్ర అని ఆరోపించారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించి, కొన్ని ప్రాంతాలకే ప్రాధాన్యత కల్పించేలా ఈ డెలిమిటేషన్ ప్రక్రియ ఉందని ఆయన విమర్శించారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే ఇలాంటి చర్యలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
దక్షిణాది రాష్ట్రాల నుంచి గట్టి నిరసన వ్యక్తమవుతోంది. జనాభా నియంత్రణ పాటించినందుకు తమకు సీట్లు తగ్గించి శిక్ష వేస్తారా? అని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే విపక్ష ‘ఇండియా’ కూటమి సభ్యులు భారీగా తరలివచ్చి ఓటింగ్‌లో పాల్గొని బిల్లును తిరస్కరించారు.
బిల్లు వీగిపోవడంతో ఇప్పుడు మహిళా రిజర్వేషన్ల అమలుపై సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం మళ్లీ ఏ రూపంలో ఈ బిల్లును ముందుకు తెస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది. రానున్న రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశం దేశ రాజకీయాల్లో మరిన్ని ప్రకంపనలు సృష్టించే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం ఈ విషయంలో ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నిస్తుందా లేక ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతుందా అన్నది వేచి చూడాలి.
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అత్యంత సమన్వయంతో సాగుతోంది. మరో పదిహేనేళ్ల పాటు కూటమి పటిష్ఠంగా ఉంటుందని జనసేనాని పవన్ కల్యాణ్ పదేపదే చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో అక్కడక్కడా తలెత్తుతున్న విభేదాలను భూతద్దంలో చూపుతూ ప్రత్యర్థి పార్టీ కూటమి విచ్ఛిన్నం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది. కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నారా లోకేష్ గురువారం (ఏప్రిల్ 16) ముఖాముఖీ నిర్వహించారు. ఆ సందర్భంగా పవన్ కల్యాణ్ తనను ఎలా కరెక్ట్ చేశారో వివరించారు. అదేలా అంటే.. గతంలో ఒక సదస్సులో 2029లో మళ్ళీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా అన్న ప్రశ్నకు తాను క్షణం కూడా ఆలోచించకుండా నిస్సందేహంగ తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే 2029లో కూడా అధికారంలోకి వస్తుందని జవాబిచ్చినట్లు లోకేష్ చెప్పారు.
అయితే మరుసటి రోజే తనకు పవన్ కల్యాణ్ ఫోన్ చేసి 2029లో అధికారంలోకి వస్తుందని ఎందుకు చెప్పారు. మనం వరుసగా మూడుసార్ల అధికారంలో కొనసాగుతామని చెప్పాలి కదా అని కరెక్ట్ చేశారని లోకేష్ వివరించారు. ఆ సంకల్పంతోనే మనం జనంలోకి వెళ్లాలని జనసేనాని చెప్పారని లోకేష్ వివరించారు. ఈ విషయాన్ని లోకేష్ స్వయంగా చెప్పడం.. ఆ ఇరువురి నేతల మధ్య బంధాన్ని, పరస్పరం ఉన్న సోదర భావాన్ని తెలియజేస్తున్నదని పరిశీలకులు అంటున్నారు.
ఈ ఫోన్ కాల్ పవన్ కళ్యాణ్, లోకేష్ మధ్య ఉన్నఅనుబంధాన్ని, అలాగే కూటమి ఐక్యతనూ మరోసారి ప్రస్ఫుటం చేసిందన్న చర్చ రాజకీయవర్గాలలో సాగుతోంది. తెలుగుదేశం కూటమి కేవలం పార్టీల మధ్య పొత్తుకే పరిమితం కాలేదనీ, ఆయా పార్టీల నేతల మధ్య కూడా వ్యక్తిగత స్థాయిలో కూడా పటిష్ఠ మైన బంధంగా ఉందనీ తేటతెల్లమౌతోంది.
లోకేష్‌కు పవన్ స్వయంగా ఫోన్ చేసి సలహాలు ఇవ్వడం, పవన్‌ను లోకేష్ తన అన్నలా భావిస్తూ ఆ సూచనలను స్వీకరించడం రాజకీయాల్లో ఒక ఆరోగ్యకరమైన పరిణామంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మిత్రధర్మానికి, పొత్తు ధర్మానికి సరైన మోడల్ గా అభివర్ణిస్తున్నారు. అధికార కూటమి పార్టీలకు చెందిన కీలక, అగ్రనేతలు ఏకతాటిపై ఉండటం పాలనపై కూడా సానుకూల ప్రభావం చూపుతుందనీ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అదే జరుగుతోందనీ అంటున్నారు.
రానున్న రోజుల్లో కూటమిలోని పార్టీల మధ్య మరింత సమన్వయం పెరిగేలా ఈ ఇరువునూ ముందుకు సాగుతున్న తీరు పట్ల తెలుగుదేశం, జనసేన క్యాడర్ లో కూడా హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. కూటమి ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలు తాత్కాలికం కావని, సుదీర్ఘ ప్రయాణానికి పునాదులని ఈ ఇరువురూ విస్పష్టంగా చాటుతున్నారు.
హిస్టరీ ఆఫ్ మహిళా బిల్లు.. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోంది? ఇప్పటి వరకూ జరిగిన మలుపులేంటి? ప్రస్తుత పరిస్థితేంటి? మహిళా బిల్లు వల్ల వచ్చే లాభాలేంటి? ప్రపంచంలో ఇప్పటి వరకూ ఉన్న రిజర్వేషన్లేంటి? ఈ బిల్లు ద్వారా రాబోయే మార్పు చేర్పులేంటి? అసలు ముప్పై మూడు శాతం ఎందుకు? అన్న విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
మహిళా రిజర్వేషన్ బిల్లు-నారీ శక్తి వందన్ అధినియం అనేది భారత రాజకీయ చరిత్రలో ఒక మైలురాయి. దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల పోరాటం ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది. ఆ తరువాత మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ల విషయంలో పదే పదే ప్రయత్నాలు జరిగాయి. 1998, 1999, 2002, 2003 సంవత్సరాల్లో వాజ్‌పేయి ప్రభుత్వం ఈ దిశగా ముందుకు సాగాలని ప్రయత్నించినా ఏకాభిప్రాయం కుదరక సాధ్యం కాలేదు.
మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. కానీ లోక్‌సభలో ప్రవేశపెట్టేలోపే ప్రభుత్వం మారడం, ఇతర కారణాలతో మళ్లీ అటకెక్కింది. సెప్టెంబర్ 2023లో ప్రధాని మోదీ ప్రభుత్వం నారీ శక్తి వందన్ అధినియం-106వ రాజ్యాంగ సవరణ పేరుతో దీనిని ప్రవేశపెట్టి, ఉభయ సభల్లోనూ భారీ మెజారిటీతో ఆమోదింపజేసింది.
ఈ చట్టం అమలులోకి వస్తే భారత రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని అంటారు విశ్లేషకులు. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలు, ఢిల్లీ అసెంబ్లీలో మహిళలకు మూడింట ఒక వంతు అంటే 33శాతం సీట్లు కేటాయించబడతాయి. ఇప్పటికే ఉన్న ఎస్సీఎస్టీ రిజర్వేషన్లలో కూడా 33శాతం సీట్లు ఆయా వర్గాల మహిళలకే కేటాయిస్తారు. ప్రతి లోక్‌సభ ఎన్నికల తర్వాత మహిళలకు కేటాయించిన నియోజకవర్గాలు మారుతూ ఉంటాయి. ప్రస్తుతానికి ఈ రిజర్వేషన్ 15 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. ఆ తర్వాత పార్లమెంటు దీనిని పొడిగించవచ్చు.
ఈ బిల్లు చట్టంగా మారినప్పటికీ, ఇది వెంటనే అమల్లోకి రాదు. దీనికి రెండు ప్రధాన అడ్డంకులు ఉన్నాయి. ఒకటి జనగణన. దేశవ్యాప్తంగా జనాభా గణన జరగాలి. రెండు నియోజకవర్గాల పునర్విభజన. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల సరిహద్దులను మార్చాలి. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తవుతుందని అంచనా. కాబట్టి, 2029 సాధారణ ఎన్నికల నుంచి ఈ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
మహిళా బిల్లు వల్ల లాభాలేంటి? అని చూస్తే.. చట్టసభల్లో మహిళల సంఖ్య పెరగడం వల్ల మహిళా సమస్యలు, భద్రత మరియు విద్యపై మరింత సమర్థవంతమైన చట్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతే కాదు.. లింగ సమానత్వం కూడా లభిస్తుంది. ప్రస్తుతం లోక్‌సభలో మహిళల ప్రాతినిధ్యం కేవలం 15 శాతం లోపే ఉంది. ఇది 33 శాతం కి పెరిగితే రాజకీయాల్లో లింగ వివక్ష తగ్గుతుంది. ఇప్పటికే పంచాయతీల్లో ఉన్న రిజర్వేషన్ల వల్ల గ్రామీణ స్థాయిలో మహిళా నాయకత్వం పెరిగింది. ఇప్పుడు అది జాతీయ స్థాయికి విస్తరిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా రిజర్వేషన్లు ఎలా ఉన్నాయి? అని పరిశీలిస్తే.. ప్రపంచవ్యాప్తంగా మహిళా ప్రాతినిధ్యంలో భారత్ ప్రస్తుతం వెనుకబడి ఉంది. ఏకంగా 140వ స్థానంలో ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా 61 శాతం పైగా మహిళా ఎంపీలు ఉన్న దేశం రువాండ. ఇక్కడ రాజ్యాంగబద్ధంగా మహిళలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఇక మెక్సికో,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో యాభై శాతం మహిళా ప్రాతినిథ్యం కనిపిస్తోంది. ఇక స్వీడన్ నార్వే వంటి దేశాల్లో అధికారిక రిజర్వేషన్లు లేక పోయినా.. రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా మహిళలకు ఎక్కువ సీట్లు కేటాయిస్తాయి. ఈ బిల్లు అమలు కావడంతో భారత్ లో కూడా ప్రపంచ దేశాల సరసన భారత్ సైతం అగ్రస్థానంలో నిలిచే అవకాశముంది.
ఇంతకీ మహిళా రిజర్వేషన్లు 33 శాతం ఎందుకు? అంటే.. అందుకంటూ ఒక కారణమైతే లేదు. కానీ రాజ్యాంగపరమైన రాజకీయ సామాజిక సమీకరణాల కలయిక అయితే కనిపిస్తోంది. దీని వెనకున్న మెయిన్ రీజన్ ఏంటంటే.. ప్రస్తుతం భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు కలిపి దాదాపు 49.5శాతం వరకూ ఉన్నాయి. ఈ కోటాకు భంగం కలగకుండా ఉండాలంటే, మహిళలకు ప్రత్యేకంగా ఎక్కువ శాతం కేటాయించడం చట్టపరంగా ఇబ్బంది అవుతుందని భావించారు. అందుకే 33 శాతం అనేది ఒక మధ్యస్థమైన, ఆమోదయోగ్యమైన సంఖ్యగా నిర్ణయించారు.
రాజకీయ పరిశీలకుల ప్రకారం.. ఒక సమూహం నిర్ణయాల్లో ప్రభావం చూపించాలంటే వారు కనీసం 30 నుంచి 33 శాతం ఉండాలి. దీనినే క్రిటికల్ మాస్ అంటారు. పది మంది ఉన్న చోట ఒక్క మహిళ ఉంటే ఆమె గొంతు నొక్కేసే అవకాశం ఉంటుంది. కానీ పది మందిలో ముగ్గురు ఉంటే, వారు ఒక బలమైన గొంతుకగా మారి చట్టాలను మార్చే శక్తిని పొందుతారు. అందుకే కనీస ప్రాతినిధ్యం కోసం ఈ శాతాన్ని ఎంచుకున్నారు.
భారతదేశంలో 1993లో తెచ్చిన 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలైన పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించారు. అక్కడ ఈ ప్రయోగం విజయవంతం కావడంతో, అదే సూత్రాన్ని పార్లమెంటు మరియు అసెంబ్లీలకు కూడా వర్తింపజేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు ఈ కోటాను 50 శాతానికి పెంచాయి, కానీ జాతీయ స్థాయిలో 33 శాతం తోనే ప్రారంభించారు.
1996 నుంచి వివిధ ప్రభుత్వాలు ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు, 33 శాతానికి మించి రిజర్వేషన్ ఇస్తే ఇతర వర్గాల నుంచి.. ముఖ్యంగా పురుష ప్రతినిధుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందని భావించారు. అందరినీ ఒప్పించడానికి ఈ 33 శాతం అనేది ఒక ఫార్ములాగా మారింది. చాలామంది మహిళలు జనాభాలో 50 శాతం ఉన్నారు కదా, కోటా కూడా 50 శాతం ఉండాలి కదా? అని ప్రశ్నిస్తారు. అది న్యాయమైన వాదన అయినప్పటికీ, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాజ్యాంగ పరిమితుల దృష్ట్యా 33 శాతాన్ని మొదటి అడుగుగా వేస్తున్నారు. భవిష్యత్తులో మహిళా ప్రాతినిధ్యం పెరిగే కొద్దీ ఈ శాతాన్ని సవరించే అవకాశం కూడా ఉండవచ్చు.
ALSO ON TELUGUONE N E W S
తారాగణం: నాగశౌర్య, విధి యాదవ్, శ్రీదేవి విజయ్ కుమార్, సాయి కుమార్, సముద్రఖని, మైమ్ గోపి తదితరులు
సంగీతం: హారిస్ జయరాజ్
సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
యాక్షన్ కొరియోగ్రఫీ: సుప్రీమ్ సుందర్, పృథ్వీ
దర్శకత్వం: రమేష్ దేశిన
బ్యానర్: శ్రీ వైష్ణవి ఫిలింస్
విడుదల తేదీ: ఏప్రిల్ 17, 2026
నాగశౌర్య (Naga Shaurya) హీరోగా రమేష్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'బ్యాడ్ బాయ్ కార్తీక్' (Bad Boy Karthik). విధి యాదవ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా నేడు (ఏప్రిల్ 17) థియేటర్లలోకి వచ్చింది. ప్రచార చిత్రాలు ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయలేకపోయాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? కంటెంట్ తో ఏమైనా సర్ప్రైజ్ చేసిందా? (Bad Boy Karthik Movie Review)
కథ:
వైజాగ్‌లో తన సోదరి కస్తూరి (శ్రీదేవి విజయ్ కుమార్), బావ (అజయ్)తో కలిసి కార్తీక్ (నాగశౌర్య) నివసిస్తుంటాడు. కార్తీక్ అమెరికా వెళ్లి సెటిల్ అవ్వాలని కస్తూరి ఆశపడుతుంటుంది. ఈ క్రమంలో కార్తీక్, ఏసీపీ సాయి (సాయి కుమార్) కుమార్తె మహాలక్ష్మి (విధి యాదవ్) ప్రేమలో పడతాడు. అయితే, కస్తూరి ప్రాణాలకు కొంతమంది గూండాల నుండి ముప్పు పొంచి ఉందని కార్తీక్‌కు తెలుస్తుంది. తన అక్కను చంపాలని చూస్తున్నది ఎవరు? కదిరి ప్రాంతానికి చెందిన గోవిందప్ప (మైమ్ గోపి), వరద రెడ్డి (సముద్రఖని)లకు ఈ గొడవతో సంబంధం ఏంటి? చివరకు కార్తీక్ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? అనేదే మిగతా కథ.
విశ్లేషణ:
ఈ సినిమా ప్రధాన లోపం దాని కథలోనే ఉంది. ఎప్పుడో 10-15 ఏళ్ళ క్రితం నాటి రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ ను 2026లో ప్రేక్షకులు అంగీకరించడం కష్టం. ఇటీవలి కాలంలో ఓల్డ్ టెంప్లేట్ లో వచ్చిన స్టార్ హీరోల సినిమాలనే ప్రేక్షకులు రిజెక్ట్ చేస్తున్నారు. హీరో ఎవరనేది సంబంధం లేకుండా కంటెంట్ ఉన్న సినిమాలనే ఆదరిస్తున్నారు. అలాంటిది కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఇప్పుడు ఈ సినిమా రావడం సాహసమే.
దర్శకుడు రమేష్ ఎంచుకున్న పాయింట్లో కొత్తదనం లేదు. కనీసం స్క్రీన్‌ప్లే అయినా వేగంగా ఉందా అంటే అదీ లేదు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎక్కడా కొత్తదనం కనిపించదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే సీన్లు చాలా ఊహజనితంగా ఉంటాయి. క్లైమాక్స్ కూడా సాగదీసినట్లుగా అనిపిస్తుంది. సాయి కుమార్ లాంటి సీనియర్ నటుడి పాత్రను కూడా చాలా పేలవంగా డిజైన్ చేయడం సినిమా గ్రాఫ్‌ను పడేసింది.
వరుస పరాజయాలతో ఉన్న నాగశౌర్యకు ఈ సినిమా చాలా కీలకం. అయితే కథల ఎంపికలో ఆయన మళ్ళీ తడబడ్డారనే చెప్పాలి. 'ఛలో' వంటి యూత్ ఫుల్ సినిమాలతో మెప్పించిన శౌర్య, ఇలాంటి రొటీన్ యాక్షన్ సినిమాల కంటే వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటే బాగుంటుంది.
నటీనటుల పనితీరు:
నాగశౌర్య ఈ సినిమాలో లుక్ పరంగా కొంచెం కొత్తగా కనిపించినా, పాత్రలో బలం లేకపోవడంతో ఆయన నటన పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. హీరోయిన్ విధి యాదవ్ స్క్రీన్ ప్రెజెన్స్, నటన సాదాసీదాగా ఉన్నాయి. శ్రీదేవి విజయ్ కుమార్ తన నటనతో మెప్పించింది. సాయి కుమార్, సముద్రఖని, మైమ్ గోపి వంటి నటులు ఉన్నప్పటికీ, వారి పాత్రలు రొటీన్‌గా ఉండటంతో పెద్దగా స్కోప్ దక్కలేదు.
సాంకేతిక వర్గం:
దర్శకుడు రమేష్ ఎంచుకున్న కథ 20 ఏళ్ల క్రితం నాటిదిగా అనిపిస్తుంది. నేటి కాలానికి తగ్గట్టుగా కథనంలో మార్పులు చేయకపోవడం పెద్ద మైనస్. మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జయరాజ్ ఒకప్పటి మ్యాజిక్ పూర్తిగా మిస్ అయింది. ఒక్క పాట కూడా వినసొంపుగా లేదు. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ మాత్రం బాగుంది, విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. పాటలు, ఫైట్లు కోసం భారీగానే ఖర్చు చేశారు. కానీ సరైన స్క్రిప్ట్ లేకపోవడంతో ఆ ఖర్చంతా వృథా అయినట్లు కనిపిస్తోంది.
ప్లస్ పాయింట్స్:
ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ సీక్వెన్స్
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
ఔట్ డేటెడ్ స్టోరీ, స్క్రీన్ ప్లే
లాజిక్ లేని సీన్స్
ఫైనల్ గా..
'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా కాలం చెల్లిన ఫార్ములాతో వచ్చిన యాక్షన్ డ్రామా. పాత చింతకాయ పచ్చడి లాంటి కథకు కమర్షియల్ హంగులు అద్దాలని చూసినా అది వర్కౌట్ కాలేదు. మాస్ మసాలా సినిమాలను ఇష్టపడే వారికి కూడా ఇది నచ్చడం అనుమానమే.
రేటింగ్: 1.75/5
Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
- వెండితెరపై మెరవనున్న కృష్ణ మనుమలు, మనుమరాళ్లు
- టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న నలుగురు వారసులు వీరే
- ఫ్యామిలీ రేసులో విన్నర్ ఎవరు?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 'సూపర్ స్టార్' అనే బిరుదుకు కేరాఫ్ అడ్రస్ ఘట్టమనేని కుటుంబం. దివంగత నటశేఖర కృష్ణ వేసిన బలమైన పునాదిని, ఆయన తనయుడు ప్రిన్స్ మహేష్‌బాబు అగ్రస్థానానికి చేర్చి ప్రపంచవ్యాప్తంగా ఘట్టమనేని క్రేజ్‌ను చాటిచెప్పారు. అయితే ఇప్పుడు అందరి కళ్లు ఘట్టమనేని మూడో తరం పైనే ఉన్నాయి. మహేష్‌బాబు తర్వాత ఆ రేంజ్ స్టార్‌డమ్‌ను అందుకునే వారసుడు ఎవరు? అనే చర్చ ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
ప్రస్తుతం ఈ మూడో తరం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు దివంగత రమేష్‌బాబు కుమారుడు జయకృష్ణ సర్వం సిద్ధం చేసుకున్నారు. గతంలో మహేష్‌బాబు నటించిన 'నిజం' చిత్రంలో బాల నటుడిగా మెప్పించిన జయకృష్ణ, ఇప్పుడు 'శ్రీనివాస మంగాపురం' అనే సినిమాతో వెండితెరకు పరిచయం కాబోతున్నారు. 'ఆర్ఎక్స్ 100' చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం విశేషం. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా థడానీ హీరోయిన్గా నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మరోవైపు, సూపర్‌స్టార్ మహేష్‌బాబు తనయుడు గౌతమ్ కృష్ణ ఎంట్రీ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. 'నేనొక్కడినే' సినిమాలో చిన్నప్పటి మహేష్‌గా నటించి తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న గౌతమ్, ప్రస్తుతం విదేశాల్లో యాక్టింగ్ కోర్స్ పూర్తి చేస్తున్నట్లు సమాచారం. తండ్రికి తగ్గ వారసుడిగా, భారీ యాక్షన్ ఎంటర్టైనర్తో గౌతమ్ లాంచ్ ఉండాలని మహేష్‌బాబు పక్కా ప్లానింగ్‌తో ఉన్నట్లు తెలుస్తోంది. గౌతమ్ లుక్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, అతడే తర్వాతి సూపర్ స్టార్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు.
కేవలం అబ్బాయిలే కాదు, ఘట్టమనేని ఇంటి అమ్మాయిలు కూడా గ్లామర్ ఫీల్డ్‌లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. రమేష్ బాబు కుమార్తె భారతి ఇప్పటికే సోషల్ మీడియాలో తన డ్యాన్స్ వీడియోలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా ఆ కుర్చీని మడతపెట్టి.. పాటకు ఆమె వేసిన స్టెప్పులు చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు. అలాగే మహేష్ ముద్దుల కుమార్తె సితార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'సర్కారు వారి పాట' ప్రమోషనల్ సాంగ్‌లో మెరిసిన సితార, సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుంది. భవిష్యత్తులో ఈ ఇద్దరు భామలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
నటి, నిర్మాత మంజుల కుమార్తె జాన్వీ స్వరూప్ కూడా ఈ రేసులో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల ఆమెకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేశాయి. ఇలా ఒకే కుటుంబం నుంచి దాదాపు ఐదుగురు వారసులు వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉండటం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఘట్టమనేని ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన హీరో మహేష్ బాబు వారసుడు గౌతమ్ కృష్ణ ఎప్పుడు సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ మూడో తరంలో సూపర్‌స్టార్ కృష్ణ లెగసీని ఎవరు నిలబెడతారో, ఎవరు టాప్ స్టార్‌గా ఎదుగుతారో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే!
2027 సంక్రాంతి సీజన్ పై పలువురు హీరోలు కన్నేశారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి సీనియర్ స్టార్స్ వచ్చే సంక్రాంతికి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ జనరేషన్ యంగ్ స్టార్స్ లో సంక్రాంతి హీరోగా పేరొందిన శర్వానంద్ (Sharwanand) సైతం.. 2027 సంక్రాంతిని టార్గెట్ గా పెట్టుకున్నాడు. అయితే అనూహ్యంగా శర్వా ప్రాజెక్ట్ హోల్డ్ లో పడిందనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
శర్వానంద్, శ్రీను వైట్ల (Srinu Vaitla) కాంబినేషన్లో ప్రకటించిన సినిమా పట్టాలెక్కడం కష్టమేనని ప్రచారం జరుగుతోంది. 2027 సంక్రాంతిని లక్ష్యంగా చేసుకున్న ఈ ప్రాజెక్ట్, తాజా సమాచారం ప్రకారం బడ్జెట్ కారణాల వల్ల సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది.
బడ్జెట్ భారమే కారణమా?
శర్వానంద్ కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఇక శ్రీను వైట్ల దర్శకుడిగా ఎన్నో మెమొరబుల్ కామెడీ సినిమాలు అందించారు. అందుకే వీరిద్దరి కాంబోలో సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా మైత్రీ మూవీ మేకర్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చింది. అయితే, ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లకముందే బడ్జెట్ లెక్కలు నిర్మాతలకి తలనొప్పిగా మారాయని వార్తలు వినిపిస్తున్నాయి.
శ్రీను వైట్ల సినిమాలంటేనే భారీ తారాగణం, విదేశీ లోకేషన్లు, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయి. ప్రస్తుత కథ ప్రకారం బడ్జెట్ పరిమితి దాటిపోతుండటంతో, మార్కెట్ లెక్కల దృష్ట్యా అంత రిస్క్ అవసరమా అని నిర్మాతలు ఆలోచిస్తున్నారట.
సంక్రాంతి 2027 టార్గెట్.. కానీ!
శర్వానంద్‌కు సంక్రాంతి సీజన్ బాగా కలిసి వస్తుంది. గతంలో ఆయన నటించిన 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'శతమానం భవతి', తాజాగా 2026లో వచ్చిన 'నారి నారి నడుమ మురారి' సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచి ఘనవిజయాలు సాధించాయి. అదే సెంటిమెంట్‌తో శ్రీను వైట్ల సినిమాను కూడా 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ తాజా బడ్జెట్ సమస్యలు ఈ ప్లాన్‌ను మార్చేలా కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా పూర్తిగా ఆగిపోయిందని చెప్పలేం. స్క్రిప్ట్‌లో మార్పులు చేసి లేదా బడ్జెట్‌ను తగ్గించి ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించవచ్చు. శర్వానంద్-శ్రీను వైట్ల కలయికలో సినిమా వస్తే ఖచ్చితంగా వినోదాత్మకంగా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి నిర్మాతలు బడ్జెట్ సమస్యను పరిష్కరించి ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తారేమో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’ (Fauzi) పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. క్లాస్ సినిమాల దర్శకుడిగా పేరున్న హను రాఘవపూడి, ఈసారి ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఒక భారీ మాస్ యాక్షన్ విజువల్ వండర్‌ను సిద్ధం చేస్తున్నట్లు తాజా సమాచారం.
దర్శకుడు హను రాఘవపూడి మేకింగ్ స్టైల్ చాలా విభిన్నంగా ఉంటుంది. ఆయన సినిమాల్లో క్లాసిక్ టచ్, అందమైన ప్రేమకథలు ఉంటాయి. కానీ 'ఫౌజీ' విషయంలో ఆయన తన రూట్ మార్చినట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఫిజిక్, ఆయన ఇమేజ్ను దృష్టిలో ఉంచుకుని.. వెండితెరపై ఆయనను అత్యంత పవర్‌ఫుల్‌గా చూపించేందుకు హను భారీ మాస్ ఎలివేషన్లను డిజైన్ చేశారట. ప్రభాస్‌ను మునుపెన్నడూ చూడని రీతిలో హను ప్రజెంట్ చేస్తున్నారట. ఈ సినిమాలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ గతంలో వచ్చిన వార్ సినిమాల కంటే భిన్నంగా, అత్యంత వైల్డ్ గా ఉండబోతున్నాయని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
కేవలం భారీ డైలాగులు మాత్రమే కాకుండా, ప్రభాస్ కటౌట్‌ను పూర్తిగా జస్టిఫై చేసేలా ప్రతి ఫ్రేమ్ ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటివరకు ప్రభాస్ ఎన్నో రకాల యాక్షన్ పాత్రలు చేసినప్పటికీ.. ‘ఫౌజీ’లో ఆయన స్టైల్, మేకోవర్ సరికొత్తగా ఉంటుందని తెలుస్తోంది.
ఈ సినిమాలో ప్రభాస్ ఒక ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తారని సమాచారం. సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. సినిమాలో ఒక పర్టికులర్ కాస్ట్యూమ్‌లో ప్రభాస్ వచ్చే సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయట. ఆ కాస్ట్యూమ్‌లో ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ చూసి అందరూ ఫిదా అయిపోతారని, ఆ సీన్స్ సినిమాకే మేజర్ ప్లస్ పాయింట్‌గా మారుతాయని చర్చించుకుంటున్నారు. ప్రభాస్ కటౌట్‌కు హను రాఘవపూడి విజన్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ రావడం గ్యారెంటీ.
- షాక్‌లో సూపర్‌స్టార్ ఫ్యాన్స్
- ‘జైలర్ 2’పై పైరసీ నీడ!
- మేకర్స్ సీరియస్ వార్నింగ్!
సూపర్ స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సంచలనం 'జైలర్' గురించి అందరికీ తెలిసిందే. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా రజనీ స్టామినాని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘జైలర్ 2’ రూపొందుతోంది. అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక చేదు వార్త చిత్ర యూనిట్‌ను కలవరపెడుతోంది. సినిమా షూటింగ్ దశలో ఉండగానే కీలకమైన రెండు సీన్లు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.
ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో క్లిప్స్‌లో రజనీకాంత్ మాస్ లుక్‌లో కనిపిస్తున్నట్లు సమాచారం. ఈ లీకేజీ వార్త తెలియగానే చిత్ర బృందం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. భారీ బడ్జెట్‌తో, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలోని దృశ్యాలు ఇలా బయటకు రావడంపై నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న మేకర్స్, పైరసీ నిరోధక బృందాన్ని రంగంలోకి దింపారు.
ఈ లీకైన వీడియోలను ఎవరూ షేర్ చేయవద్దని, ఒకవేళ నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జైలర్ 2 మేకర్స్ అధికారికంగా హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికలపై నిరంతరం నిఘా ఉంచామని, లీకైన కంటెంట్‌ను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకుంటున్నామని వారు తెలిపారు. భారీ అంచనాలు ఉన్న సినిమాలో ఇలాంటి పరిణామాలు మేకర్స్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి.
గతంలో వచ్చిన ‘జైలర్’ మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 600 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. ఆ చిత్రంలో ముత్తువేల్ పాండియన్ పాత్రలో రజనీ నటన, అనిరుధ్ మ్యూజిక్ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వస్తున్న ఈ రెండో భాగంలో కూడా మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో మెరిసే అవకాశం ఉంది.
సాధారణంగా పెద్ద హీరోల సినిమాల విషయంలో ఇటువంటి లీకేజీలు సర్వసాధారణం అయిపోయాయి. కానీ, సినిమా మేకింగ్ వాల్యూస్ దెబ్బతినకుండా ఉండాలంటే ప్రేక్షకులు కూడా సహకరించాలని చిత్ర పరిశ్రమ కోరుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ కూడా ఈ లీకేజీని ఖండిస్తున్నారు. తమ అభిమాన హీరో సినిమాను థియేటర్లలోనే చూస్తామని, ఇటువంటి లీక్డ్ వీడియోలను ప్రోత్సహించవద్దని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
ముఖ్యంగా రజనీకాంత్ గత చిత్రం ‘కూలీ’ పై మిశ్రమ స్పందన రావడంతో, అందరి దృష్టి ఇప్పుడు ‘జైలర్ 2’ పైనే ఉంది. నెల్సన్ దిలీప్‌కుమార్ ఈసారి అంతకు మించి అనేలా యాక్షన్ సీక్వెన్స్‌లను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ లీకేజీల బెడదను దాటుకుని ముత్తువేల్ పాండియన్ బాక్సాఫీస్ వద్ద మళ్ళీ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. త్వరలోనే ఈ మూవీ టీజర్ లేదా గ్లింప్స్ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు.
టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.
జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్‌లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్‌డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్‌స్టర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు.
చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్ విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది.
ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.
అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి 15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్ పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు ఒకే సారి ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.
రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.
ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు. వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .
మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హిమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు ఒకటుందని కూడా తెలియదు. హీమోఫిలియా అనేది శరీరం రక్తం గడ్డకట్టే సామర్థ్యాన్ని ప్రభావితం చేసే ఒక ఆరోగ్య పరిస్థితి. శరీరంలో రక్తం గడ్డకట్టే కారకాలు లోపించడం వల్ల, చిన్న గాయాలు కూడా ఎక్కువసేపు రక్తస్రావానికి కారణమవుతాయి. ఇది తరచుగా కుటుంబాలలో వంశపారంపర్యంగా వచ్చే ఒక జన్యుపరమైన వ్యాధి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన ప్రపంచ హీమోఫిలియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ జబ్బు గురించి, ఈ జబ్బు లక్షణాల గురించి, ఈ జబ్బుకు గల కారణాల గురించి వివరంగా తెలుసుకుంటే..
హీమోఫిలియా లక్షణాలు..
గాయం తర్వాత ఎక్కువసేపు రక్తస్రావం కావడం, కీళ్లలో వాపు , నొప్పి, ఎటువంటి కారణం లేకుండా ముక్కు నుండి రక్తస్రావం కావడం, చిన్న గాయాలు కూడా మానడంలో ఆలస్యం కావడం, శరీరంపై నీలి గుర్తులు ఏర్పడటం హీమోఫిలియా వ్యాధి లక్షణాలు.
ఏప్రిల్ 17 వ తేదీన ఎందుకు జరుపుకుంటారు?
ప్రపంచ హిమోఫిలియా దినోత్సవాన్ని 1989లో ప్రపంచ హిమోఫిలియా సమాఖ్య (World Federation for Hemophilia) మొదటిసారిగా స్థాపించింది. WFH వ్యవస్థాపకుడైన ఫ్రాంక్ ష్నాబెల్ పుట్టినరోజుతో ఏకీభవించేలా ఈ రోజును ఎంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధిపై అవగాహన పెంచడం, రోగులకు మెరుగైన చికిత్స అందించడం దీని ఉద్దేశ్యం.
థీమ్ ఇదే..
వ్యాధి నిర్థారణే.. సంరక్షణకు మొదటి మెట్టు అనేది ఈ ఏడాది ప్రపంచ హీమోఫిలియా వ్యాధి దినోత్సవానికి థీమ్ గా ఎంపిక చేశారు. ఈ వ్యాధికి చికిత్స, సంరక్షణ మొదలైనవి.. కేవలం వ్యాధి నిర్థారించడంతోనే సాధ్యమవుతుందని, చికిత్సను సులువు చేస్తుందని దీని అర్థం.
హీమోఫిలియా..
శరీరంలో ఏ చిన్న గాయం అయినా.. రక్తం గడ్డకట్టడం ద్వారా రక్తస్రావం ఎక్కువ జరగకుండా ఉండటానికి శరీరంలో కొన్ని కారకాలు ఉంటాయి. ఇవి లోపిస్తే.. హీమోఫిలియా వ్యాధి వస్తుంది. రక్తస్రావం ఆగకుండా ఉండటం వల్ల శరీరంలో రక్తం కోల్పోయి అతి చాలా ప్రమాదకరమైన పరిస్థితికి దారి తీస్తుంది. ఈ సమస్యను ఎంత తొందరగా గుర్తించి, నిర్థారించగలిగితే.. మనిషి ప్రాణాన్ని అంత తొందరగా సంరక్షించుకునే అవకాశాలు ఎక్కుువగా ఉంటాయి.
ఈ వ్యాధి మీద అవగాహన పెంచడానికి, ప్రజలను అప్రమత్తం చేయడానికి, లక్షణాలను గమనించేలా ప్రజలను సన్నద్ధం చేయడానికి ప్రపంచ హీమోఫిలియా దినోత్సవం ఒక వేదికగా నిలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి గురించి అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం, జబ్బు పట్ల ప్రజలలో అపోహలు తొలగించడం, ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం వంటివి ఈ ప్రపంచ హీమోఫిలియా దినోత్సవం సందర్బంగా నిర్వహిస్తారు.
*రూపశ్రీ.
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది. ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు. కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని. ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ ఏదో ఒక గొడవలో మునిగి తేలుతూ ఉంటుంది. అత్తగారు సంతోషంగా , లేకపోతే ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అందుకే అత్తాకోడళ్ల బంధం అంటే.. గొడవలు, పోట్లాటలు, వాదించుకోవడాలతో నిండి ఉంటుంది అనుకుంటారు. అయితే అత్తాకోడళ్లు ఒకరినొకరు అర్థం చేసుకుని, అవగాహన, గౌరవం , ఆప్యాయతతో ఉంటేనే అత్తాకోడోళ్ల బంధం బాగుంటుంది. ప్రతి అమ్మాయి అత్తగారు తనతో బాగుండాలని కోరుకుంటుంది. అత్తగారు తన కోడలిని మెచ్చుకోవాలంటే.. కోడలిలో కొన్ని లక్షణాలు ఉండాలని రిలేషన్షిప్ నిపుణులు చెబుతున్నారు. ఆ లక్షణాలు ఏంటో తెలుసుకుంటే..
మద్దతు..
అత్తమామలకు అండగా నిలబడి, వారికి పూర్తిగా మద్దతు ఇస్తే.. ఆ కోడలిని అత్తగారు ఎంతో ఇష్టపడతారు. అలా కాకుండా అదే పనిగా గొడవలు చేసుకుని పుట్టింటికి వెళుతూ ఉంటే.. ఏ అత్తగారు కూడాతన కోడలిని ఇష్టపడరట. గొడవలు జరిగినా సరే.. వారి మధ్య మాత్రమే గొడవలు ఉండి, నలుగురిలో అత్తమామలను, భర్తను గౌరవించే కోడలిని అత్తగారు ఎప్పుడూ వదులుకోరు.
గౌరవం, మర్యాద..
అత్తమామలకు ఇష్టమైన కోడలిగా ఉండాలనుకుంటే, గౌరవప్రదంగా ఉండాలి. నలుగురు మెచ్చుకునేలా, నలుగురిలో హుందాగా, కుటుంబాన్ని నలుగురిలో గొప్పగా చూపించేలా ఉండాలి. ఇది అత్తాకోడళ్ల బంధాన్ని బలంగా మారుస్తుంది.
బాధ్యత..
ప్రతి అత్తగారు తన కోడలు ఇంటికి రాగానే అన్ని బాధ్యతలూ తీసుకోవాలని కోరుకుంటుంది. ఇంటి పనుల పట్ల ఆసక్తి చూపించి, బాధ్యతలన్నింటినీ చక్కగా నిర్వర్తిస్తే మంచి కోడలు అనిపించుకోగలరట.
ప్రేమ, అనుబంధం..
అత్తగారి పట్ల ఒక తల్లిలా ప్రేమ, ఆప్యాయత చూపించాలి. అలా చేయడం వల్ల, ఆమె కోడలిని మనస్ఫూర్తిగా ఆదరిస్తుంది, తెలియకుండానే కోడలి పట్ల ఆమెకు చాలా ఇష్టం ఏర్పడుతుంది.
మనసు విప్పి మాట్లాడటం..
ఏవైనా విషయాల గురించి బాధగా అనిపిస్తే, ఆ సంబంధాన్ని దీర్ఘకాలం పాటు నిలబెట్టుకోవడానికి ఆ క్షణంలోనే మనసు విప్పి మాట్లాడటం ద్వారా అన్నింటినీ పరిష్కరించుకోవాలి. ఏ సమస్యనైనా మనసులో పెట్టుకోకుండా, సరైన సమయంలో దాన్ని పరిష్కరించుకోవాలి. ఇలా చేస్తే అత్తగారు కూడా కోడలిని బాధపెట్టకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది.
పైన చెప్పుకున్నవన్నీ పాటించే కోడళ్లు కూడా ఉంటారు. అయినా సరే.. అత్తగారు కోడలిని ఇష్టపడరు. కొందరు అత్తగార్లు.. తమ కోడలిని బాధపెట్టడం, ఏడిపించడం, చులకన చేసి మాట్లాడటం.. ఇవన్నీ తన హక్కుగా భావిస్తూ.. వాటికే అంటిపెట్టుకుని ఉంటారు. ఇలాంటి అత్తగార్ల దగ్గర ఎంత మంచి ప్రవర్తనతో మెలిగినా.. దున్నపోతు మీద వర్షం కురినట్టే అవుతుంది. కాబట్టి అలాంటి వ్యక్తుల విషయంలో అత్తగార్లదే తప్పు అవుతుంది కానీ.. కోడళ్లది అసలు తప్పు ఉండదు. మంచి కోడలు అనిపించుకోవడానికి అతిగా బాధలు అనుభవించడం మానితేనే కోడళ్లకు కూడా మంచిది.
*రూపశ్రీ.
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు. అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. కానీ ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే.. చేసే కొన్ని తప్పులు వారికి ఎలాంటి విజయాన్ని ఇవ్వవు అని చెబుతాడు ఆచార్య చాణక్యుడు. ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త.. వేల సంవత్సరాల కిందటే.. మనిషి వ్యక్తిత్వాన్ని, రాజనీతిని, ఆర్థిక సూత్రాలను ప్రపంచానికి అందించాడు. అవి ఇవ్పటికీ ప్రజలు ఆచరించే విధంగా ఉన్నాయంటే.. ఆయన ఆలోచన, ఆయన సిద్దాంతాలు ఎంత గొప్పవో అర్థం చేసుకోవచ్చు. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో.. సమాజంలో ఉండే కొందరు వ్యక్తులను అవమానించడం వల్ల ఎంతో ఉజ్జ్వలమైన భవిష్యత్తును చీకటిలోకి నెట్టుకున్నట్టు అవుతుందని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఐదుగురు వ్యక్తులను అవమానించడం వల్ల జీవితంలో అసలు విజయాన్ని సాధించలేరని కూడా చెబుతాడు. ఇంతకీ ఎవరిని అవమానించకూడదు? ఎందుకు అవమానించకూడదు? తెలుసుకుంటే..
గురువు..
చాణక్య నీతి ప్రకారం గురువు అత్యున్నత స్థానాన్ని కలిగి ఉంటారు, ఎందుకంటే గురువు అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞానమనే వెలుగులోకి నడిపిస్తాడు. గురువు మనకు అక్షరాస్యతను అందించడమే కాకుండా, జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి ఎలాంటి విలువలు కలిగి ఉండాలో.. ఆ విలువలను నేర్పుతాడు. తమ గురువును లేదా మార్గదర్శకుడిని అగౌరవపరిచిన వారు తమ జ్ఞానాన్ని, విజయాన్ని కోల్పోతారని ఆచార్య చాణక్యుడు చెబుతాడు.
తల్లిదండ్రులను..
ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల కంటే గొప్ప శ్రేయోభిలాషులు ఉండరు. తండ్రి కుటుంబానికి రక్షణ కవచం అయితే, తల్లి విలువలకు, ప్రేమకు ప్రతిరూపం. తల్లిదండ్రులకు మానసిక వేదన కలిగించే లేదా వారిని అగౌరవపరిచే పిల్లలు అదృష్టాన్ని, సంతోషాన్ని కోల్పోతారని చాణక్యుడు చెప్పాడు. చాణక్యుని ప్రకారం, పెద్దల కళ్లలో కన్నీళ్లు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ నివసించదట.
పండితులు..
చాణక్య నీతి ప్రకారం సమాజంలో అపారమైన అనుభవం, బోలెడు జ్ఞానం ఉన్నవారే పండితులు. అలాంటి పండితుల సాంగత్యం అమూల్యమైనది. పండితులను ఎగతాళి చేయడం లేదా కించపరచడానికి ప్రయత్నించడం మేధో దారిద్య్రాన్ని ప్రతిబింబిస్తుందని చాణక్యుడు పేర్కొన్నాడు. పండితులను అవమానించడం ద్వారా, సరైన సలహా, మార్గదర్శకత్వం పొందే అవకాశాలను కోల్పోయి, చివరికి పతనానికి గురవుతారట.
కష్టపడి పనిచేసేవారు, సేవాభావం గలవారు..
ఆచార్య చాణక్యుడు ఎల్లప్పుడూ కష్టానికి గౌరవం ఇవ్వాలని బోధించారు. పారిశుధ్య కార్మికుడైనా, సెక్యూరిటీ గార్డు అయినా, కూలీ అయినా.. సమాజాన్ని నడిపించడానికి కష్టపడే ప్రతి ఒక్కరూ గౌరవానికి అర్హులు. ఒకరి ఆర్థిక స్థితి లేదా హోదాను బట్టి వారిని అవమానించడం మనిషిలో అహంకారాన్ని ప్రతిబింబిస్తుంది. అటువంటి ప్రతికూల శక్తే ఉంటే.. అదే వారి దురదృష్టానికి అతిపెద్ద కారణం అవుతుంది.
సాధు స్వభావం ఉన్నవారు..
ధర్మం, సత్యం, నైతికత మార్గాన్ని అనుసరించేవారిని అసంతృప్తికి గురిచేయడం, అవమానించడం చాలా తప్పు. సద్గుణ, సత్ప్రవర్తన గలవారు ఎవరికీ కీడు కోరుకోరు, కానీ వారిని అవమానించడం జీవితంలోని సానుకూల శక్తిని నాశనం చేస్తుంది. మానసిక సమతుల్యత కావాలన్నా, ఇంట్లో శాంతికి లోటు ఉండకూడదన్నా సాధు స్వభావం గల వారిని గౌరవించడం చాలా అవసరం.
*రూపశ్రీ.
లోక్‌సభలో వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు
విపక్షాల ఐక్యతతో కేంద్రానికి చుక్కెదురు!
మెజారిటీ లేక చతికిలబడ్డ కేంద్రం.
భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. నియోజకవర్గాల పునర్విభజన (డెలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ల అమలు దిశగా ప్రతిపాదించిన ఈ బిల్లుకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లభించకపోవడంతో సభలో ఆమోదం పొందలేదు. విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి బిల్లును వ్యతిరేకించడంతో మోదీ ప్రభుత్వానికి ఇది పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
ఓటింగ్ ప్రక్రియలో భాగంగా బిల్లుకు అనుకూలంగా 278 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 211 ఓట్లు పడ్డాయి. రాజ్యాంగ సవరణ జరగాలంటే కనీసం 362 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే, మిత్రపక్షాల సహకారం ఉన్నప్పటికీ, మేజిక్ ఫిగర్‌ను అందుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ఈ బిల్లు ద్వారా లోక్‌సభ స్థానాల సంఖ్యను 850కి పెంచాలని, 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన పునర్విభజన చేపట్టాలని కేంద్రం భావించింది.
ఈ చర్చలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. జనాభా నిష్పత్తికి అనుగుణంగా ప్రాతినిధ్యాన్ని కల్పించడమే ఈ బిల్లు ఉద్దేశమని స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని, సీట్ల సంఖ్య పెరగడం వల్ల అన్ని ప్రాంతాలకు మేలు జరుగుతుందని భరోసా ఇచ్చారు. మహిళా రిజర్వేషన్లను 2029 నుంచి అమలు చేయాలంటే ఈ సవరణలు తప్పనిసరని ఆయన పేర్కొన్నారు.
అయితే, విపక్ష నేత రాహుల్ గాంధీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది మహిళా రిజర్వేషన్ల కోసం కాదని, దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే కుట్ర అని ఆరోపించారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించి, కొన్ని ప్రాంతాలకే ప్రాధాన్యత కల్పించేలా ఈ డెలిమిటేషన్ ప్రక్రియ ఉందని ఆయన విమర్శించారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే ఇలాంటి చర్యలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
దక్షిణాది రాష్ట్రాల నుంచి గట్టి నిరసన వ్యక్తమవుతోంది. జనాభా నియంత్రణ పాటించినందుకు తమకు సీట్లు తగ్గించి శిక్ష వేస్తారా? అని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే విపక్ష ‘ఇండియా’ కూటమి సభ్యులు భారీగా తరలివచ్చి ఓటింగ్‌లో పాల్గొని బిల్లును తిరస్కరించారు.
బిల్లు వీగిపోవడంతో ఇప్పుడు మహిళా రిజర్వేషన్ల అమలుపై సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం మళ్లీ ఏ రూపంలో ఈ బిల్లును ముందుకు తెస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది. రానున్న రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశం దేశ రాజకీయాల్లో మరిన్ని ప్రకంపనలు సృష్టించే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం ఈ విషయంలో ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నిస్తుందా లేక ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతుందా అన్నది వేచి చూడాలి.
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అత్యంత సమన్వయంతో సాగుతోంది. మరో పదిహేనేళ్ల పాటు కూటమి పటిష్ఠంగా ఉంటుందని జనసేనాని పవన్ కల్యాణ్ పదేపదే చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో అక్కడక్కడా తలెత్తుతున్న విభేదాలను భూతద్దంలో చూపుతూ ప్రత్యర్థి పార్టీ కూటమి విచ్ఛిన్నం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది. కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నారా లోకేష్ గురువారం (ఏప్రిల్ 16) ముఖాముఖీ నిర్వహించారు. ఆ సందర్భంగా పవన్ కల్యాణ్ తనను ఎలా కరెక్ట్ చేశారో వివరించారు. అదేలా అంటే.. గతంలో ఒక సదస్సులో 2029లో మళ్ళీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా అన్న ప్రశ్నకు తాను క్షణం కూడా ఆలోచించకుండా నిస్సందేహంగ తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే 2029లో కూడా అధికారంలోకి వస్తుందని జవాబిచ్చినట్లు లోకేష్ చెప్పారు.
అయితే మరుసటి రోజే తనకు పవన్ కల్యాణ్ ఫోన్ చేసి 2029లో అధికారంలోకి వస్తుందని ఎందుకు చెప్పారు. మనం వరుసగా మూడుసార్ల అధికారంలో కొనసాగుతామని చెప్పాలి కదా అని కరెక్ట్ చేశారని లోకేష్ వివరించారు. ఆ సంకల్పంతోనే మనం జనంలోకి వెళ్లాలని జనసేనాని చెప్పారని లోకేష్ వివరించారు. ఈ విషయాన్ని లోకేష్ స్వయంగా చెప్పడం.. ఆ ఇరువురి నేతల మధ్య బంధాన్ని, పరస్పరం ఉన్న సోదర భావాన్ని తెలియజేస్తున్నదని పరిశీలకులు అంటున్నారు.
ఈ ఫోన్ కాల్ పవన్ కళ్యాణ్, లోకేష్ మధ్య ఉన్నఅనుబంధాన్ని, అలాగే కూటమి ఐక్యతనూ మరోసారి ప్రస్ఫుటం చేసిందన్న చర్చ రాజకీయవర్గాలలో సాగుతోంది. తెలుగుదేశం కూటమి కేవలం పార్టీల మధ్య పొత్తుకే పరిమితం కాలేదనీ, ఆయా పార్టీల నేతల మధ్య కూడా వ్యక్తిగత స్థాయిలో కూడా పటిష్ఠ మైన బంధంగా ఉందనీ తేటతెల్లమౌతోంది.
లోకేష్‌కు పవన్ స్వయంగా ఫోన్ చేసి సలహాలు ఇవ్వడం, పవన్‌ను లోకేష్ తన అన్నలా భావిస్తూ ఆ సూచనలను స్వీకరించడం రాజకీయాల్లో ఒక ఆరోగ్యకరమైన పరిణామంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మిత్రధర్మానికి, పొత్తు ధర్మానికి సరైన మోడల్ గా అభివర్ణిస్తున్నారు. అధికార కూటమి పార్టీలకు చెందిన కీలక, అగ్రనేతలు ఏకతాటిపై ఉండటం పాలనపై కూడా సానుకూల ప్రభావం చూపుతుందనీ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అదే జరుగుతోందనీ అంటున్నారు.
రానున్న రోజుల్లో కూటమిలోని పార్టీల మధ్య మరింత సమన్వయం పెరిగేలా ఈ ఇరువునూ ముందుకు సాగుతున్న తీరు పట్ల తెలుగుదేశం, జనసేన క్యాడర్ లో కూడా హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. కూటమి ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలు తాత్కాలికం కావని, సుదీర్ఘ ప్రయాణానికి పునాదులని ఈ ఇరువురూ విస్పష్టంగా చాటుతున్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ, రాష్ట్రస్థాయి కమిటీల్లో పల్నాడు జిల్లా నేతలకు సముచిత ప్రాధాన్యత దక్కింది. ఏకంగా ఎనిమిది మందికి అధిష్టానం పదవులు కట్టబెట్టడంతో తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం నెలకొంది. టీడీపీ వారికి లభించిన ప్రాధాన్యత చూస్తూ పల్నాడు వైసీపీ శ్రేణుల్లో గుబులు మొదలైంది. పార్టీకి విధేయులుగా పని చేస్తున్న వారిని గుర్తించి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కీలక పదవుల్లో నియమించారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు ఇప్పటికే పార్లమెంటరీ పక్ష నేతగా ఉన్నారు. ఆయన్ని కొత్తగా పొలిట్ బ్యూరో ఎక్స్ అఫిషియో మెంబర్‌గా తీసుకోవడంతో పార్టీలో పెద్ద పీట వేసినట్లైంది. సత్తెనపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ జాతీయ టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.
మంత్రి పదవి ఆశించిన ఆ సీనియర్ నేతకు పార్టీ పరంగా ప్రాధాన్యత దక్కింది. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు జోనల్ కోఆర్డినేటర్‌గా పదవులు దక్కించుకున్నారు. మొన్నటి వరకు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న ప్రత్తిపాటి ఈ సారి జోనల్ కోఆర్డినేటర్‌గా వ్యవహరించనున్నారు. అలాగే సత్తెనపల్లికి చెందిన మన్నెం శివనాగమల్లేశ్వరారు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్ధిగా, పెదకూరపాడు నేత మద్దిరాల గంగాధర్ , చిలకలూరిపేట మైనార్టీ నేత షేక్ కరీముల్లా, వినుకొండ మైనార్టీ లీడర్ షమీమ్ఖాన్లకు రాష్ట్ర కార్యదర్శులుగా పదవులు దక్కాయి.
మద్దిరాల గంగాధర్ పార్టీకి విధేయుల. తన వాక్చాతుర్యంతో అధిష్టానం గుడ్ లుక్స్‌లో ఉన్న ఆయన ఇప్పటికే రాష్ట్ర నాయీ బ్రాహ్మణ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. షమీమ్ ఖాన్, షేక్ కరీముల్లాలకు కార్యదర్శి పదవులు దక్కడంతో పల్నాడులో గణనీయంగా ఉన్న మైనార్టీలకు ప్రాధాన్యత దక్కినట్లైంది. జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేసిన శివనాగలమల్లేశ్వరరావు గత మూడు సార్లుగా సత్తెనపల్లి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించి భంగపడ్డారు. టికెట్ రాక పోయినా పార్టీ అభ్యర్ధుల గెలుపు కోసం కృషి చేశారు. ఈ నేపధ్యంలో రాష్ట్రస్థాయి కమటీలోకి తీసుకున్నారు. మరోవైపు పల్నాడు జిల్లాలో వైసీపీ కమిటీలు పూర్తిస్థాయిలో భర్తీ చేయలేదు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డినే జగన్ కొనసాగిస్తున్నారు.
2024 ఎన్నికల ముందు, తర్వాత కూడా ఆయన జిల్లా అధ్యక్షుడి ఉన్నారు. ఆ క్రమంలో ఎన్నికల హింస కేసుల్లో జైలుకెళ్లి వచ్చిన పిన్నెల్లి పెద్దగా జనంలోకి రావడం లేదు. దాంతో పిన్నెల్లి స్థానంలో కొత్త అధ్యక్షుడ్ని నియమించాలని జిల్లా వైసీపీ శ్రేణులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. అయితే జగన్ మాత్రం పిన్నెల్లి వైపే చూపుతుండటం, ఆయన కేసుల భయంతో ప్రజాక్షేత్రానికి దూరంగా ఉండటంతో జిల్లా వైసీపీకి పెద్దదిక్కు కరువైన పరిస్థితి. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో వైసీపీ పరాజయం పాలవ్వడం, సమర్ధమైన నాయకత్వం కరువవ్వడంతో అక్కడి కేడర్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇలాంటి తరుణంలో పల్నాడు నేతలకు టీడీపీలో ప్రాధాన్యత పెరుగుతుండటంతో వైసీపీ వర్గాల్లో అంతర్మధనం మొదలైందంటున్నారు.
నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య కిడ్నీ వ్యాధులు (Kidney Issues). కిడ్నీల పనితీరు మందగించినప్పుడు మనం తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఎంతో ముఖ్యం. సరైన డైట్ పాటించడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి తగ్గడమే కాకుండా, వ్యాధి తీవ్రతను కూడా నియంత్రించవచ్చు.
ప్రముఖ వైద్యులు డాక్టర్ బి. అరవింద్ రెడ్డి (Dr. B Aravind Reddy) ఈ వీడియోలో కిడ్నీ రోగులు పాటించాల్సిన ఆహార నియమాల గురించి సవివరంగా వివరించారు.
ఈ వీడియోలోని ముఖ్య అంశాలు:
తినవలసిన ఆహారం: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి?
నియంత్రించాల్సిన పదార్థాలు: ఉప్పు, పొటాషియం మరియు ఫాస్పరస్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను ఎందుకు తగ్గించాలి?
నీటి వినియోగం: కిడ్నీ రోగులు రోజుకు ఎంత పరిమాణంలో నీరు తాగాలి?
పిల్లల కోసం ప్రత్యేక జాగ్రత్తలు: చిన్న పిల్లల్లో కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన డైట్ జాగ్రత్తలు.
నిత్య జీవిత మార్పులు: ఆహారంతో పాటు జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులేమిటి?
మీ కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరియు డయాలసిస్ వంటి పరిస్థితుల నుండి దూరంగా ఉండటానికి డాక్టర్ గారు చెప్పిన ఈ సూచనలను తప్పక పాటించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి.
మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 [TeluguOne Health] (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
తిండి కలిగితే కండ కలదోయ్ అని అంటుంటారు. అలాగే కొందరు ఎంత కారంగా ఉన్న ఆహారం తింటే.. శరీరం అంత దృఢంగా ఉంటుందని కూడా అంటుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు బాగా కారంగా ఉన్న ఆహారం తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. నేటికాలంలో బాగా కారంగా ఉన్న ఆహారం తినడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఎండు మిరపకాయల చట్నీ మొదలుకొని, ఆహారంలో కారం బాగా ఎక్కువ వేసుకుని తిడం చాలా మందికి ఇష్టంగా ఉంటోంది దాని రుచి వారికి బాగా నచ్చిందని చెబుతూ ఉంటారు. కారం తినడం చాలా గొప్ప అని చెప్పుకుంటూ కూడా ఉంటారు. కానీ నిజానికి కారం ఎక్కువ తినడం గొప్ప అనడానికి బదులుగా.. దాని వల్ల కలిగే నష్టాల గురించి ఆలోచించమంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. ఎక్కువ కారం తినడం వల్ల కడుపులో సమస్యలు మాత్రమే కాకుండా.. శరీరంలోని ఇతర భాగాల పై కూడా చాలా ప్రబావం చూపిస్తుందని అంటున్నారు.
గుండెల్లో మంట, ఎసిడిటీ..
కారం ఎక్కువ తినడం అంటే కేవలం కారం ఎక్కువ తినడం కాదు.. అందులో మసాలాలు ఎక్కువ ఉండటం కూడా ప్రమాదమే.. మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తిన్నప్పుడు, కడుపులో ఆమ్ల స్థాయి పెరుగుతుంది. దీనివల్ల గుండెల్లో మంట, త్రేనుపులు , గ్యాస్ రావచ్చు. ఇలాంటి ఆహారాన్ని ఎక్కువ కాలం పాటు తినడం వల్ల ఎసిడిటీ ఒక దీర్ఘకాలిక సమస్యగా మారి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.
జీర్ణవ్యవస్థ..
అతిగా మసాలా, కారం ఉండే ఆహారాలు జీర్ణవ్యవస్థకు చికాకు కలిగిస్తాయి. దీనివల్ల పేగుల్లో చికాకు, అజీర్ణం, కడుపు నొప్పి, కొన్నిసార్లు విరేచనాలు కూడా కలగవచ్చు. ఇప్పటికే బలహీనమైన జీర్ణశక్తి ఉన్నవారికి ఇది మరింత హానికరం కావచ్చు.
నోరు, గొంతు సమస్యలు..
అతిగా మసాలా ఉండే ఆహారాలు నాలుక, చిగుళ్ళు , గొంతు లోపలి పొరను చికాకు పెడతాయి. దీనివల్ల చికాకు, బొబ్బలు , పుండ్లు, వాపు రావచ్చు. ఈ ఆహారాలను ఎప్పుడూ తీసుకోవడం వల్ల టేస్ట్ బడ్స్ బలహీనపడతాయి.
అల్సర్ల ప్రమాదం..
క్రమం తప్పకుండా మసాలా, ఘాటైన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కడుపు లోపలి పొర దెబ్బతిని, గ్యాస్ట్రిక్ అల్సర్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీని లక్షణాలలో తీవ్రమైన నొప్పి, వాంతులు, , కొన్నిసార్లు రక్తస్రావం కూడా ఉండవచ్చు, ఇది ఒక తీవ్రమైన పరిస్థితిగా మారే అవకాశం ఉంటుంది.
చర్మ సమస్యలు..
మసాలా ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల శరీర వేడి పెరిగి, ముఖంపై మొటిమలు, మచ్చలు మరియు ఎరుపుదనం ఏర్పడవచ్చు. ఈ సమస్య ముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్నవారిలో సర్వసాధారణం.
పైల్స్..
మసాలా పదార్థాలు తినడం వల్ల మలవిసర్జన సమయంలో మంట , నొప్పి పెరగవచ్చు. దీనివల్ల పాయువులో వాపు వచ్చి, మొలలు మరింత తీవ్రమవుతాయి. ముందు నుంచే మొలలు ఉన్న రోగులు ముఖ్యంగా మసాలా, కారం పదార్థాలకు దూరంగా ఉండాలి.
నిద్ర..
రాత్రిపూట మసాలాలు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో వేడి, చికాకు పెరుగుతాయి. దీనివల్ల నిద్ర పట్టడం కష్టమవుతుంది. తరచుగా మెలకువలు రావచ్చు. సరిగ్గా నిద్రపోకపోవడం మానసిక , శారీరక ఆరోగ్యం రెండింటినీ ప్రభావితం చేస్తుంది.
మసాలా ఆహారాలు తినకూడదా?
మసాలా ఆహారం మంచిదే, కానీ దాని పరిమాణం పరిమితంగా ఉండాలి. సమతుల్య ఆహారం పాటించడం ద్వారా మాత్రమే కడుపు, చర్మం , మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
*రూపశ్రీ.
నేటి కాలంలో మారుతున్న జీవనశైలి, ఒత్తిడి మరియు ఆహారపు అలవాట్ల వల్ల వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటు (Heart Attack) బారిన పడుతున్నారు. అయితే, గుండెపోటు అకస్మాత్తుగా వచ్చే ప్రమాదమే అయినప్పటికీ, మన శరీరం కొన్ని రోజుల ముందే కొన్ని లక్షణాల ద్వారా మనల్ని హెచ్చరిస్తుంది. ఆ సంకేతాలను సరైన సమయంలో గుర్తిస్తే ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు.
తెలుగువన్ హెల్త్ (TeluguOne Health) ఈ ప్రత్యేక వీడియోలో, హార్ట్ అటాక్ వచ్చే ముందు కనిపించే ఆ ప్రమాదకరమైన సంకేతాల గురించి క్లియర్ గా వివరించడం జరిగింది.
ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే ముఖ్యమైన విషయాలు:
ముందస్తు లక్షణాలు: గుండెపోటు రావడానికి కొన్ని రోజుల ముందు శరీరంలో కనిపించే మార్పులు ఏమిటి?
నిర్లక్ష్యం చేయకూడని నొప్పులు: కేవలం ఛాతీ నొప్పి మాత్రమేనా? లేక ఇతర శరీర భాగాల్లో వచ్చే నొప్పులు కూడా గుండెపోటుకు సంకేతాలా?
అప్రమత్తత: శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విపరీతమైన చెమటలు పట్టడం వంటి లక్షణాలను ఎలా గుర్తించాలి?
ముందుజాగ్రత్త చర్యలు: ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే చేయాల్సిన పనులు ఏమిటి?
మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఈ సమాచారం మీకోసమే కాదు, మీ కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడటానికి కూడా ఉపయోగపడుతుంది. తప్పకుండా ఈ వీడియోను పూర్తిగా చూడండి.
హార్ట్ అటాక్ వచ్చే ముందు శరీరం ఇచ్చే ఆ ప్రమాదకరమైన సంకేతాలు ఏమిటో తెలుసుకోండి. ఈ లక్షణాలను గుర్తిస్తే ప్రాణాపాయం నుండి బయటపడవచ్చు.
మరిన్ని ఆరోగ్య రహస్యాలను వీడియో రూపంలో చూడాలనుకుంటే ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్లో చూడండి. (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
