Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మూడు పెళ్లిళ్లపై పవన్ క్లారిటీ..!
posted on: Apr 11, 2016 2:35PM

ఒక వ్యక్తిని అభిమానించే వారు ఆ వ్యక్తిలోని క్వాలిటీస్‌ని గుర్తిస్తారు. అలాగే విమర్శించేవారు సదరు వ్యక్తిలో ఏదైనా లోపం దొరుకుతుందా అని వెతుకుతుంటారు. టాలీవుడ్‌లో మిగిలిన నటులకు పవన్‌కు ఓ తేడా ఉంది . మిగిలిన వారిని అందరినీ నటులుగానే చూసిన అభిమానులు పవన్‌ను ఓ విలక్షణమైన వ్యక్తిగా చూస్తూ వచ్చారు. తన జీవనశైలి, మాటతీరు తదితర లక్షణాలతో పవన్ ఈ స్థాయిని సాధించారు. అలాగే ఎన్ని ప్లస్‌లున్నప్పటికి ఆయన ఎక్కడైనా దొరకడా అనుకునే వారికి దొరికిన లాజిక్ మూడు పెళ్లిళ్లు వ్యవహారం.
చాలా సందర్భాల్లో మీడియా నుంచి అభిమానుల నుంచి పవన్ పెళ్లిళ్ల గురించి కామెంట్స్ వస్తుండేవి. అయినా ఇంతవరకు పవన్ నోరు మెదపలేదు. అయితే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విడుదల సందర్భంగా వివిధ ఛానెళ్లకు పవన్ ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సమయంలో తన పెళ్లిళ్ల విషయంపై మనసులోని మాటను బయటపెట్టారు. పవర్ స్టార్ తొలిసారి నందినిని వివాహం చేసుకోగా, ఆమె నుంచి విడిపోయి రేణూ దేశాయ్‌ని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే రేణూ నుంచి విడాకులు తీసుకుని రష్యా దేశస్థురాలు అన్నా లెజినావాను పెళ్లాడారు.
అయితే పవన్ అసలు బ్యాచిలర్‌గానే ఉండాలనుకున్నారట. అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లాలని అప్పట్లో భావించారట. వాళ్ల అమ్మగారు కూడా ఒరేయ్ బ్రహ్మచారిగా ఉండిపోదామనుకొన్నావ్. ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నావ్..అంటూ అనేవారట. ఈ ప్రశ్నకు సమాధానంగా జీవితమంటే అంతే..ఎప్పుడు ఎన్ని మలుపులు తీసుకుంటుందో చెప్పలేం అన్నారు. ఇన్ని రోజుల సైలెంట్‌గా ఉండి సడెన్‌గా ఆయన ఈ విషయంలో ఎందుకు ఓపెనయ్యారోనని అభిమానులు చర్చించుకుంటున్నారు. బహుశా తన వ్యక్తిత్వం మసక బారిందనో లేదా ఇమేజ్ డ్యామేజ్ అయిందనో భావించే వారు కూడా ఉన్నారు. ఎందుకుంటే కాలం మారుతోంది, అనుబంధాలు మారుతున్నాయి. ఈ పెళ్లిళ్ల లెక్కను గోరంతలు, కొండంతలు చేసేవారికి మరోక ఛాన్స్ ఇవ్వకుండా ఉండేందుకే పవన్ పెళ్లిళ్లపై క్లారిటీ ఇచ్చినట్టున్నారు.






