Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పవన్ కేసీఆర్‌ని ప్రశంసించానికి కారణం ఏంటీ?
posted on: Apr 11, 2016 12:54PM

సంచలనాలకు కేంద్ర బిందువైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన ప్రసంగంతో సంచలనం సృష్టించాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విడుదలైన సందర్భంగా పవన్ వివిధ ఛానెళ్లకు ఇంటర్వూలు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలలో పవన్ తన మనసులోని మాటలను బయటపెట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇది రాజకీయ వర్గాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. కేసీఆర్ సమర్థ పాలన అందిస్తున్నారని.. రాష్ట్రంతో పాటు హైదరాబాద్‌లో సెటిలైన సీమాంధ్రులకు సమప్రాధాన్యమిస్తూ సానకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సెటిలర్లను కంటికి రెప్పలాగా కాపాడుతున్నారని, వారిపై ఈగ వాలనీయడం లేదని అన్నారు. కేసీఆర్‌తో పాటు కేటీఆర్ నాయకత్వ పటిమ బాగుందని అన్నారు.
ఇదే పవన్ జనసేన ఆవిర్భావ సభతో పాటు 2014 ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌పైనా ఆయన కుటుంబంపైనా మాటల తుటాలు పేల్చారు. వరంగల్ సభలో తెలంగాణ నడిబొడ్డున నిలబడి చెబుతున్నా..నీ తాట తీస్తా అని పవన్ హెచ్చరించారు. దానికి కౌంటర్‌గా కేసీఆర్ కూడా తెలంగాణ గడ్డ మీద నిలబడి కేసీఆర్‌దే తాట తీస్తనంటున్నాడు వాడెంతున్నాడు. చిటికెస్తే వెయ్యితునకలు అవుతాడు అంటూ ఘాటుగానే విమర్శించారు. ఇలా కొంతకాలంపాటు కేసీఆర్ కుటుంబం పవన్‌ని టార్గెట్ చేసింది. అయితే మారిన రాజకీయ పరిస్థితులు, తెలంగాణలో టీఆర్ఎస్ వరుస విక్టరీలు తదితర కారణాలతో పవన్ ఆలోచనలో పడ్డారు. దీంతో దూకుడు తగ్గించి కేసీఆర్ కుటుంబం పట్ల మెత్తబడినట్టు కనిపిస్తోంది. అందుకే ప్రెస్ మీట్‌లో కేసీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.





