Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...లోకేష్ ను కరెక్ట్ చేసిన పవన్ కల్యాణ్.. ఏ విషయంలోనో తెలుసా?
posted on: Apr 17, 2026 5:09PM

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అత్యంత సమన్వయంతో సాగుతోంది. మరో పదిహేనేళ్ల పాటు కూటమి పటిష్ఠంగా ఉంటుందని జనసేనాని పవన్ కల్యాణ్ పదేపదే చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో అక్కడక్కడా తలెత్తుతున్న విభేదాలను భూతద్దంలో చూపుతూ ప్రత్యర్థి పార్టీ కూటమి విచ్ఛిన్నం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది. కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నారా లోకేష్ గురువారం (ఏప్రిల్ 16) ముఖాముఖీ నిర్వహించారు. ఆ సందర్భంగా పవన్ కల్యాణ్ తనను ఎలా కరెక్ట్ చేశారో వివరించారు. అదేలా అంటే.. గతంలో ఒక సదస్సులో 2029లో మళ్ళీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా అన్న ప్రశ్నకు తాను క్షణం కూడా ఆలోచించకుండా నిస్సందేహంగ తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే 2029లో కూడా అధికారంలోకి వస్తుందని జవాబిచ్చినట్లు లోకేష్ చెప్పారు.
అయితే మరుసటి రోజే తనకు పవన్ కల్యాణ్ ఫోన్ చేసి 2029లో అధికారంలోకి వస్తుందని ఎందుకు చెప్పారు. మనం వరుసగా మూడుసార్ల అధికారంలో కొనసాగుతామని చెప్పాలి కదా అని కరెక్ట్ చేశారని లోకేష్ వివరించారు. ఆ సంకల్పంతోనే మనం జనంలోకి వెళ్లాలని జనసేనాని చెప్పారని లోకేష్ వివరించారు. ఈ విషయాన్ని లోకేష్ స్వయంగా చెప్పడం.. ఆ ఇరువురి నేతల మధ్య బంధాన్ని, పరస్పరం ఉన్న సోదర భావాన్ని తెలియజేస్తున్నదని పరిశీలకులు అంటున్నారు.
ఈ ఫోన్ కాల్ పవన్ కళ్యాణ్, లోకేష్ మధ్య ఉన్నఅనుబంధాన్ని, అలాగే కూటమి ఐక్యతనూ మరోసారి ప్రస్ఫుటం చేసిందన్న చర్చ రాజకీయవర్గాలలో సాగుతోంది. తెలుగుదేశం కూటమి కేవలం పార్టీల మధ్య పొత్తుకే పరిమితం కాలేదనీ, ఆయా పార్టీల నేతల మధ్య కూడా వ్యక్తిగత స్థాయిలో కూడా పటిష్ఠ మైన బంధంగా ఉందనీ తేటతెల్లమౌతోంది.
లోకేష్‌కు పవన్ స్వయంగా ఫోన్ చేసి సలహాలు ఇవ్వడం, పవన్‌ను లోకేష్ తన అన్నలా భావిస్తూ ఆ సూచనలను స్వీకరించడం రాజకీయాల్లో ఒక ఆరోగ్యకరమైన పరిణామంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మిత్రధర్మానికి, పొత్తు ధర్మానికి సరైన మోడల్ గా అభివర్ణిస్తున్నారు. అధికార కూటమి పార్టీలకు చెందిన కీలక, అగ్రనేతలు ఏకతాటిపై ఉండటం పాలనపై కూడా సానుకూల ప్రభావం చూపుతుందనీ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అదే జరుగుతోందనీ అంటున్నారు.
రానున్న రోజుల్లో కూటమిలోని పార్టీల మధ్య మరింత సమన్వయం పెరిగేలా ఈ ఇరువునూ ముందుకు సాగుతున్న తీరు పట్ల తెలుగుదేశం, జనసేన క్యాడర్ లో కూడా హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. కూటమి ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలు తాత్కాలికం కావని, సుదీర్ఘ ప్రయాణానికి పునాదులని ఈ ఇరువురూ విస్పష్టంగా చాటుతున్నారు.



.webp)


