సిద్ధిపేట డేంజర్ బెల్ మోగించిందా..?

posted on: Apr 12, 2016 3:51PM

సిద్ధిపేట..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంతగడ్డ. మూడు దశాబ్ధాల తరబడి ఆయనకు ఇక్కడ తిరుగులేదు. టీడీపీలో ఉన్నా..టీఆర్ఎస్‌లో ఉన్నా కేసీఆర్‌కు ఇక్కడ తిరుగులేదు. సిద్ధిపేట మున్సిపాలిటికి జరిగిన ఎన్నికల ఫలితాలు నిన్న ప్రకటించడానికి ముందు ప్రజలంతా టీఆర్ఎస్‌దే హావా అని అనుకున్నారు. ఉపఎన్నికలు, వరంగల్, హైదరాబాద్, ఖమ్మం ఇలా ఎక్కడ చూసినా కారు జోరే కనిపించింది. ఇలాంటి సమయంలో వచ్చిన ఎన్నికలు, పైగా కేసీఆర్ సొంత నియోజకవర్గం. ఇలా అన్నీ టీఆర్ఎస్‌కు ప్లస్‌ పాయింట్సే . సిద్ధిపేటలో ప్రతిపక్షాలకు ఒక్క స్థానం అయినా దక్కుతుందా? అనుకున్నారు రాజకీయ విశ్లేషకులు.  

 

కానీ సిద్ధిపేట మున్సిపాల్టీకి జరిగిన ఎన్నికల్లో గులాబీ పార్టీ అనుకున్నట్లు ఏకపక్షంగా విజయాన్ని నమోదు చేయలేదు. మొత్తం 34 స్ధానాలకు గానూ ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 28 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 16 స్థానాల్లో టీఆర్ఎస్, 7 స్థానాల్లో ఇండిపెండెంట్లు, 2 స్థానాల్లో కాంగ్రెస్, 2 స్థానాల్లో బీజేపీ, ఒక స్థానంలో ఎంఐఎం గెలుపొందాయి. ఈ ఫలితాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుచించలేదు. సన్నిహితుల వద్ద కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలంగాణ భవన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

ముఖ్యంగా ఈ ఫలితాలు హారీశ్‌కు మింగుడు పడటం లేదు. హరీశ్ అంటే సిద్ధిపేట..సిద్ధిపేట అంటే హరీశ్ అన్నంత బలమైన ముద్ర ప్రజల్లో ఉంది. పార్టీ తరపున కంటే వ్యక్తిగతంగా తీసుకున్న హరీశ్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నుంచే ఓట్లు వేయాల్సిందిగా సిద్ధిపేట వాసుల్ని కోరారు. ఉహించని ఈ ఫలితాలతో హరీశ్ షాక్‌కు గురైనట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి మార్పులు జరుగుతాయో చెప్పలేం అనడానికి ఇదొక ఉదాహరణ. ఈ ఎన్నికలు టీఆర్ఎస్‌కు డేంజర్ బెల్స్ మోగించి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాయి. 
 

google-ad-img
    Related Sigment News
    • Loading...