English | Telugu

సిరిపై జెస్సీ షాకింగ్ కామెంట్స్‌

బిగ్‌బాస్ సీజ‌న్ 5 కంటెస్టెంట్ సిరి హ‌న్మంత్ గ‌త కొంత కాలంగా శ్రీ‌హాన్ ప్రేమ‌లో మునిగితేలుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఇటీవ‌ల బిగ్‌బాస్ హౌస్‌లో సిరికి, ష‌న్నుకి మ‌ధ్య త‌రుగుతున్న దూరం.. పెరుగుతున్న బంధంపై ర‌క ర‌కాలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటిపై ఇటీవ‌ల యాంక‌ర్ ర‌వి కూడా క్లారిటీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇదిలా వుంటే సిరిని జెస్సీ కూడా ఇష్ట‌ప‌డుతున్నాడు. ఇటీవ‌ల అనారోగ్య కార‌ణాల వ‌ల్ల ఇంటి హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చేసిన జెస్సీ తాజాగా సిరిపై షాకింగ్ కామెంట్స్ చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

హౌస్‌లో ష‌న్నుతో పాటు సిరితో చ‌నువుగా వున్న జెస్సీ ఒక ముద్దు నెట్టొచ్చుక‌దా అంటూ అల్ల‌రి చేసిన విష‌యం.. కొన్ని సంద‌ర్భాల్లో టాస్క్ పూర్త‌యిన త‌రువాత హ‌గ్ చేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే తాజాగా సిరిపై జెస్సీ షాకింగ్ కామెంట్స్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌స్తుతం హౌస్‌లో వున్న సిరి.. త‌న ఫ్రెండ్ ష‌న్నుతో క్లోజ్‌గా వుంటున్న విష‌యం తెలిసిందే. సిరి త‌ల్లి, ష్ను త‌ల్లి ఈ ఇద్ద‌రూ సిరి - ష‌న్నుల‌ హ‌గ్గులు హ‌ద్దులు దాటుతున్నాయ‌ని అవి కాస్త త‌గ్గించుకుంటే మంచ ఇద‌ని హెచ్చ‌రించినా సిరి మాత్రం ష‌న్నుని హ‌గ్ చేసుకోకుండా వుండ‌టం లేదు.

దీంతో సిరిని, ష‌న్నుని నెట్టింట ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా వుంటే సిరిపై జెస్సీ చేసిన కామెంట్స్ మ‌రింత ఆజ్యం పోసేవిగా వున్నాయి. తన‌కు పిరిలాంటి అమ్మాయి భార్య‌గా రావాలి. అలాంటి అమ్మాయి అయితే పెళ్లి చేసుకుంటాన‌ని సిరిని ఉద్దేశించి జెస్సీ తాజాగా అన‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. సిరి న‌న్ను హౌస్‌లో ఎలా చూసుకుందో అంతా చూశారు అలా త‌న‌ని చూసుకునే అమ్మాయి అయితే పెళ్లి చేసుకుంటాన‌ని జెస్సీ స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.