English | Telugu

బిగ్‌బాస్‌పై ర‌వి సంచ‌ల‌న కామెంట్స్‌!

బిగఃబాస్ సీజ‌న్ 5 టైటిల్ ఫేవ‌రేట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యాంక‌ర్ ర‌వి అనూహ్యంగా 12వ వారంలోనే ఇంటి నుంచి బ‌య‌టికి రావ‌డం ప‌లువురిని షాక్‌కు గురిచేసింది. అత‌ని ఎలిమినేష‌న్ అన్ ఫేర్ అని.. అత‌న్ని కావాల‌నే ఎలిమినేట్ చేశార‌ని ర‌వి ష్యాన్స్ ఆందోళ‌న‌కు దిగిన విష‌యం తెలిసిందే. అంతే కాకుండా సోష‌ల్ మీడియా వేదిక‌గా బిగ్‌బాస్ నిర్వ‌హ‌కుల‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇదిలా వుంటే హౌస్ నుంచి అర్థాంత‌రంగా బ‌య‌టికి వ‌చ్చిన యాంక‌ర్ ర‌వి బిగ్‌బాస్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

టాప్ 5లో వుండాల్సిన ర‌వి ఇలా అక‌స్మాత్తుగా ఎలిమినేట్ కావడం ఏంటి అని అంతా అవాక్క‌య్యారు కూడా. యాంక‌ర్ ర‌వి కూడా ఊహించ‌ని ప‌రిణామానికి ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యాడ‌ట‌. హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చాక తొలిసారి ఇన్‌స్టా వేదిక‌గా త‌న అభిమానుల‌తో ముచ్చ‌టించాడు ర‌వి. ఈ సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించి బిగ్‌బాస్ నిర్వాహ‌కుల‌కు షాకిచ్చాడు. త‌న ఎలిమినేష‌న్‌పై అనుమానాలున్నాయ‌న్నాడు. అంతే కాకుండా బిగ్‌బాస్ హౌస్‌లో జ‌రిగేది ఒక‌టి కానీ చూపించేది మ‌రోట‌ని విమ‌ర్శ‌లు గుప్పించాడు.

తానొక‌టి చేస్తే బ‌య‌టికి మ‌రోలా ప్రొజెక్ట్ చేశారన్నాడు. హౌస్‌లోకి వెళ్లేముందు మీమ్స్‌, ట్రోల్స్ గురించి త‌న‌ని వాడుకోమ‌ని చెప్పాన‌ని, అయితే హ‌ద్దులుదాటి నాభార్య‌ని కూడా ఇందులోకి లాగార‌న్నారు. చివరికి నా పాప మీద కూడా ఓ బ్యాచ్ మీమ్స్‌, ట్రోల్స్ వేసింది. వాళ్ల‌ని ఏమ‌నాలి? .. వాళ్ల‌కు ఓ రెండువేల రూపాయ‌లు ఇస్తే వాళ్ల ఇంట్లో వాళ్ల‌ని కూడా ట్రోల్ చేస్తార‌ని యాంక‌ర్ ర‌వి మండ‌ప‌డ‌టం గ‌మ‌నార్హం.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.