English | Telugu

ర‌ష్మీ మందు పార్టీ ఇస్తుంద‌ట‌!

ప్ర‌స్తుతం సెల‌బ్రీటీలంతా మందు పార్టీల‌ని ఎంక‌రేజ్ చేయ‌డం మొద‌లుపెట్టారు. ఇటీవ‌ల జానీవాక‌ర్ లేటెస్ట్ వెర్ష‌న్ ని ప్ర‌మోట్ చేస్తూ ఓ పెగ్గు క‌లిపి చిందులేస్తున్న వీడియోని బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే షేర్ చేయ‌డం అది నెట్టింట వైర‌ల్‌గా మార‌డం తెలిసిందే. తాజాగా అలాంటి ఓ లిక్క‌ర్‌కి సంబంధించిన వీడియోని `జ‌బ‌ర్ద‌స్త్‌` ఫేమ్ ర‌ష్మీ గౌత‌మ్ ఇన్ స్టా వేదిగా షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట సంద‌డి చేస్తోంది.

`స‌మ్మ‌టి విస్కీ క‌మ్మ‌టి వాస‌న.. అందుకే ఎంసీ నంబ‌ర్ వ‌న్‌..` అంటూ ర‌ష్మీ చేసిన ఈ వీడియోలో చాలాకీ చంటి, ముక్కు అవినాష్ కూడా క‌నిపించారు.ఇదే వీడియోలో అవినాష్‌కి వీడియో కాల్ చేసిన చ‌లాకీ చంటి `ఏంరా అవినాష్ ఫుల్‌ ఫేమ‌స్ అయిన‌వ్.. దావ‌త్ ఎప్పుడిస్తున్న‌వ్‌...` అని అడిగాడు. వెంట‌నే ర‌ష్మీ గౌత‌మ్ అందుకుని `దావ‌త్ అంటే తెలుసు క‌దా...జ‌బ‌ర్ద‌స్త్‌గా వుండాలి అంటే నంబ‌ర్ వ‌న్ వుండాలి` అన‌డం.. దానికి ముక్కు అవినాష్ స‌రె స‌రే నేను పోవాలి.. త్వ‌ర‌లోనే చేసుకుందాం.. ఓకేనా మ‌న దోస్త్‌లంద‌ర్ని పిలువుర్రి రైట్` అంటూ వీడియో కాల్‌ని క‌ట్ చేశాడు.

అనివాష్ దోస్త్ లంద‌ర్ని పిల‌వ‌మ‌న్నాడు అంద‌ర్నీ అంటే మ‌న నంబ‌ర్ వ‌న్ ఫ్యాన్స్ అంద‌రిని అంటూ ర‌ష్మీ ఈ వీడియోకి ఎండ్ డైలాగ్ చెప్పింది. ప్ర‌స్తుతం ఈ వీడియోని చూసిన నెటిజ‌న్స్ ర‌ష్మీ మందు పార్టీ ఇస్తుంద‌ట‌` అంటూ కామెంట్‌లు చేస్తున్నారు. నెట్టింట్లో ర‌ష్మీ మందు పార్టీ వీడియో అంటూ ఈ వీడియోని నెటిజ‌న్స్ వైర‌ల్ చేస్తున్నారు. మందు ప్రాచారం కోసం ర‌ష్మీ చేసిన ఈ వీడియోలో ఓ రేంజ్‌లో నెట్టింట పంచ్‌లు వినిపిస్తున్నాయి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.