English | Telugu
మాళవిక కుట్రని ఖుషీ బయటపెట్టిందా?
Updated : Mar 2, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మలబంధం`. గత కొంత కాలంగా స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ వీక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ముందు సాదా సీదాగా ప్రారంభమైన ఈ సీరియల్ క్ర క్రమంగా పాపులారిటీని సొంతం చేసుకుంటూ విశేష ఆదరణ దిశగా పయనిస్తోంది. యష్, వేదల పెళ్లిని గమనించిన మాళవిక ఎలా గైనా చెడగొట్టాలని పన్నాగం పన్నుతుంది. వెంటనే వేద దగ్గరికి వెళ్లి తనతో ఏకాంతంగా మాట్లాడాలని చెప్పి యష్ గురించి లేనిపోనివి చెప్పి తన మనసు మారుస్తుంది.
దీంతో మాళవిక ట్రాప్ లో పడిన వేద మనం మోసపోయామని తల్లితో చెప్పి పెళ్లి జరగదని యష్ కు, అతని కుటుంబానికి షాకిస్తుంది. అయితే మాళవిక చెప్పిన విషయాల్లో యష్ కు కొడుకు వున్నాడన్నది బయటపడుతుంది. ఆ విషయాన్ని యష్ తల్లి మాలిని అంగీకరిస్తుంది. అయితే ఆ విషయం దాచడం తమ తప్పేనని అంగీకరించి వేద కుటుంబానికి క్షమాపణలు చెబుతుంది. దీంతో వేద తల్లి ఇంత మోసం చేస్తారా? అని యష్ కుటుంబాన్ని నిలదీస్తుంది. వెంటనే వేద ఇక ఈ పెళ్లి జరగదని చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్లిపోతుంది.
Also Read:మాళవిక ట్రాప్ లో వేద.. పెళ్లి ఆగిపోతుందా?
కట్ చేస్తే... యష్ .. వేదల పెళ్లి ని ఆపేశానన్న ఆనందంలో ఇంటికి చేరుకున్న మాళవిక ఆ విషయాన్ని అభిమన్యుకి చెబుతుంది. వెంటనే ఇద్దరు సెలబ్రేట్ చేసుకోవడానికి పార్టీకి వెళతారు.. ఇదంతా గమనించిన ఖుషీ పెళ్లి ఆగిపోయిందా? అని బాధపడుతూ వేద దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. ఆయమ్మ సహాయంతో కల్యాణ మండపానికి చేరుకుంటుంది. అక్కడ ఒంటరిగా వున్న వేద దగ్గరికి వెళ్లి కావాలనే తన తల్లి మాళవిక ఇదంతా చేసిందని, పెళ్లి చెడగొట్టిందని, ఇందులో తన తండ్రి యష్ తప్పు ఎంత మాత్రమూ లేదని వేదకు చెబుతుంది. అంతే కాకుండా నువ్వు మా నాన్నని పెళ్లి చేసుకోకపోతే వాళ్లు నన్ను కనపించకుండా చేస్తారని, జీవితంలో ఇక నేను నీకు కనిపించనని చెప్పి ఖుషీ అక్కడి నుంచి వెళ్లిపోతుంటుంది. ఆ మాటలు విన్న వేద ఏం చేసింది? ఇంతకీ యష్ ని పెళ్లి చేసుకుందా? లేదా? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.