English | Telugu

మాళ‌విక - అభిమ‌న్యుల‌కు షాకిచ్చిన య‌ష్ - వేద‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల‌బంధం`. నిరంజ‌న్‌చ డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, మిన్ను నైనిక‌,ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, ఆనంద్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని ఈ సీరియ‌ల్ విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. తాజా ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఒక‌సారి చూద్దాం. మాళ‌విక కుట్ర‌ని తెలుసుకోని వేద త‌ను చెప్పిన మాట‌లు వినిపి య‌ష్ తో పెళ్లికి నిరాక‌రిస్తుంది. కూతురు మాత్ర‌మే ఉంద‌ని, కొడుకు లేడ‌ని త‌న‌ని న‌మ్మించి మోసం చేశారంటూ య‌ష్ కుటుంబంపై మండిప‌డుతుంది.

Also Read:ప్రభాస్ లాంటి హీరోని చూడలేదు!

అక్క‌డికి నుంచి లోనికి వెళ్లిపోయిన వేద‌ని వెతుక్కుంటూ అక్క‌డికి చేరుకున్న ఖుషీ.. త‌న త‌ల్లి మాళ‌విక ప‌న్నిన కుట్ర‌ని వేద‌కు తెలియ‌జేస్తుంది. త‌న తండ్రి మంచి వాడ‌ని, అత‌నికి ఎలాంటి కుట్ర‌లు తెలియ‌వ‌ని, త‌న‌కు నువ్వు కావాల‌ని, డాడీ, నువ్వు, నేను ముగ్గురం క‌లిసి వుందామ‌ని చెబుతుంది. దీంతో క‌న్విన్స్ అయిన వేద త‌న‌ని విడిచి వెళ్లిపోతున్న ఖుషీని అక్కున్న చేర్చుకుని పెళ్లికి అంగీక‌రిస్తుంది. ఇరు కుటుంబాలు ఆనందాన్ని వ్య‌క్తం చేసి య‌ష్, వేద‌ల పెళ్లి చేస్తారు.

పెళ్లి త‌రువాత ఊరేగింపుగా వెళుతుంటే య‌ష్, వేద‌ల మ‌ధ్య‌లో నిలుచుని ఖుషీ ఆనందంగా డ్యాన్స్ చేస్తూ వుంటుంది. అది చూసి య‌ష్, వేదలు మురిసిపోతూ వుంటారు. త‌ను కోరుకున్న‌ట్టుగానే య‌ష్, వేద‌ల వివాహం జ‌ర‌గ‌డంతో ఖుషీ ఆ ఆనందంతో మురిసిపోతుంది. ఇద్ద‌రి ప‌ట్టుకుని ఫొటోల‌కు పోజులిస్తుంది. అయితే జ‌ర‌గ‌దు అనుకున్న య‌ష్, వేద‌ల పెళ్లి జ‌రిగిపోవ‌డంతో మాళ‌విక - అభిమ‌న్యు ఏం చేశారు? .. ఎలాంటి కుట్ర‌కు తెర తీశారు? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.