English | Telugu
మాళవిక ట్రాప్ లో వేద.. పెళ్లి ఆగిపోతుందా?
Updated : Feb 26, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మలబంధం`. గత కొన్ని వారాలుగా మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ విజయవంతంగా సాగిపోతోంది. తల్లిని రాలేనని తెలిసి ఓ పసి పాపపై ప్రేమని పెంచుకున్న ఓ యువతి కథగా ఈ సీరియల్ ని రూపొందించారు. ఓ పాప నేపథ్యంలో సాగుతున్న ఈ సీరియల్ పెద్దలతో పాటు పిల్లలని కూడా ఎంటర్ టైన్ చేస్తోంది. యశోధర్ ని ఖుషీ కోసం పెళ్లి చేసుకోవడానికి వేద రెడీ అయిపోతుంది. ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం పెళ్లి ఏర్పాట్లు చేస్తుండటంతో హంగామా మొదలవుతుంది.
సంగీత్ ఏర్పాట్లు చేయడం.. అందులో వేద, యష్ కలిసి డ్యాన్స్ చేస్తుండగా సంగీత్ లోకి ఎంటరైన మాళవిక ఆ దృశ్యాలని చూసి షాక్ కు గురవుతుంది. యశోధర్ పెళ్లి చేసుకోబోయేది వేదనా అని ఆశ్చర్యపోతుంది. ఆ తరువాత వేదకు గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్లిన మాళవిక ఇండైరెక్ట్ గా మీ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తానని వేదకు షాకిస్తుంది. అదే సమయంలో ఖుషీ వేదకు ఇచ్చిన గిఫ్ట్ కనిపించి మరింత షాకవుతుంది మాళవిక. తన మాజీ భర్తే కాదు, తన కూతురు కూడా వేద వల్ల మారిపోయిందని తెగ ఫీలవుతుంది.
యష్ ని ఎలా పెళ్లి చేసుకుంటావో.. ఖుషీని నా నుంచి ఎలా దూరం చేస్తావో చూస్తానని ఆగ్రహాంతో ఊగిపోతుంది. గిఫ్ట్ వంకతో వేద తో ఇండైరెక్ట్ గా పెళ్లి పై సెటైర్లు వేస్తుంది. ఇంతగా మాళవిక హింట్ ఇస్తూ మాట్లాడుతున్నా వేదకు అర్థం కాదు. కానీ సంథింగ్ ఈజ్ దేర్ అని ఆలోచనలో పడుతుంది. వేద ఆలోచనలో వుండగానే సీరియస్ గా గిఫ్ట్ ఇచ్చేసి అక్కడి నుంచి మాలిని, యశోధర్ లని నిలదీస్తానంటూ వెళుతుంది మాళవిక.. అంతా కలిసి డ్రామా చేస్తున్నారని, యష్ పెళ్లి ఎవరితో జరగబోతోందని యష్ తల్లి మాలినితో వాదనకు దిగుతుంది.నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నీ నుంచి ఇలాంటి ఫ్రస్ట్రేషన్ నే కోరుకున్నా.. అదే ఇప్పడు నీలో కనిపిస్తోంది. అనగానే వేదని యష్ పెళ్లి చేసుకుంటున్నాడని నాకు తెలిసిపోయిందని చెబుతుంది. ముందు షాక్ అయినా.. అయితే ఏం చేస్తావంటూ మాలిని .. మాళవికతో అంటుంది. నీకు చేతనైంది చేసి పెళ్లి ఆపు చూద్దాం అంటుంది. అంతే కాకుండా యష్ - వేదల పెళ్లి ఆపడం నీ వల్ల కాదని ఛాలెంజ్ చేస్తుంది. అయితే మాళవిక - అభిమన్యు మాస్టర్ ప్లాన్ వేస్తారు. యష్ గురించి ఓ బలమైన అబద్ధాన్ని మాళవిక .. వేదకు చెప్పి తన మనసు మార్చేలా ప్రవర్తిస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది? మాళవిక - అభిమన్యు ప్లాన్ ప్రకారం యష్ - వేదల పెళ్లి ఆగిపోయిందా? .. లేక మాళవిక - అభిమన్యు ప్లాన్ బెడిసికొట్టిందా? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.