English | Telugu

'పెళ్ళాం చెబితే వినాలి' అంటున్న హైపర్ ఆది

'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో సుధీర్ లేని లోటు కనిపిస్తున్నా కూడా దాన్ని మాక్సిమం భర్తీ చేయడానికి ప్రయత్నిస్తోంది రష్మీ. ఇక 'శ్రీదేవి డ్రామా కంపెనీ'కి సంబంధించి నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. "పెళ్ళాం చెబితే వినాలి" అనేది ఈ వారం కాన్సెప్ట్. 'ఏమిటి ఇలా ఉన్నారంతా?' అని రష్మీ.. హైపర్ ఆదిని అడుగుతుంది. "మేమంతా భార్యా బాధితులం. వాళ్ళు పెట్టే బాధలు భరించలేక మీకు చెప్పుకుందామని ఈ షోకి వచ్చాం" అని చెప్తాడు. భార్యలంతా ఒక వైపు, భర్తలంతా ఒక వైపు ఉంటారు. ఈ రెండు టీమ్స్ మధ్య పోటీ రసవత్తరంగా జరిగేలా ఫ్రేమ్ చేశారు.

ఇంతలో శ్రీవాణి ఆపోజిట్ టీమ్ లో ఉన్న భర్త విక్రమ్ ని బెదిరిస్తుంది. "మర్యాదగా ఈ వైపుకి వచ్చేయండి, లేదంటే 60 కేజీల ఆటంబాంబ్ ఇక్కడ" అని అంటుంది. "60 కేజీలు కాదు 120 కేజీలు" అంటూ పంచ్ వేస్తాడు విక్రమ్. "మీ ఆవిడని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మా ఆవిడ పెరిగిపోతోంది" అంటూ ఇంకో కమెడియన్ జోక్ వేసేసరికి అందరు నవ్వేస్తారు. తర్వాత "నీ కోసం నీ కోసం జీవించా చిలక " అనే సాంగ్ ని శాంతికుమార్, సుమబిందు చక్కగా పాడి ఎంటర్టైన్ చేశారు.

"ఓ ప్రియా ప్రియా" అనే సాంగ్ కి కౌశల్, ఆయన వైఫ్ ఇద్దరూ కలిసి రొమాంటిక్ డ్యాన్స్ పెర్ఫామ్ చేసి స్టేజిని మంచి ఎనర్జిటిక్ గా మార్చేస్తారు. తర్వాత శ్రీవాణికి, విక్రమ్ కి మధ్య ఒక తాడు ఇచ్చి టగ్ ఆఫ్ వార్ పోటీ పెడతారు. శ్రీవాణి తెలివిగా తాడు లాగుతూ క్యారేజ్ చూపించేసరికి వెంటనే విక్రమ్ భార్యతో పాటు వాళ్ళ టీమ్ లోకి వెళ్ళిపోతాడు. భర్తల బ్యాచ్ అంతా తలబాదుకుంటుంది. "ఏమయ్యా తిమింగలంలా ఉన్నావ్ చిన్న పీతకే వెళ్ళిపోతావా నువ్వు" అంటూ హైపర్ ఆది డైలాగ్ వేస్తాడు. ఇంతలో రాంప్రసాద్ వచ్చి "మొగుళ్ళంతా లుంగీలు ఎందుకు కట్టుకుంటారు?" అని ఆదిని అడుగుతాడు. "భార్యను కట్టుకోవడం వలన పోయిన ప్రశాంతత అంతా లుంగీ కట్టుకోవడం వలన వస్తుంది" అంటూ కౌంటర్ వేస్తాడు ఆది.

Jayam serial : పారు వేసిన ప్లాన్.. గంగని అపార్థం చేసుకున్న రుద్ర!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -140 లో..... పెళ్లి అయి మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లుడు కూతురికి లక్ష్మి మర్యాదలు చేస్తుంది. రుద్రకి వరుస అయ్యోవాళ్ళు ఒక ఆటాడుకుంటారు. నల్లపూసల కార్యక్రమం అయ్యాక శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. ఇద్దరికి బంతాట ఆడిపిస్తారు. బిందెలో రింగ్ తీయిస్తారు. ఇద్దరు సరదాగా ఉంటారు. రుద్ర వంక గంగ చూస్తుంటే.. ఏంటి చూస్తున్నావ్ వెళ్లి కింద పడుకోమని రుద్ర అంటాడు. ఆ తర్వాత రుద్ర, గంగ సరదాగా బాక్సింగ్ చేస్తుంటారు. అప్పుడే రుద్ర కాలికి సెల్ఫీ స్టిక్ తగులుతుంది. అది రౌడీ చేత పారు పెట్టిస్తుంది.