English | Telugu

డాగ్ ట్రైనర్ గా సుమ

యాంకర్ సుమ కేవలం పేరు మాత్రమే కాదు దశాబ్దాలుగా బుల్లితెరపై అలరిస్తున్న ఒక బ్రాండ్. ఎలాంటి షో ఐనా సరే చిటికెలో చేసేస్తుంది. అసలు భయం అనేది ఆమె బ్లడ్ లోనే లేదు అన్నట్టుగా ఉంటుంది ఆమె వ్యవహారాల. అందుకే ఎవ్వరినైనా ఎంత పెద్ద స్టార్ నైనా సరే ఇట్టే నవ్వించేస్తుంది. ఆమె వయసు 40 కావచ్చేమో కానీ యాంకరింగ్ లో మాత్రం ఇంకా స్వీట్ 16 నే.. బిగ్ స్టార్స్ కి సంబంధించి ఎలాంటి ఈవెంట్ ఐనా సరే సుమ యాంకరింగ్ లేకుండా జరగదు. ఈమె బేసిగ్గా మలయాళీ కుట్టి ఐనా తెలుగు వారితో చాలా బాగా కనెక్ట్ ఐపోయింది. ఐతే సుమ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. " మనం మన ఇంట్లో పెంపుడు కుక్కలతో ఎలా మాట్లాడతాం, వాటి ఫీలింగ్స్ ఎలా అర్ధం చేసుకుంటాం" అనేదే ఆ వీడియో. ఆ వీడియోలో తాను పెంచుకునే కుక్కతో ఫీట్స్ చేయించింది సుమ. కుక్క పేరు చుక్కు. చుక్కులు, టుక్కుటుక్కులు అంటూ కుక్కతో మాట్లాడుతూ బిస్కట్ ని చూపిస్తుంది. అది కూడా ఆశగా చూస్తూండేసరికి " సిట్ " అంటుంది. చుక్కు కూర్చుంటుంది.

తర్వాత "రోల్" అంటుంది సుమ .. పక్కకు దొర్లినట్టు నటిస్తుంది కానీ పూర్తిగా రోల్ అవ్వదు. కాసేపు సుమ కోపంగా బుంగ మూతి ఒక బిస్కట్ విసిరేస్తుంది. ఇలా సుమ కుక్కతో ఆడుతున్న వీడియో వైరల్ అవుతోంది. " మీ కుక్క మీ మాట వినడం లేదు, స్టూడెంట్ కి డిస్టింక్షన్ వచ్చింది..కానీ టీచర్ కి కాదు , కుక్కతో జాగ్రత్త, మీరు దాంతో ఆడుకోవడం కాదు, అదే మీతో ఆడుకుంటోంది అంటూ నెటిజన్స్ ఈ వీడియోకి కామెంట్స్ చేస్తున్నారు.

Jayam serial : పారు వేసిన ప్లాన్.. గంగని అపార్థం చేసుకున్న రుద్ర!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -140 లో..... పెళ్లి అయి మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లుడు కూతురికి లక్ష్మి మర్యాదలు చేస్తుంది. రుద్రకి వరుస అయ్యోవాళ్ళు ఒక ఆటాడుకుంటారు. నల్లపూసల కార్యక్రమం అయ్యాక శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. ఇద్దరికి బంతాట ఆడిపిస్తారు. బిందెలో రింగ్ తీయిస్తారు. ఇద్దరు సరదాగా ఉంటారు. రుద్ర వంక గంగ చూస్తుంటే.. ఏంటి చూస్తున్నావ్ వెళ్లి కింద పడుకోమని రుద్ర అంటాడు. ఆ తర్వాత రుద్ర, గంగ సరదాగా బాక్సింగ్ చేస్తుంటారు. అప్పుడే రుద్ర కాలికి సెల్ఫీ స్టిక్ తగులుతుంది. అది రౌడీ చేత పారు పెట్టిస్తుంది.