English | Telugu

న‌య‌ని ప్లాన్ తో తిలోత్త‌మ‌కు వ‌ణుకు పుట్టిస్తున్న హాసిని

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `త్రిన‌య‌ని`. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ సీరియ‌ల్ ఆద్యంతం ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో సాగుతూ ఆక‌ట్టుకుంటోంది. గ‌త కొన్ని వారాలుగా జీ తెలుగులో ప్ర‌సారం అవుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని థ్రిల్ కు గురిచేస్తోంది. అషికా గోపాల్‌, చందూ గౌడ జంట‌గా న‌టించ‌గా, ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో ప‌విత్ర జ‌య‌రామ్‌, నిహారిక హ‌ర్షు, విష్ణు ప్రియ‌, శ్రీ‌స‌త్య‌, భావ‌నా రెడ్డి, సురేష్ చంద్ర‌, అనిల్ చౌద‌రి, ద్వార‌కేష్ నాయుడు త‌దిత‌రులు న‌టించారు.

పుండ‌రీనాథం ప్రాంగ‌ణంలోని స్థ‌లంలో పౌర్ణ‌మి రోజు పూజ చేయ‌మ‌ని గాయ‌త్రీ దేవి ఆత్మ చెప్ప‌డంతో న‌య‌ని, విశాల్ పూజా జ‌రిపిస్తారు. నాగ‌లికి పూజ చేసి దున్నేస్తారు. న‌య‌ని ఏదో చేసేస్తోంద‌ని, త‌ను ఏం చేయ‌బోతోందో తెలుసుకోవాల‌ని అక్క‌డికి తిలోత్త‌మ‌, క‌సి, వ‌ల్ల‌భ వ‌స్తారు. వారితో పాటే హాసిని, దురంధ‌ర కూడా వ‌స్తుంది. పూజ అనంత‌రం ప్ర‌సాదం ఇస్తూ హాసినికి ఓ సిమ్ కార్డ్ ని అంద‌జేస్తుంది న‌య‌ని. దాంతో తిలోత్త‌మ‌ని ఓ ఆట ఆడుకోమంటుంది.

ఆ సిమ్ కార్డ్ ని తీసుకుని ఎవ‌రికీ అనుమానం రాకుండా అక్క‌డి నుంచి హాసిని వెళ్లిపోతుంది. హాసినితో న‌య‌ని ఏం చెప్పిందా? అని తిలోత్త‌మ అనుమానంగానే చూస్తుంది. ఈలోగా నైట్ అవుంది. ఎవ‌రికీ తెలియ‌కుండా న‌య‌ని ఇచ్చిన సిమ్ ని యాక్టివేట్ చేసిన హాసిని.. వెంట‌నే తిలోత్త‌మ‌కు ఫోన్ చేస్తుంది. ఆ సిమ్ గాయ‌త్రీ దేవి ని హ‌త్య చేసిన భూష‌న్ ది కావ‌డం.. ఆ నంబ‌ర్ నుంచి కాల్ రావ‌డంతో తిలోత్త‌మ‌లో వ‌ణుకు మొద‌ల‌వుతుంది. ఫోన్ ఎత్తిన తిలోత్త‌మ‌కు హాసిని నేను భూష‌న్ భార్య‌ని అని, త‌ను గ‌త కొన్ని రోజులుగా క‌నిపించ‌డం లేద‌ని, త‌న‌తో నువ్వు చేయించిన హత్య‌ల గురించి పోలీసుల‌కు చెప్పేస్తాన‌ని బెదిరిస్తుంది.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? తిలోత్త‌మ ఏం చేసింది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Jayam serial : పారు వేసిన ప్లాన్.. గంగని అపార్థం చేసుకున్న రుద్ర!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -140 లో..... పెళ్లి అయి మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లుడు కూతురికి లక్ష్మి మర్యాదలు చేస్తుంది. రుద్రకి వరుస అయ్యోవాళ్ళు ఒక ఆటాడుకుంటారు. నల్లపూసల కార్యక్రమం అయ్యాక శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. ఇద్దరికి బంతాట ఆడిపిస్తారు. బిందెలో రింగ్ తీయిస్తారు. ఇద్దరు సరదాగా ఉంటారు. రుద్ర వంక గంగ చూస్తుంటే.. ఏంటి చూస్తున్నావ్ వెళ్లి కింద పడుకోమని రుద్ర అంటాడు. ఆ తర్వాత రుద్ర, గంగ సరదాగా బాక్సింగ్ చేస్తుంటారు. అప్పుడే రుద్ర కాలికి సెల్ఫీ స్టిక్ తగులుతుంది. అది రౌడీ చేత పారు పెట్టిస్తుంది.