English | Telugu

ముక్కు కోసి పప్పులో పెడతా

తొలివలపు నుంచి పక్కా కమర్షియల్ వరకు గోపీచంద్ హ్యాపీ జర్నీని ఆడియన్స్ చూస్తూనే ఉన్నారు. ఎలాంటి వివాదాల జోలికి పోకుండా టాలీవుడ్ లో తనకో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో గోపీచంద్. హిట్స్ కాదు, ఫ్లాప్స్ కాదు దేన్నీ కూడా పెద్ద సీరియస్ గా తీసుకోకుండా తన ఓన్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు. పక్కా కమర్షియల్ ప్రమోషన్స్ లో భాగంగా ఆలీతో సరదాగా షోకి హాజరయ్యారు గోపీచంద్..ఇక ఈ షోలో తన చిన్ననాటి విషయాలను చాలా పంచుకున్నారు. "ముక్కు కోసి పప్పులో పెడతా" ఏమిటి ఈ డైలాగ్ అని ఆలీ అడుగుతారు. ఒకసారి ఆరోజుల్ని గుర్తుచేసుకుని చెప్తాడు గోపీచంద్. చిన్నప్పుడు ఒక రోజు పెరుగన్నం తింటూ ఉండగా వాళ్ళ పెద్దన్నయ్య కనబడకుండా బ్లేడ్ తీసుకొచ్చి తల పైకెత్తు ముక్కు కోసి పప్పులో పెడతా అన్నాడట. అలా ఎలా పెడతారని గోపీచంద్ అడిగేసరికి ఠప్పున ముక్కును కోసేసాడట. ఆగకుండా రక్తం కారిపోయిందని చెప్పుకొచ్చారు గోపీచంద్.

ఇక తన ఎనిమిదేళ్ల వయసులోనే వాళ్ళ నాన్న టి.కృష్ణ కాన్సర్ తో చనిపోయేసరికి జీవితం తనకు చిన్న వయసులో ఎంతో నేర్పించిందని ఎమోషన్ అయ్యాడు. టి.కృష్ణ అప్పట్లో ఎన్నో ఉద్రేకభరితమైన సినిమాలు తీశారు. నేటి భారతం, ప్రతిఘటన, దేశంలో దొంగలు పడ్డారు, రేపటి పౌరులు ఇలా..తీసినవి కొన్నే ఐనా అప్పట్లో మంచి హిట్స్ కొట్టాయి. టి.కృష్ణ మూవీస్ అన్ని కూడా థాట్ ప్రొవొకింగ్ గా ఉంటాయి. సమాజాన్ని మరో కోణంలోంచి చూసేలా చేస్తాయి. ఆయన కొడుకే ఈ గోపీచంద్. హీరోగా చేసాడు విలన్ గా కూడా తన ప్రతిభను నిరూపించుకున్నాడు. జయం మూవీలో మంచి పవర్ ఫుల్ విలన్ రోల్ చేసి అందరితో శెభాష్ అనిపించుకోవడమే కాదు దీనికి గాను ఫిలిం ఫేర్ అవార్డుని అందుకున్నారు. అలాగే నిజం, వర్షం మూవీస్ లో పవర్ఫుల్ ఎనర్జిటిక్ విలన్ రోల్స్ చేసినందుకు మా టీవీ అవార్డ్స్ కూడా అందుకున్నాడు.

Jayam serial : పారు వేసిన ప్లాన్.. గంగని అపార్థం చేసుకున్న రుద్ర!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -140 లో..... పెళ్లి అయి మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లుడు కూతురికి లక్ష్మి మర్యాదలు చేస్తుంది. రుద్రకి వరుస అయ్యోవాళ్ళు ఒక ఆటాడుకుంటారు. నల్లపూసల కార్యక్రమం అయ్యాక శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. ఇద్దరికి బంతాట ఆడిపిస్తారు. బిందెలో రింగ్ తీయిస్తారు. ఇద్దరు సరదాగా ఉంటారు. రుద్ర వంక గంగ చూస్తుంటే.. ఏంటి చూస్తున్నావ్ వెళ్లి కింద పడుకోమని రుద్ర అంటాడు. ఆ తర్వాత రుద్ర, గంగ సరదాగా బాక్సింగ్ చేస్తుంటారు. అప్పుడే రుద్ర కాలికి సెల్ఫీ స్టిక్ తగులుతుంది. అది రౌడీ చేత పారు పెట్టిస్తుంది.