English | Telugu

వినాయకుడిని రాజ్ చేయడంతో కావ్య హ్యాపీ.. బాధలో అప్పు! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -818 లో.....కావ్య రిపోర్ట్స్ డాక్టర్ చూసి.. మీ అక్క గర్భసంచి చిన్నగా ఉంది. తొమ్మిది నెలలు బేబీని మోయ్యలేదని డాక్టర్ చెప్పగానే అప్పు, కళ్యాణ్ షాక్ అవుతారు. ఆ బిడ్డని మోయ్యడం వల్ల తన ప్రాణానికే ప్రమాదమని డాక్టర్ చెప్తుంది. మా అక్క మొదటిసారి తల్లి అవుతుంది.. అందరు చాలా సంతోషంగా ఉన్నారు.. ఇప్పుడు ఇలా అంటే వాళ్లేమవుతారని అప్పు అంటుంది. దీనికి పరిష్కారం అబార్షన్ కానీ ఇంకా పెద్ద డాక్టర్స్ కి ఈ ప్రాబ్లమ్ గురించి చెప్తాను.. వాళ్ళేం సలహా ఇస్తారో చూద్దామని డాక్టర్ అంటుంది.

మరొకవైపు కావ్య తల్లి కాబోతుందని రాజ్ తనకి సేవలు చేస్తుంటాడు. కావ్యకి తీసుకొని వచ్చిన జ్యూస్ లు అపర్ణ, ఇందిరాదేవి తాగుతారు. ఆ తర్వాత కనకం, కృష్ణమూర్తి వస్తారు. వినాయకుడి బొమ్మ నేనే స్వయంగా రెడీ చేస్తానని కావ్య అంటుంది. నువ్వా.. వద్దని రాజ్ అంటాడు. మరి మీరు చేస్తారా అని కావ్య అనగానే.. చేస్తానని రాజ్ అంటాడు. వినాయకుడి బొమ్మని తయారు చెయ్యడానికి అవసరం అయినవి అన్నీ కూడా కనకం, కృష్ణమూర్తి సిద్ధం చేస్తారు. రాజ్ కి కృష్ణమూర్తి హెల్ప్ చేస్తాడు. చివరగా రాజ్ బొమ్మ రెడీ చేస్తాడు. అది చూసి కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇద్దరు సరదాగా ఉంటారు. అప్పుడే అప్పు, కళ్యాణ్ వస్తారు. వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు.. ఈ విషయం తెలిస్తే ఏమవుతారోనని అప్పు అనుకుంటుంది.

ఆ తర్వాత అప్పు తన అక్క పరిస్థితి గురించి దేవుడికి చెప్పుకుంటూ బాధపడుతుంది. అప్పుడే కళ్యాణ్ వచ్చి డాక్టర్ దానికి సొల్యూషన్ చెప్తానన్నారు కదా అని అప్పుతో కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.