English | Telugu

కళ్యాణ్ పంపిన వీడియో చూసి ప్రేమ టెన్షన్.. అది ధీరజ్ చూస్తాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -256 లో......కలశం ఎవరు తీసుకొని వెళ్లారని రామరాజు ఆలోచనలో పడతాడు. అసలు ఏం జరుగుతుంది. దొంగ వచ్చి ఇంట్లో ఏం తీసుకొని వెళ్లకుండా కలశం తీసుకొని వెళ్లడం ఎంటని రామరాజు అంటాడు. అందరు ఆలోచిస్తుండగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని రామరాజు నిర్ణయం తీసుకుంటాడు. దాంతో ఆనందరావు, శ్రీవల్లి టెన్షన్ పడతారు.

పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి అందరు వెళ్తుంటే అప్పుడే భాగ్యం వస్తుంది. భాగ్యంకి ముందే శ్రీవల్లి అక్కడ జరుగుతున్న సంఘటనల గురించి చెప్తుంది. దాంతో భాగ్యం షాప్ కి వెళ్లి కలశం కొని శ్రీవల్లి దగ్గర కి చాటుగా వచ్చి గిల్టీ నగలు కలశంలో పెట్టి తీసుకొని వస్తుంది. కలశం నాకు దొరికింది అన్నయ్య అని భాగ్యం అనగానే అదేంటీ నీకు దొరకడం ఎంటని రామరాజు అడుగుతాడు. వస్తుంటే దారిలో పోదల్లో కనపడిందని చెప్తుంది. నాకూ ఏం అర్థం అవ్వడం లేదు వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని రామరాజు అంటాడు. అవును మావయ్య అని ప్రేమ అంటుంది కానీ నర్మద ఆపుతుంది. పోలీస్ కంప్లైంట్ అంటే ప్రతీసారి స్టేషన్ కి వెళ్ళాల్సి ఉంటుందని నర్మద ఆపుతుంది.

ఆ తర్వాత ప్రేమకి కొరియర్ వస్తుంది. అది శ్రీవల్లి తీసుకొని ఓపెన్ చేస్తుంది. అందులో ఒక బొకే ఉంటుంది. అది చూసి అడ్రెస్ లేదు.. ఎక్కడ నుండి వచ్చిందని ప్రేమ దగ్గరికి తీసుకొని వెళ్తుంది. నీకు బొకే వచ్చింది కానీ అడ్రెస్ లేదని శ్రీవల్లి అనగానే ప్రేమ టెన్షన్ పడుతుంది. ఏమైంది ఏదైనా రహస్యం ఉందా అని ప్రేమని శ్రీవల్లి అడుగుతుంది. కళ్యాణ్ పంపాడని ప్రేమకి అర్ధమవుతుంది. తరువాయి భాగంలో ప్రేమకి కళ్యాణ్ ఏదో వీడియో పంపిస్తాడు. అది చూసి ప్రేమ టెన్షన్ పడుతుంది. ప్రేమ దగ్గరికి ధీరజ్ వచ్చి తనని బయటకు తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.