English | Telugu
ఇంకా ఆరని నిప్పు...కేసు ఫైల్ చేశానంటూ అనసూయ ట్వీట్
Updated : Aug 30, 2022
లైగర్ మూవీ రిలీజ్ అవడం అది ఫ్లాప్ ఐన విషయం ఏమో కానీ సోషల్ మీడియా మొత్తం విజయ్ దేవరకొండ ఫాన్స్ కి అనసూయ కి మాత్రం ఒక రేంజ్ లో యుద్ధం జరిగింది. ‘అమ్మను తిట్టిన ఉసురు ఊరికే పోదు’ అందుకే సినిమా ఫెయిల్ అంటూ ఒక శాపనార్ధాల ట్వీట్ పోస్ట్ చేసింది అనసూయ. ఇక కథ అక్కడ మొదలయ్యింది. ఆ నిప్పు అసలు ఆరనే లేదు. ఈ విషయం విజయ్ దేవరకొండ ఫాన్స్ కి ఫుల్ కోపం తెప్పించింది. వాళ్ళు "ఆంటీ" అంటూ ట్రోలింగ్ కి దిగారు. విజయ్ దేవరకొండ అభిమానులకు అలాగే అనసూయ అంటే ఇష్టం లేని వారికి కోపం తెప్పించింది. దీంతో ‘ఆంటీ’ అంటూ ఆమె పై ఓ రేంజ్లో ట్రోలింగ్ కి దిగారు.
ఇండస్ట్రీలో ప్రస్తుతం అనసూయాది ఒక బెటర్ పొజిషన్ అని చెప్పొచ్చు. ఐతే ఇలా ఎందుకు ట్వీట్ చేసిందో ఏంటో ఎవరికీ తెలీదు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా అనసూయ మళ్ళీ ఒక ట్వీట్ పోస్ట్ చేసింది. ఇందులో తన పై అసభ్యకరంగా ట్వీట్లు వేసిన వారిపై కేసు పెట్టినట్లు, ఆ కేసు నెంబర్ ఎక్నాలెడ్జిమెంట్ ని కూడా పోస్ట్ చేసింది. "నేను ఎవరిమీద కంప్లైంట్ ఇవ్వాలి అనుకోలేదు, ఎవరి భవిష్యత్తు పాడవకూడదని అనుకున్నా. కానీ నా నిర్ణయం మార్చుకున్నా. ఏదైతే అది అయ్యింది. నేను కేసు పెట్టేసాను, ప్రాసెస్ కూడా స్టార్ట్ అయ్యింది " అంటూ ట్వీట్ చేసింది.