English | Telugu
రిమోట్ కి రబ్బర్ బ్యాండ్ వేయకపోతే కొత్తది కొనుక్కోవచ్చుగా
Updated : Aug 30, 2022
ఇటీవల జరిగిన క్రికెట్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించేసరికి ఎంతో మంది ఇండియన్స్ పండగ చేసుకున్నారు. యాంకర్ రవి కూడా ఫుల్ మస్తీ చేసాడు. ఆయన తన ఇంట్లో తన ఫ్రెండ్స్ తో కలిసి క్రికెట్ చూసి ఎంజాయ్ చేసాడు. ఒక్కసారిగా ఇండియా గెలిచేసరికి అందరూ కలిసి ఖుషి చేసుకున్నారు. ఇప్పుడు ఈ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసుకుని 'భారత్ మాతా కీ జై' అని నినాదాలు చేస్తూ ఆనందంతో ఎగిరారు రవి అతని ఫ్రెండ్స్. రవి బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో కంటెస్టెంట్ గా ఉన్నాడు అలాగే బిగ్ బాస్ నాన్-స్టాప్ ప్రోగ్రాం ని కూడా హోస్ట్ చేశాడు.
ఇకపోతే రవి ఇంట్లో ఉన్న టీవీ రిమోట్ కి రబ్బర్ బ్యాండ్ పెట్టడం చూసిన కొంత మంది నెటిజన్స్ "అన్నా మీ ఇంట్లో కూడా రిమోట్ కోసం కొట్టుకుంటారా ..ఎవరెవరు ?" "ప్రతీ ఇంట్లో రిమోట్ కి రబ్బర్ బ్యాండ్ వేసి ఉంటది మామ..అది సృష్టి ధర్మం" "రిమోట్ కి రబ్బర్ బ్యాండ్ వేయకపోతే కొత్తది కొనుక్కోవచ్చుగా" అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఏ ఇంట్లో చూసుకున్నా ఎవరికీ కోపమొచ్చినా రిమోట్లు మిగిలిపోతాయి. తర్వాత దానికి రబ్బర్ బండ్లు కనిపిస్తాయి. ఇది ప్రతీ ఇంట్లో కామన్ గా కనిపించేదే. అంత స్టార్ యాంకర్ ఐన రవి ఇంట్లో కూడా రిమోట్ కి రబ్బర్ బ్యాండ్ చూసేసరికి నెటిజన్స్ ప్రతీ ఒక్కదాన్ని ఎంత నిశితంగా పరిశీలిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.