English | Telugu
చమ్మక్ చంద్ర కాళ్లపై పడిన రచ్చ రవి!
Updated : Aug 30, 2022
బుల్లితెర ఎంటర్టైన్మెంట్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఆ షోస్ చూస్తూ ఎంజాయ్ చేస్తే చాలు. ఒకప్పుడు జబర్దస్త్ మాత్రమే ఉండేది. తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్, ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చింది. ఇలా ఎన్నో షోస్ అలరిస్తూ ఉన్నాయి. ఛానల్ ఏదైనా కావొచ్చు కానీ ఎంటర్టైన్మెంట్ కి లేదు ఎండ్ అన్నట్టు ఉంటున్నాయి కొత్త కొత్త షోస్. ఇక ఇప్పుడు జీ తెలుగులో "మన ఊరి రంగస్థలం" పేరుతో ఒక కొత్త ఈవెంట్ రాబోతోంది. ఈ షోకి సంబందించిన ప్రోమో ఒకటి రిలీజ్ ఐపోయింది.
ఇప్పుడు మరో ప్రోమో సందడి చేస్తోంది. అదే చమ్మక్ చంద్ర ఎమోషనల్ ప్రోమో. ఇందులో చూస్తే చమ్మక్ చంద్ర లేడీ గెటప్ తో నటుడు సుధీర్ బాబుతో కలిసి డాన్స్ చేస్తాడు. తర్వాత రచ్చ రవి వచ్చి చంద్ర కాళ్ళ మీద పడతాడు.
"చంద్రన్న ఒక్క అవకాశం ఇయ్యందే నేను లేను కదా" అంటూ చెప్పేసరికి చంద్ర హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తర్వాత చంద్ర, తాను ఇండస్ట్రీకి వద్దామనుకున్నప్పుడు 1500 రూపాయలుఇచ్చి పంపించారని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ఇప్పుడు ఈ చంద్ర ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.