English | Telugu
'జబర్దస్త్'కి బంగారం పాప!
Updated : Aug 30, 2022
ఈమధ్య సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో ఏది అంటే చాలు "బంగారం.. చెప్పనా" అనేది. ఆ వీడియోకి రీమిక్స్ చేసి ఎవరికీ వారు ఆ డైలాగ్స్ తో రీల్స్ చేస్తున్నారు. ‘బంగారం.. చాలా మంది అడుగుతున్నారు.. నీ బంగారం ఎవరని.. ఏమని సమాధానం చెప్పను. నువ్వు దూరమయ్యావని చెప్పనా.. నువ్వు నా దగ్గరే ఉన్నావని చెప్పనా.. ఛీ పోరా"..ఈ డైలాగ్ వింటే చాలు ఎవరి గురించో అర్దమైపోయే ఉంటుంది. సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న ఈ బంగారం పాప శాంతి ఓ సూపర్ ఛాన్స్ కొట్టేసింది.
సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేవాళ్ళను జబర్దస్త్ టీమ్ తీసుకొచ్చి వాళ్లకు కూడా ఛాన్సెస్ ఇవ్వడం మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ బంగారాన్ని ఈ షోలోకి తీసుకొచ్చారు. ఆమె జబర్దస్త్ స్టేజిపై ఉన్న ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. హైపర్ ఆది, ఇంద్రజ, వెంకీతో తీసుకున్న ఫొటోలు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో, యూట్యూబ్లో పోస్ట్ చేసుకుంది. జబర్దస్త్ లో ఈమెకు సంబందించిన ప్రాక్టీస్ వీడియోస్ యూట్యూబ్ లో వైరల్ అవుతున్నాయి.