English | Telugu

ఛీ ఈ పెద్దోళ్ళకు మన ప్రేమ అర్ధమే కాదు...


ఫ్యామిలీ స్టార్ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షో న్యూ లవ్ వెర్సెస్ ఓల్డ్ లవ్ పేరుతో ఈ షోని ప్లాన్ చేశారు. పాత జంటలతో కొత్త జంటలు కూడా వచ్చారు. శ్రీవాణి - విక్రమాదిత్య, లాస్య-మంజునాథ్, మహేశ్వరి- శివ నాగ్, ప్రియాంక జైన్ - శివ్, పంచ్ ప్రసాద్ - సునీత, ధరణి-ప్రశాంత్ వచ్చారు. ప్రేమ గురించి రకరకాలుగా చెప్పుకొచ్చారు. "ప్రేమ అంటే వాళ్ళది కాదు మాది ..మొన్న ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాళ్ళు ఫోన్ చేశారు. అందులో లవ్ అనే పదం తీసేసి లాస్య - మంజునాథ్ అని పెట్టమన్నాను" అంటూ తమ లవ్ ఎంత గొప్పదో చెప్పుకొచ్చింది లాస్య. ఇక శివనాగ్ వచ్చి "మొన్న మేము బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఏ పాజిటివ్, ఓ పాజిటివ్ కాదు పి పాజిటివ్ వచ్చింది అంటే ప్రేమ పాజిటివ్ వచ్చింది" అని చెప్పాడు. "మళ్ళీ మా బ్లడ్ టెస్ట్ లో రక్త కణాలు లేవండి.. మొత్తం ప్రేమ కణాలే ఉన్నాయి అవి కూడా హార్ట్ షేప్ లో ఉన్నాయి. ఇక జెంట్స్ అంతా అమ్మాయిల్లా గెటప్స్ వేసుకుని డాన్స్ చేస్తూ ఫన్ క్రియేట్ చేశారు.

ఇక పంచ్ ప్రసాద్ ఐతే సుధీర్ ని పైనా కింద టచ్ చేసి అమ్మాయిలా సిగ్గుపడ్డాడు. మహేశ్వరీ - విక్రమ్ కలిసి "మన్మధుడి బ్రహ్మను పూని" అనే సాంగ్ కి డాన్స్ చేశారు. "మీరు అన్ని సార్లు తిరిగారమ్మా విక్రమ్ గారికి కళ్ళు తిరిగితే ఎలా చెప్పండి" అంటూ సుధీర్ కౌంటర్ వేసాడు. "ఛీ ఈ పెద్దోళ్ళకు మన ప్రేమ అర్ధమే కాదు" అంటూ మహేశ్వరీ సుధీర్ ని తిట్టి విక్రమ్ ని తీసుకుని వెళ్ళిపోయింది. "నువ్వు నా కన్నా పెద్దోడివి" అంటూ శ్రీవాణి కూడా సుధీర్ ని పెద్దోడ్ని చేసి తిట్టి మరీ వెళ్ళిపోయింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.