Illu illalu pillalu : పెళ్లికి ముందు ప్రేమ తప్పు చేసిందా.. భద్రవతికి చెప్పిన భాగ్యం!
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -271 లో....రామరాజుకి కళ్యాణ్ ఫోన్ చేసి.. నా పేరు కళ్యాణ్, నేను ప్రేమ ప్రేమించుకున్నామని కళ్యాణ్ అంటాడు. అప్పుడే కళ్యాణ్ వెనకలా నుండి ధీరజ్ వచ్చి కళ్యాణ్ ని కొడతాడు. మావయ్య గారు ఆ కళ్యాణ్ ఎవరని శ్రీవల్లి అనగానే.. ఎవరు లేదు మీరు అందరు లోపలికి వెళ్ళండి అని రామరాజు అంటాడు. అందరు వెళ్తారు. మరోవైపు కళ్యాణ్, ధీరజ్ మాట్లాడుకుంటారు. మీ నాన్నకి నిజం చెప్పేసానని కళ్యాణ్ అనగానే ధీరజ్ టెన్షన్ పడుతాడు. ఆ తర్వాత ఆ రోజు ప్రేమ, ధీరజ్ పెళ్లి చేసుకునే కంటే ముందు ఏదో జరిగి ఉంటుంది. నీకు ఏమైనా తెలుసా అని నర్మదని సాగర్ అడుగుతాడు. నాకేం తెలియదని నర్మద కవర్ చేస్తుంది.