కపిల్ శర్మ షోలో మెరిసిన "మిరాయ్" మూవీ టీమ్
రీసెంట్ గా వచ్చిన మిరాయ్ మూవీ ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో మనందరికీ తెలుసు. అందులో ముఖ్యంగా శ్రేయ, తేజ, జగపతి బాబు, హీరోయిన్ రితిక నాయక్. ప్రధాన పాత్రలు. ఇక వీళ్లంతా కపిల్ శర్మ షోలో మెరిశారు. ఇక కపిల్ శర్మ తేజ చెప్పిన డైలాగ్స్ ని హిందీలో చెప్పి నవ్వించాడు. ఇక శ్రియ తనకు కాఫీ ఇష్టం అని చెప్పేసరికి రష్యన్ అమ్మాయి ఒక్సానానా పిలిచి మీ వదిన వచ్చింది అంటూ కాసేపు హిందీలో, రష్యన్ లో మాట్లాడించాడు. ఇక ఈ షోకి పెర్మనెంట్ గెస్ట్ గా ఉన్న అర్చన పూరన్ సింగ్ కొన్ని క్వశ్చన్స్ అడిగింది. "జెబి సర్ మీకు గనక సూపర్ పవర్స్ ఉంటే ఎవరి మైండ్ ని చదవాలనుకుంటారు" అని అడిగారు.