English | Telugu

భాను కేసుని రీక్రియేట్ చేసిన బ్లూ టీమ్.. నిజం తేలుతుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -58 లో.....శకుంతల ఇంటికి వస్తుంది. ఏంటి అక్క డిస్సపాయింట్ అయ్యావా అని శకుంతలకి చిరాకు తెప్పించేలా ఇందుమతి మాట్లాడుతుంటుంది. నేను కేసు పెట్టింది తప్పు చేసిన వాళ్లకి శిక్ష పడాలని అని ఇందుమతిపై శకుంతల కోప్పడుతుంది. ఆ తర్వాత రుద్ర రాగానే గంగ తనకి దిష్టి తీస్తుంది. అది చూసి గతంలో శకుంతల దిష్టి తీసింది రుద్ర గుర్తుచేసుకుంటాడు.

ఆ తర్వాత ఇందుమతి కేసు గురించి తన భర్తని చిరాకు పెడుతుంది. మరొకవైపు పెద్దసారు, రుద్ర కలిసి సంఘటన రిక్రియేట్ చేసే దగ్గరికి వెళ్తుంటే నేను వస్తానని గంగ అంటుంది. వద్దని రుద్ర అంటాడు. పెద్దసారు, గంగ కలిసి మేనేజ్ చేసి గంగని తమ వెంట తీసుకొని వెళ్లేలా చేస్తారు. వీరు వెళ్తుంటే.. ఇషిక ఆపి భాను బావగారి హత్య కేసులో నీ హస్తం ఉందో లేదో కానీ రుద్ర బావ ఈ తప్పు చేయలేదని బుజువు కాకుండా చూసుకోమని వీరుకి ఇషిక సలహా ఇస్తుంది.

సంఘటన రీక్రియేట్ దగ్గరికి వెళ్తారు.. బ్లూ టీమ్ వాళ్ళు రీక్రియేట్ చేస్తారు. అందులో రుద్ర ఫోర్స్ గా భానుని నెట్టితే కింద పడిపోయాడని వాళ్ళు అంటారు. అలా ఎలా తేలుస్తారని గంగ అడ్డుపడుతుంది. ఆ తర్వాత నేను రి క్రియేట్ లో ఉంటాను.. భాను ప్లేస్ లో రుద్ర నువ్వు ఉండమని అంటారు. వద్దు బావ రిస్క్ అని వీరు అంటాడు. నేను భాను గారి ప్లేస్ లో ఉంటానని గంగ అంటుంది. వద్దని రుద్ర తనపై కోప్పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.