English | Telugu

మాస్క్ మ్యాన్ హరీష్ సింపథీ డ్రామా.. డిఫెండ్ చేసుకోలేకపోయిన కామనర్స్!

​బిగ్‌బాస్ సీజన్-9 లో అప్పుడే రెండు వారాలు గడిచిపోయింది. రెండో వారం మర్యాద మనీష్ హౌస్ నుండి వెళ్ళిపోయాడు. సోమవారం నాటి ఎపిసోడ్ లో మూడో వారం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ నామినేషన్స్ హీటెక్కించాయి. బిగ్‌బాస్ తెలివిగా రెండు గ్రూపుల్లోనూ వాళ్లలో వాళ్లు కొట్టుకు చచ్చేలా ఈ నామినేషన్స్ ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా టెనెంట్స్‌గా ఉన్న కామనర్లని ముందుగా సెలబ్రెటీల నుంచి నామినేషన్స్ చేయాలని చెప్పాడు. కానీ ఇందులో కంపల్సరీగా ఒకరు టెనెంట్ అయి ఉండాలని కండీషన్ పెట్టాడు. దాంతో రెండు గ్రూప్ ల మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి.

తేజ గురించి రాశి సెన్సేషనల్ కామెంట్స్

"సిలకేమో సీకాకుళం" అంటూ వెంకీ మూవీలో ఐటెం సాంగ్ చేసిన రాశి గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. ఆమె ఒకప్పుడు చాలా ఫామిలీ టైపు మూవీస్ చేశారు. శ్రీకాంత్, పవన్ కళ్యాణ్, మోహన్ బాబు, రాజశేఖర్ వంటి వాళ్లందరితో ఆమె నటించింది. అలాంటి రాశి కెరీర్ నిజం అనే మూవీతో ఆగిపోయింది. అలాగే డైరెక్టర్ తేజ గురించి ఒక ఇంటర్వ్యూలో ఆమె చాలా కామెంట్స్ చేశారు. "చెప్పిన క్యారెక్టర్ ఒకటి చేయించింది ఇంకో క్యారెక్టర్ అని ఆ మూవీ వదిలేసి వెళ్లిపోయారు" అంటూ హోస్ట్ అడిగిన ప్రశ్నకు రాశి జవాబిచ్చారు. "నాకు ఇలా చెప్పలేదు. తేజ గారు నన్ను ఆఫీస్ కి పిలిచారు. స్టోరీ చెప్పుకొచ్చారు. ఎలా అంటే గోపీచంద్ - మీకు మధ్య లవ్ ఉంటుంది ఇందులోకి మహేష్ బాబు గారు ఎంటరవుతారన్నారు. అప్పుడు మనం పాజిటివ్ గా ఫీలవుతామా, నెగటివ్ గానా...పాజిటివ్ గానే ఫీలవుతాం కదా. అంటే మహేష్ బాబును పొడవటం, మగరాయుడిలా ఉండటం, లెన్స్ పెట్టాలి, లుక్ మారాలి అని చెప్పి ట్రైనర్ ని పెట్టి వెయిట్ లాస్ చేయించారు. ఆ మూవీకి అసలు మేకప్ లేదు.

పవన్ కళ్యాణ్ తో గోకులంలో సీత 2...

పవన్ కళ్యాణ్ - రాశి నటించిన గోకులంలో సీత మూవీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది అప్పట్లో. ఐతే ఇప్పుడు రాశి ఆనాటి విషయాల గురించి ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. "నా కూతురు ఫస్ట్ బర్త్ డేకి కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేసాను. ఐతే అప్పటికి నేను ఏ అపాయింట్మెంట్ తీసుకోలేదు. నేను నా డ్రైవర్ కి చెప్పాను. అపాయింట్మెంట్ తీసుకోకుండా వచ్చేసాం మేడం అన్నాడు. సరే వాళ్ళ స్టాఫ్ కి పలానా ఆవిడ వచ్చారని చెప్పు అన్నాను. ఈ మాటలు కళ్యాణ్ గారి చెవిలో పడి అక్కడ నుంచి నన్ను పిలుస్తున్నారు. మా డ్రైవర్ ని మళ్ళీ నా దగ్గరకు పంపించి నన్ను తీసుకురమ్మని చెప్పారు.తిడుతున్నారు ఆవిడ వస్తే ఎందుకు అంత సేపు కూర్చోబెట్టారు అని.