English | Telugu

గ్లోబ్ ట్రోటర్, వారణాసి, రాముడు.. వారణాసి కథ ఇదేనా!

-కథ ఏంటి!
-ఎన్నో ప్రశ్నలు
-ప్రపంచ సిల్వర్ స్క్రీన్ పై వారణాశి వైభవం
-మహేష్ క్యారక్టర్ ఎలా ఉండబోతుంది

మొన్న శనివారం రామోజీ ఫిలింసిటీ లో జరిగిన ssmb 29 టీం తమ సినిమాకి 'వారణాశి' అనే టైటిల్ ని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రకటన వచ్చినప్పట్నుంచి 'వారణాశి' హ్యాష్ టాగ్ ట్రెండింగ్ లో ఉంది. నిజానికి వారణాశి అనేది భారతదేశపు చివరి నగరం పేరు. పరమేశ్వరుడు కాశీ విశేశ్వరుడుగా కొలువుతీరిన పుణ్యప్రదేశం. ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా 'వారణాశి'ని దర్శించాలని కోరుకుంటాడు. అంత పవర్ ఫుల్ ప్రాంతం. అలాంటిది మహేష్, రాజమౌళి తమ మూవీకి 'వారణాశి' అనే టైటిల్ నిర్ణయించడం ఇండియన్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. పైగా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కూడా కావడంతో 'వారణాశి' స్థల వైభవం ప్రపంచ మూవీ లవర్స్ కి పరిచయం కావడం ఖాయం.

దీంతో అసలు 'వారణాశి' సంబంధించిన కథ ఏమైంటుందనే ఆలోచన అభిమానులు,మూవీ లవర్స్ లో మెదులుతుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వాళ్ళు స్పందిస్తు మూవీలో మహేష్ బాబు గ్లోబల్ ట్రోటర్ గా కనిపించనున్నాడని మేకర్స్ తొలుత వెల్లడి చేసారు. గ్లోబల్ ట్రోటర్ అంటే ప్రపంచాన్ని చుట్టే యాత్రికుడు అని అర్ధం. మొన్న జరిగిన ఈవెంట్ లో మహేష్ రాముడిగా కనిపించనున్నాడని, రామాయణానికి సంబంధించిన సీన్స్ ఉంటాయని కూడా చెప్పారు. టైటిల్ ని వారణాశి గా చెప్పారు. పైగా రాముడు పుట్టిన అయోధ్య, వారణాశి రెండు కూడా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి.

ఫస్ట్ లుక్ రిలీజ్ అయినపుడు మహేష్ మెడలో శివుడి ఆయుధంలో ఒకటైన త్రిశూలం యొక్క లాకెట్ ని ధరించాడు. ఇన్ని క్యూరియాసిటీ లని కలిగిస్తున్న వారణాశి కి సంబంధించి కథ ఏమై ఉంటుందనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది.ఈ విషయంలో ఎవరికీ తోచిన విధంగా వారు కథ పలానా విధంగా ఉంటుందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.


also read:రజనీకాంత్ నటగురువు కన్నుమూత.. రాజకీయాల్లో ఆ రోజు ఏం జరిగింది

కానీ ఒక్కటి మాత్రం నిజం. ఈవెంట్ లో రాజమౌళి చెప్పినట్టుగా ఎవరు ఊహించని కథ, కథనాలతో 'వారణాశి' తెరకెక్కబోతుంది. వరల్డ్ సినిమా షాక్ అయ్యేలా టెక్నీకల్ గా కూడా వండర్స్ ని క్రియేట్ చేయబోతుంది. టైటిల్ అనౌన్స్ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీ ట్రైలర్ నే అందుకు ఉదాహరణ. ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ క్యారక్టర్ లు కూడా ఎవరు ఊహించని విధంగా ఉండబోతున్నాయి. ముందు ముందు వారణాశి కి సంబంధించి ఎలాంటి చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుందో చూడాలి.