English | Telugu

అఖండ 2 కి బాలీవుడ్ లో ఎన్ని థియేటర్స్!. అడ్డుగా ఉన్న ఐదుగురు హీరోలు 

ఎవరు ఆ ఐదుగురు
నార్త్ రిలీజ్ థియేటర్స్ ఎన్ని!
బాలయ్య జాతర మాత్రం ఖాయం
అభిమానుల్లో భారీ అంచనాలు

తనని 'గాడ్ ఆఫ్ మాసెస్'(God Of Masses)అని ఎందుకు అంటారో మరోసారి 'అఖండ పార్ట్ 2'(Akhanda 2)తో నటసింహం బాలకృష్ణ(Balakrishna)డిసెంబర్ 5 న చాటి చెప్పనున్నాడు. పరమేశ్వరుడిని ఆరాధించే అఘోర గా, సోషల్ క్యారక్టర్ మురళి కృష్ణ గా సిల్వర్ స్క్రీన్ పై బాలయ్య చేసే తాండవం ఒక రేంజ్ లో ఉండబోతుందనేది వాస్తవం. ప్రచార చిత్రాలు అందుకు తగ్గట్టుగా ఉండంటంతో థియేటర్స్ లో బాలయ్య తాండవాన్ని వీక్షించడమే తరువాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో వేగాన్ని పెంచారు.

ఈ మేరకు రీసెంట్ గా ముంబై లో ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. సదరు ఈవెంట్ లో బాలకృష్ణ తో పాటు దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati Srinu)అఖండ 2 గురించి చెప్పిన విషయాలు బాలీవుడ్ మూవీ లవర్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇదే సమయంలో నార్త్ లో అఖండ 2 ఎన్నిథియేటర్స్ లో విడుదల అవుతుందనే ఆసక్తి అభిమానుల్లో ఏర్పడింది. బాలయ్య కెరీర్ లోనే నార్త్ లో ఫస్ట్ టైం డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్న మూవీ కూడా కావడంతో ఆ ఆసక్తి కొంచం ఎక్కువగానే ఉంది. బాలీవుడ్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం నార్త్ లో అఖండ 2 అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

also Read: రాజమౌళి కి షాక్ ఇచ్చిన రాష్ట్రీయ వానరసేన.. సరూర్ నగర్ లో పోలీస్ కేసు నమోదు

నార్త్ హక్కులని ప్రముఖ కార్పొరేట్ కంపెనీ 'జీ స్టూడియోస్'(Zee Studios)దక్కించుకుంది. ప్రతిష్టాత్మకమైన ఈ కంపెనీ చేతిలో ఎన్నో సింగల్ థియేటర్స్ ఉన్నాయి. మల్టిప్లెక్స్ లు కూడా ఎక్కువ సంఖ్యలోనే జీ స్టూడియోస్ అధీనంలో ఉన్నట్టుగా టాక్. దీంతో అఖండ 2 భారీ స్క్రీన్స్ లో రిలీజ్ అవ్వడం పక్కా. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియా వేదికగా వస్తుండటంతో అఖండ 2 తో బాలయ్య నార్త్ ఎంట్రీ ఎంతో గ్రాండ్ గా ఉండబోతుందని, ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ సాధించడం ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు.

డేవోషనల్ కంటెంట్ కి నార్త్ ప్రేక్షకులు బ్రహ్మ రధం పడుతున్నారనే విషయాన్నీ కూడా ఈ సందర్భంగా వాళ్ళు గుర్తు చేస్తున్నారు. డిసెంబర్ 5 డేట్ చూసుకుంటే మాత్రం బాలీవడ్ లో 'ధురంధర్'(Dhurandhar)అనే మూవీ రిలీజ్ అవుతుంది. రణవీర్ సింగ్ , సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి స్టార్స్ ఉన్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ అంశాలతో దురంధర్ తెరకెక్కింది.



సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.