English | Telugu

రజనీకాంత్ నటగురువు కన్నుమూత.. రాజకీయాల్లో ఆ రోజు ఏం జరిగింది 

-రజనీకాంత్ నట గురువు మృతి
-గోపాలి గా సుపరిచితులు
-చిరంజీవి కూడా శిక్షణ
-రజనీ నివాళు
లు


సినీ వినీలాకాశంలో సూపర్ స్టార్ 'రజనీకాంత్'(Rajikanth)నిర్మించుకున్న సినీ సామ్రాజ్యం గురించి తెలిసిందే. ఐదు దశాబ్దాల నుంచి ఆ నటప్రస్థానం యొక్క స్థాయి రోజురోజుకి పెరుగుతూనే ఉంది. అంతలా తన అద్భుతమైన నటనతో అభిమానులని ప్రేక్షకులని మెస్మరైజ్ చేయడం రజనీ స్టైల్. ఇందుకు కారణం 'కెఎస్ నారాయణ స్వామి'. ఈయన ఎవరో కాదు రజనీకాంత్ కి నటనలో మెళుకువులు నేర్పిన నటగురువు. సినీ వర్గాల్లో కె ఎస్ గోపాలి(ks Gopali)అనే పేరుతో సుపరిచితులు. రజనీ కాంత్ ని దిగ్గజ దర్శకుడు బాలచందర్(Balachander)కి పరిచయం చేసింది కూడా గోపాలి నే.


నిన్న ఉదయం గోపాలి మరణించం జరిగింది. 92 సంవత్సరాల వయసు గల గోపాలి గత కొంతకాలంగా వయసు రీత్యా వచ్చే పలు అనారోగ్య ఇబ్బందులని ఎదుర్కుంటున్నారు. ఈ సమస్యలపై ట్రీట్ మెంట్ తీసుకుంటూ కూడా వస్తున్నారు. చివరకి పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడవడం జరిగింది. గోపాలి మరణ వార్త విన్నవెంటనే రజనీ కాంత్ హుటాహుటిన గోపాలి ఇంటికి వెళ్లి భౌతిక దేహాన్ని సందర్శించాడు. నివాళులు అర్పించిన అనంతరం తన గురువుతో ఉన్న అనుబంధం గురించి మీడియా సమక్షంగా వెల్లడి చేసాడు.

also read:బాలకృష్ణ కి ఆ స్టార్ హీరో భయపడ్డడా!

గోపాలి మరణ వార్త తెలియడంతో సోషల్ మీడియా వేదికగా రజనీ అభిమానులు గతంలో జరిగిన ఒక సంఘటనని గుర్తు చేసుకుంటున్నారు. రాజకీయాల్లోకి రావడం లేదని రజనీ ప్రకటించిన తర్వాత నేరుగా గోపాలి ని రజనీ కలిసాడు. అప్పట్లో ఈ భేటీపై పలు రకాల వార్తలు వచ్చాయని అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. చిరంజీవి(Chiranjeevi),అమితాబ్ బచ్చన్, నాజర్ వంటి స్టార్స్ కి కూడా గోపాలి నటనలో మెళుకువలు చెప్పినట్టుగా తెలుస్తుంది. చెన్నై ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ కి డైరెక్టర్ గా కూడా పని చేసారు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.