English | Telugu

హృదయానికి హత్తుకునే ఇండియన్ యానిమేషన్ మూవీ కికీ అండ్ కోకో

ఇటీవల అనిమేషన్ చిత్రాలు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఆపాదిస్తున్నాయి. ప్రత్యేకంగా బాలల చిత్రాలు నిర్మించడానికి ఎవరు ముందుకు రావడంలేదు. కాని వారికి అర్ధమయ్యేలా వినోదాత్మకంగా చిత్రాలు అందిస్తే తప్పక ఆదరిస్తారు. ఇండియన్ స్క్రీన్ పై లయన్ కింగ్, అలాద్దిన్, వంటి కొన్ని అనిమేషన్ చిత్రాలు విమర్శకుల ప్రశంసలు పొందుతూ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధిస్తున్నాయి. అంతఎందుకు జూలై లో విడుదల అయిన 'మహా అవతార్ నరసింహ' అనిమేషన్ చిత్రం, పిల్లలని, పెద్దలని విశేషంగా ఆకట్టుకుని రికార్డు స్తాయి వసూల్లతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే! ప్రస్తుతం ప్రేక్షకుల హృదయాన్ని హత్తుకునే ఓ ఇండియన్ అనిమేషన్ సినిమా “కికీ & కోకో” త్వరలో విడుదల కాబోతుంది. ప్రపంచవ్యప్తంగా ఎల్లలు దాటి, పలు భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది. పూర్తిగా భారత సినీ ఇండస్ట్రీ నుండి ఇక్కడి సాంకేతిక నిపుణులతో విభిన్న తరహాలో తొలి సారిగా పీ. నారాయణన్ దర్శకత్వంలో రూపొందించిన అనిమేషన్ చిత్రం కికీ & కోకో.

ఈ సందర్భాగా దర్శకుడు పీ. నారాయణన్ మాట్లాడుతూ....
"ఇది పిల్లలకే పరిమితం కాదు పెద్దల్లోనూ చిన్నప్పటి మధురానుభూతులను మరోసారి గుర్తు చేసే మాయా శక్తి ఇందులో ఉంది. చిన్నారుల వినోదం, విద్యకు కొత్త నిర్వచనం చూపే వినూత్న చిత్రం ఇది. కికీ అనే చాలా ప్రేమికమైన పెంపుడు జంతువు, కోకో అనే చిన్నారి మధ్య ఉన్న అపూర్వమైన బంధాన్ని ఈ చిత్రం చెబుతుంది. ప్రేమ, జీవిత పాఠాలు, అద్భుత క్షణాలతో నిండిన వారి ప్రయాణం అన్ని వయసుల ప్రేక్షకుల హృదయాలను తాకేలా రూపొందించబడింది. అనిమేషన్ యొక్క అసలు మేజిక్ ఏ వయసు వారినైనా అలరిస్తూ, ప్రేరేపించే శక్తి ఉంటుంది. అలాంటి అనిమేషన్ ప్రపంచంలో అడుగుపెడుతూ, మా తొలి ప్రయత్నం ‘కికీ & కోకో’ ఈ రోజుల్లో నేటి బాలలను నిజంగా ప్రభావితం చేసే విద్యా కథలు చాలా అవసరం. కికీ & కోకో అనేది స్నేహం, ప్రేమ, ఒక పిల్లవాడు తన పెంపుడు జంతువు మధ్యున్న మాంత్రిక బంధం గురించి అందరి హృదయాలను హత్తుకునే కథ. ఈ కథను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేమంతా కృషి చేసాము. అనిమేషన్ చిత్రాలు కేవలం హాలీవుడ్ వారు మాత్రమే తీయగలరు అనుకునే వారికీ మేము ఈ జోనర్ లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా సిద్ధంగా ఉందని సగౌవరంగా చెప్పగలము." అన్నారు.

ఇనికా ప్రొడక్షన్స్‌ క్రియేటివ్ ప్రొడ్యూసర్ జి.యం.కార్తికేయన్ మాట్లాడుతూ ...
కికీ & కోకో ఒక సినిమా మాత్రమే కాదు. ఇది స్నేహం, ప్రేమ, కథల ద్వారా పిల్లలు నేర్చుకునే విలువైన పాఠాల వేదిక. ఈ మాంత్రిక ప్రయాణాన్ని అందరూ తమ హృదయాలతో స్వాగతించాలని ఆహ్వానం పలుకుతున్నాము. కికీ & కోకో చిత్ర థియేటర్లలో మాత్రమే చూసి ఆనందించాలి. ఇందులో ప్రత్యేక మెర్చండైజ్, విద్యా రూప కల్పనలు, ప్రేక్షకుల జీవితాల్లోకి తీసుకురావడానికి ప్రత్యేకంగా రూపొందించాము. యావత్ కుటుంభ సభ్యులు కలసి చూసే చిరస్మరణీయమైన అనుభూతులను పంచె చిత్రంగా మీ ముందుకు రాబోతుంది".అని తెలిపారు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.