English | Telugu

బాలకృష్ణ కి ఆ స్టార్ హీరో భయపడ్డాడా!

బాలకృష్ణ, బోయపాటి కాంబో మరో సంచలనం
వా వాతియార్ అప్డేట్ ఏంటి!
కార్తీ కి హిట్ చాలా అవసరం
అఖండ 2 పై పాజిటివ్ వైబ్రేషన్స్


గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి 'బాలకృష్ణ'(Balakrishna)వన్ మాన్ షో 'అఖండ 2'(Akhanda 2)డిసెంబర్ 5 న పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టడానికి శరవేగంగా ముస్తాబవుతోంది. మేకర్స్ అత్యుతమ సాంకేతిక విలువలతో బాలయ్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు. విజువల్ గా కూడా పాన్ ఇండియా ప్రేక్షకులకి ఐ ఫీస్ట్ అనుభూతి కలగనుంది. బాలయ్య పద్మభూషణ్ అందుకున్న తర్వాత వస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో క్వాలిటీ విషయంలో కూడా రాజీపడలేదు. మూవీ చాలా బాగా వచ్చిందని మరోసారి బాలయ్య, దర్శకుడు బోయపాటి(Boyapati Srinu)కాంబో బాక్స్ ఆఫీస్ ని తమ వశం చేసుకోవడం ఖాయమనే టాక్ కూడా ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగానే వినిపిస్తుంది.

ఇక ప్రముఖ హీరో కార్తీ(Karthi)కి తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నపేరు ప్రఖ్యాతులు తెలిసిందే. సుదీర్ఘ కాలం నుంచి రెండు లాంగ్వేజెస్ లోను తనదైన శైలిలో దూసుకుపోతున్న కార్తీ, ప్రస్తుతం 'వా వాతియార్'(vaa vaathiyaar)అనే యాక్షన్ కామెడీ జోనర్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రంపై అభిమానులతో పాటు ప్రేక్షకులో భారీ అంచనాలు ఉన్నాయి. కార్తీ కూడా వాతియార్ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు. పైగా తనకి సోలో హిట్ వచ్చి చాలా కాలం అవుతుంది.

ప్రీవియస్ మూవీ సత్యం సుందరం తో హిట్ ని అందుకున్నా మల్టీస్టారర్ ఖాతాలోకి ఆ విజయం వెళ్ళింది. దీంతో వా వాతియార్ తో విజయం తప్పనిసరి.డిసెంబర్ 5 న రిలీజ్ డేట్ అని ఎప్పుడో ప్రకటించారు. కానీ డిసెంబర్ 5 నుంచి వాయిదా పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందుకు ప్రధాన కారణం అఖండ 2 అనే వార్తలు సౌత్ సినీ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తున్నాయి. అఖండ 2 బాలయ్య కెరీర్ లోనే మోస్ట్ ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ గా పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 5 నే రిలీజ్ అవుతుంది.

also read: అఖండ 2 కి బాలీవుడ్ లో ఎన్ని థియేటర్స్!. అడ్డుగా ఉన్న ఐదుగురు హీరోలు

కాబట్టి రిస్క్ ఎందుకు చెయ్యడమని వాతియార్ టీం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మేకర్స్ కార్తితో తమిళ, తెలుగు తో పాటు సౌత్ మార్కెట్ ని దృష్టిలో ఉంచుకొనే చిత్రాలు నిర్మిస్తుంటారు. ఈ కారణం చేతనే వాతియార్ ని వాయిదా వేస్తున్నారనే టాక్ చాలా బలంగానే వినిపిస్తుంది. ప్రస్తుతానికి వాతియార్ గురించి ఎలాంటి అప్ డేట్ లేకపోవడం కూడా ఇందుకు బలాన్ని చేకూరుస్తుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, పోస్టర్లు మాత్రం మంచి బజ్‌ని కలిగించాయి. పోలీస్ ఆఫీసర్ గా కార్తీ కనిపిస్తుండగా, ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి(Krithi Sheety)హీరోయిన్.