English | Telugu

రాజమౌళి కి షాక్ ఇచ్చిన రాష్ట్రీయ వానరసేన.. సరూర్ నగర్ లో పోలీస్ కేసు నమోదు  

-రాజమౌళి కి షాక్
-హనుమంతుడి పై ఏం మాట్లాడాడు
-నాకు నమ్మకం లేదు
-ఇదేనా చేసేది


దర్శక ధీరుడు రాజమౌళి(Ss Rajamouli),సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)ఎంతో ప్రెస్టేజియస్ట్ గా తీసుకొని నిర్మిస్తున్న చిత్రం 'వారణాసి'(Varanasi). భారతీయ చిత్ర పరిశ్రమలోనే ఒక సువర్ణ అధ్యయనాన్ని లిఖించడంతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమ గొప్పతనాన్ని ప్రపంచ సినీ యవనిక పై నిలబెట్టడమే లక్ష్యంగా శరవేగంగా ముస్తాబవుతుంది. భారతీయ ఇతిహాసమైన రామాయణం యొక్క గొప్పతనాన్ని కూడా 'వారణాసి' లో చెప్పబోతున్నారు. ఈ విషయాన్నీ చిత్ర యూనిట్ అధికారకంగా వెల్లడి కూడా చేసింది.దీంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు 'వారణాసి' రాక కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.


మొన్న శనివారం 'వారణాసి' కి సంబంధించిన మొట్టమొదటి అధికార ఫంక్షన్ హైదరాబాద్(Hyderabad)రామోజీ ఫిలిం సిటీ లో అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.ఈ వేడుకలో రాజమౌళి మాట్లాడుతు దేవుడిపై నాకు పెద్ద నమ్మకం లేదు. ఇంత పెద్ద ఎత్తున ఫంక్షన్ నిర్వహిస్తున్నావు కదా, హనుమంతుడు నీ వెనకే ఉండి నీ గుండె తట్టి నడిపిస్తాడని మా నాన్న చెప్పాడు.నాకు కోపం వచ్చింది. ఇదా నన్ను నడిపించేది. నా వైఫ్ కి హనుమంతుడు(Hamumanthudu)అంటే చాలా ఇష్టం. ఆమె ఆయనతో మాట్లాడుతు కూడా ఉంటుంది. కానీ ఇలా చేసాడు అనే వ్యాఖ్యలు చెయ్యడం జరిగింది.

రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలపై హిందు సమాజానికి చెందిన 'రాష్ట్రీయ వానరసేన'(Rashtriya Vanara sena)మండి పడుతుంది. సదరు వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉన్నాయని హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో రాజమౌళి పై కేసు నమోదు చేసింది. దీంతో ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాటు కేసుపై రాజమౌళి ఏం మాట్లాడతాడనే ఆసక్తి అందరిలో ఏర్పడింది.


Also Read: బైసన్ ఓటిటి రిలీజ్ డేట్ ఇదే.. హిందీ, కన్నడ, మలయాళ వారికి భారీ గిఫ్ట్


రాజమౌళి అనుకున్న విధంగా ఈవెంట్ జరగకపోవడం,టెక్నీకల్ గా కూడా ఎన్నో లోపాలు తలెత్తడంతోనే రాజమౌళి ఆ విధంగా మాట్లాడాడని సోషల్ మీడియా వేదికగా పలువురు వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి ని విమర్శించే వాళ్ళు కూడా లేకపోలేదు. ఒక్కటి మాత్రం నిజం 'వారణాసి'లో రామదూత ఆంజనేయుడుకి అగ్ర తాంబూలం ఇవ్వడం ఖాయం. రాముడు ఉంటే ఆంజనేయుడు ఉండాల్సిందే. మహేష్ రాముడుగా కనిపిస్తున్న విషయం తెలిసిందే.