English | Telugu

200 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ‘కృష్ణ ముకుందా మురారి‘!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ లో మురారి పాత్రలో గగన్ చిన్నప్ప, ముకుందగా యష్మీ గౌడ, కృష్ణగా ప్రేరణ కంబం నటిస్తున్నారు. కాగా మురారికి పెద్దమ్మ పాత్రలో టీవి యాక్టర్ ప్రియ నటిస్తుంది. ఈ సీరియల్ తాజాగా మంగళవారం నాటి ఎపిసోడ్‌తో రెండు వందల రోజులు పూర్తిచేసుకుంది. కాగా ఈ సీరియల్ ఫ్యాన్స్ ఇన్ స్టాగ్రామ్ లో అభినందనలు తెలుపుతున్నారు.

ఈ సీరియల్ ప్రారంభ ఎపిసోడ్ లలో.. వేరే దేశంలో మురారి, ముకుంద ప్రేమించుకుంటారు. ఆ తర్వాత కొన్ని రోజులకి వాళ్ళిద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఇండియాకి వచ్చిన మురారికి పోలీస్ గా ఉద్యోగం వస్తుంది. ఒకరోజు ఒక క్రిమినల్ ని పట్టుకునే పరిస్థితులలో.. మురారి కింద హెడ్ కానిస్టేబుల్ గా చేస్తున్న కృష్ణ వాళ్ళ నాన్న చనిపోతాడు. అయితే వాళ్ళ నాన్నని మురారి చంపడం చూసిన కృష్ణ షాక్ అవుతుంది. తను చనిపోతున్నానని తెలుసుకున్న కృష్ణ వాళ్ళ నాన్న.. మురారీతో కృష్ణ పెళ్ళి జరిపిస్తాడు. అయితే మురారి వాళ్ళ అన్న ఆదర్శ్, ముకుందని పెళ్ళి చేసుకుంటాడు. అయితే అదే సమయంలో ముకుంద, మురారిని ప్రేమిస్తుందని తెలుసుకున్న ఆదర్శ్ ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. అలా ముకుంద ఒక్కతే ఉండి, కృష్ణ మురారీలు కలిసి ఉండటాన్ని చూడలేకపోతుంది.

ఎలాగైనా కృష్ణ, మురారీలను విడదీయాలని ముకుంద చూస్తుంటుంది. అయితే తాజాగా జరుగుతున్న ఎపిసోడ్‌ లలో కృష్ణ, మురారీ ఇద్దరు కలిసిపోవాలని రేవతి వాళ్ళ ఫామ్ హౌస్ కి పంపిస్తుంది. అయితే ముకుంద వాళ్ళ ప్లాన్ ని పాడుచేసి ఏమీ తెలియనట్లు మళ్ళీ కృష్ణ, మురారీల కంటే ముందుగానే వచ్చేసి, మురారి డైరీని తన రూంలో పెట్టేస్తుంది. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో ఇంటిబయట చెప్పులు చూసి.. ఎవరివని రేవతిని పిలిచి అడుగుతుంది కృష్ణ. దాంతో అవి ముకుంద చెప్పులని రేవతి చెప్తుంది. దాంతో కృష్ణ షాక్ అవుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఈ ఎపిసోడ్‌ చూడాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.