English | Telugu
రిషి, వసుధారలకి ఒకరంటే ఒకరికి కొంచెం ఇష్టం కొంచెం కష్టం!
Updated : Jul 5, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -806 లో.. వసుధార, రిషి గురించి ఆలోచిస్తుంటాడు. ఎందుకు నాతో మాట్లాడాలని ట్రై చేస్తుంది. ఎందుకు ఇంకా నా ప్రేమ గురించి పరితపిస్తుంది. నాకు గతం గుర్తు చెయ్యాలని ఎందుకు ట్రై చేస్తుంది. వీటికి దూరంగా వెళ్ళాలని రిషి ఇంటి నుండీ బయటకి వెళ్తాడు.
రిషి బయటకు వెళ్ళి ఒక దగ్గర కార్ ఆపి వసుధార గురించి ఆలోచిస్తాడు. రిషి తనకు తానే మాట్లాడుకుంటాడు. అసలు తన మీద నాకు ఉన్నది ప్రేమనా, ద్వేషమా, కోపమా మళ్ళీ తన ప్రేమని గుర్తు చేస్తుందని ఇక్కడ నుండి పారిపోతున్నానా.. నేను ఉన్న దగ్గరికి తను వచ్చింది. కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతుంది. నేను ఎందుకు పారిపోవాలి. తనే కాదు.. మా డాడ్ వచ్చిన నా కోపం ఇలాగే ఉంటుంది. నేను మారనని రిషి అనుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటాడు. మరొక వైపు వసుధార, రిషి గురించి ఆలోచిస్తు.. మీకు కోపం ఉంది. కానీ నాపై ప్రేమ కూడా ఉందని వసుధార అనుకుంటుంది. ఒకసారి రిషి సర్ ని చూడాలని ఉందని వసుధార అనుకొని రిషి గదిలోకి వెళ్తుంది. వసుధార వెళ్లేసరికి రిషి తన గదిలో ఉండకపోయేసరికి..
రిషి కి ఫోన్ చేస్తుంది. వసుధార చేస్తుందని రిషి ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత ఏంజిల్, విశ్వనాథ్ లు రిషి ఎక్కడికి వెళ్లినట్లు అని ఆలోచిస్తూ ఉంటారు. రిషికి ఏంజిల్ ఫోన్ చేసి.. ఎక్కడున్నావ్ అని అడుగుతుంది. క్యాజువల్ గా బయటకు వచ్చాను. ఇప్పుడు వస్తున్నానని ఏంజిల్ తో రిషి చెప్తాడు. మీరు నా ఫోన్ కట్ చేసినా.. నా ప్రశ్నకి సమాధానం దొరికిందిప్పుడు. నా మనసు తేలిక అయిందని వసుధార అనుకుంటుంది. మరొక వైపు రిషి వచ్చేసరికి వసుధార హాల్లో ఎదురు చూస్తంటుంది. ఒక్క నిమిషం సర్ అని రిషిని ఆగమంటుంది. నేను ఇక్కడ ఉండడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారా? ఇబ్బందిగా అనిపించి బయటకు వెళ్ళారా? మీరు ఈ టైమ్ అయినా రాకపోయే సరికి ఏంజిల్, విశ్వనాథ్ ఇద్దరు టెన్షన్ పడ్డారు. నా వల్ల అసౌకర్యంగా ఉందా అని వసుధార అనేసరికి.. "మేడం మీరు అసౌకర్యం, ఇబ్బంది.. అంటూ వింతగా మాట్లాడుతున్నారు. కొందరు నా జీవితంని ఇలా చేశారు. ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే వింతగా ఉంది. ఎదుటి వారిపై నమ్మకం ఉండాలి. అది లేకుండా చేశారు. ఈ రిషి పరిస్థితులకు బయపడి వెళ్ళడు" అని రిషి అంటాడు. మీరు ఎన్ని అన్నా నేను భరిస్తాను. ఎందుకంటే నేను అబద్ధం చెప్పాను అది మీ కోసం చేశాను అని వసుధార అంటుంది.
రిషి వెళ్ళిపోయాక పెళ్లి విషయంలో రిషి సర్ నిజం తెలుసుకొని తర్వాత అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు కూడా అర్ధం చేసుకుంటాడని వసుధార అనుకుంటుంది. మరుసటి రోజు ఉదయం ఏంజెల్ ఇంటి నుండి వసుధార వెళ్లిపోవడానికి రెడీ అయి హాల్లోకి వస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావని ఏంజిల్ అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.