English | Telugu
కుక్కలు కూడా ఇలా చేయవు...వైరల్ వీడియోపై కస్తూరి ఫైర్
Updated : Jul 5, 2023
ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నటి కస్తూరి ఫైర్ బ్రాండ్ అన్న విషయం మనందరికీ తెలుసు. ఏ విషయాన్ని ఐనా బోల్డ్ గా తిట్టేస్తుంది. ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అన్న టైపులో కనిపించే ఆమె ఆదిపురుష్ లో శ్రీరాముడికి మీసాలేంటి అని కూడా ప్రశ్నించారు. ఇప్పుడు మరో ఇన్సిడెంట్ పై ఆమె ఫైర్ అయ్యారు. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఓ వ్యక్తి మరొక వ్యక్తిపై మూత్రం పోస్తున్న వీడియో వైరల్ అవుతోంది. దీనిపై ఆమె ట్విట్టర్ లో తన స్టైల్లో స్పందించారు. ‘కుక్కలు కూడా ఇలా చేయవు. బీజేపీ ఎమ్మెల్యే కేదార్ నాథ్ శుక్లాకు ఈ ప్రవేష్ శుక్లా సన్నిహితుడని తెలుస్తోంది.
ఆ నీచుడ్ని వెంటనే శిక్షిస్తారా లేక అలాగే వదిలేస్తారా ? గతంలో ఎయిర్ ఇండియా విమానంలో తమిళనాడు బీజేపీ నేత చేసిన ఘటన గుర్తుకొచ్చి అడుగుతున్నా’ అంటూ ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక ఈ విషయం కాస్తా పోలీసుల దృష్టికి వెళ్లడంతో పర్వేష్ శుక్లాను అరెస్ట్ చేశారు. ఈ విషయం గురించి సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ పోస్ట్ చేసిన ట్వీట్ ని కస్తూరి రీట్వీట్ చేశారు. ‘వావ్ చాలా స్పీడ్ గా ఆ నీచుడిని అరెస్టు చేసి నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అమలు చేసినట్లు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ తెలుసుకున్నారు. పిఓఏ, ఐపీసీ 290, ఐపీసీ 352, ఇతర సెక్షన్ల కింద అతనికి శిక్ష పడుతుంది. ఇక ఎమ్మెల్యే కేదార్ నాథ్ శుక్లా మాత్రం నిందితుడు పర్వేష్ శుక్లాతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఖండించారు’ అంటూ కూడా కస్తూరి ట్వీట్ చేశారు.