English | Telugu

ఎస్సైకి చిరాకు తెప్పించిన మీనాక్షి.. రాజ్ మాడ్చేసిన ఆమ్లెట్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -140 లో.. కనకం, కృష్ణమూర్తి లు అప్పు కోసం పోలీస్ స్టేషన్ లోనే ఉంటారు. అప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్లిన మీనాక్షి.. అన్ని కష్టాలు నీకే వస్తున్నాయి కనకం. అప్పుని నేను విడిపిస్తానంటూ స్టేషన్ లోపలికి వెళ్తుంది మీనాక్షి.

మరొక వైపు క్లయింట్స్ డిజైన్స్ బాగున్నాయ్ అని చెప్పడంతో రాజ్ సంతోషంగా ఉంటాడు. ఏంటి హ్యాపీగా ఉన్నారని కావ్య అడుగుతుంది. క్లయింట్స్ డిజైన్స్ ఓకే చేశారని చిరాకుగా చెప్పేసరికి.. హ్యాపీ విషయాన్ని నవ్వుతు చెప్పొచ్చు కదా.. మొహం ఎందుకు అలా పెట్టి చెప్తున్నారని కావ్య అంటుంది. ఆఫీస్ కి తీసుకొస్టే నైట్ ఏం జరిగిందో చెప్తానని అన్నావ్ కదా ఏంటో చెప్పమని రాజ్ అడుగుతాడు. నేను చెప్పనని కావ్య అనగానే.. నువ్వు అసలు మాట మీదనే ఉండవా? ఎప్పుడు మోసం చేస్తూనే ఉంటావా అని రాజ్ అంటాడు. మరి మీరేమన్న మాట మీద ఉంటారా.. రాహుల్ గురించి బయటపడితే నన్ను భార్యగా ఒప్పుకుంటానని అన్నారు కదా.

రాహుల్ గురించి బయట పెట్టాను కదా. మరి మీరేం చేశారు. మీరు చేస్తే న్యాయం.. నేను చేస్తే మోసం అంతేనా అని కావ్య అడుగుతుంది. నేను మాట తప్పాను కానీ నీలా మోసం చెయ్యలేదు. పద ఇంటికి వెళదామని కావ్యతో రాజ్ అంటాడు. మరొక వైపు మీనాక్షి , ఎస్సై దగ్గరికి వెళ్లి మా అప్పుని వదిలిపెట్టండంటూ రిక్వెస్ట్ చేస్తుంది. మీనాక్షి తన మాటలతో ఎస్సైకి చిరాకు తెప్పిస్తుంది. మీరు ఇక్కడే ఉంటే మిమ్మల్ని కూడా అప్పు తో పాటు సెల్ లో వేయాలసి వస్తుందని చెప్పి మీనాక్షిని బయటకు పంపిస్తాడు ఎస్సై. మరొక వైపు కావ్య కిచెన్ లో వంట చేస్తుంటే.. రాజ్ వెళ్లి కావ్య చేసిన వంట తినకూడదని బ్రేడ్ ఆమ్లేట్ చేయాలని స్టార్ట్ చేస్తాడు. కానీ అది మర్చిపోయి ఆమెలేట్ ని మాడ్చేస్తాడు. మరొక వైపు మీనాక్షి, ఎస్సైని రిక్వెస్ట్ చేస్తుంది. మీకు లంచం ఇస్తాను అప్పుని వదిలిపెట్టండని ఎస్సైతో మీనాక్షి అనడంతో.. లంచం తీసుకోవడం కాదు ఇవ్వడం కూడా నేరమే అంటూ మిమ్మల్ని కూడా సెల్ లో వేస్తానని ఎస్సై అనగానే.. మీనాక్షి బయటకు వస్తుంది.

ఆ తర్వాత కావ్య వంటలు బాగున్నాయంటూ రాజ్ చూసేలా ఊరిస్తూ తింటుంది. మీరు కూడా తినండి. వడ్డీస్తానని కావ్య అంటుంది. అప్పుడే అడుక్కునేవాడు వస్తే.. కావ్య చేసిన వంటలు అన్ని అడుక్కునే వాడికి ఇస్తాడు రాజ్. ఏంటండి మీకు ఇంత పంతం దేనికని కావ్య అడుగుతుంది. నేను చిన్నప్పటి నుండి ఇంతే అని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.