English | Telugu
ఆ ఇద్దరిపై రేవతి ఫైర్.. డ్రింక్ చేసిన మురారి ఏం చేయనున్నాడు!
Updated : Jul 6, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -201 లో.. కృష్ణ ఫామ్ హౌస్ నుండి ఇంటికి రాగానే బయట ఉన్న చెప్పులు చుసి షాక్ అవుతుంది. ఇలాంటి చెప్పులే ఫామ్ హౌస్ లో చూసానని గుర్తు చేసుకొని.. ఆ డైరీ అమ్మాయి ఇంటికి వచ్చిందా అని ఆలోచిస్తూ లోపలికి వస్తుంది కృష్ణ. లోపల ఉందేమో అని అటు ఇటు చూస్తుంటుంది కృష్ణ.
ఆ తర్వాత లోపలికి వచ్చిన కృష్ణని చూసిన రేవతి.. ఏంటీ అలా కంగారుగా చూస్తున్నావని అడుగుతుంది.. ఇంటి ముందు ఉన్న చెప్పులు ఎవరివని అడుగగా.. ముకుంద చెప్పులని రేవతి చెప్పగానే కృష్ణ షాక్ అవుతుంది. అసలు ఏమైందని రేవతి అడుగుతుంది. మేము కాకుండా ఫామ్ హౌస్ లో వేరే అమ్మాయి ఉందని కృష్ణ చెప్పగానే.. నీకెలా తెలుసని రేవతి అంటుంది. ఒక గది ముందు అమ్మాయి చెప్పులు చుసి డోర్ కొడితే ఎవరు డోర్ తియ్యలేదు.
అక్కడ చూసిన చెప్పుల లాంటివే ఇక్కడ చూసానని కృష్ణ చెప్పగానే రేవతి షాక్ అవుతుంది. ముకుంద ఫామ్ హౌస్ కి వెళ్లిందా అని అనుకొని.. ఆ విషయం కృష్ణకి తెలియకుండా జాగ్రత్త పడుతుంది రేవతి. ఇలాంటి చెప్పులు చాలా మందికి ఉంటాయి. ఇవన్నీ వదిలేసి భోజనం చెయమని కృష్ణతో రేవతి చెప్తుంది. కృష్ణ వెళ్లిపోయాక ఎలాగైనా ముకుంద సంగతి చెప్పాలని రేవతి అనుకుంటుంది. మరొక వైపు ముకుంద గీసిన మురారి బొమ్మని అలేఖ్య, మధు ఇద్దరు చూస్తూ ఎలాగైనా భవాని అత్తయ్యకి చెప్పాలని అనుకుంటారు. అప్పుడే రేవతి వచ్చి వాళ్ళ మాటలు వింటుంది. సారి అత్తయ్య మమల్ని క్షమించండంటూ అలేఖ్య అనగా.. మధు, అలేఖ్య ఇద్దరు కలిసి రేవతి కాళ్ళ మీద పడతారు. రేవతి ఇద్దరినీ కోపంతో కొడుతుంది.
మరొక వైపు మురారి వాళ్ళ ఫ్రెండ్ మురారి వాళ్ళింటికి వస్తాడు. ఇంటి టెర్రస్ మీద ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తుంటారు. ఫామ్ హౌస్ కి వెళ్ళినప్పుడు ముకుంద చేసిన పనుల గురించి మురారి చెప్తూ బాధపడతాడు. కృష్ణకి నా ప్రేమ విషయం చెప్పే అవకాశం రావట్లేదంటూ ఎమోషనల్ అవుతాడు మురారి. మరొకవైపు కృష్ణకి భోజనం పట్టుకొని రేవతి వస్తుంది. రేవతి కూడా ఇంకా భోజనం చెయ్యలేదని కృష్ణకి తెలిసి.. రేవతి తెచ్చిన భోజనాన్ని ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటారు. కృష్ణ ఎమోషనల్ అవుతూ రేవతిపై ప్రేమగా తల వాల్చుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.