English | Telugu

ఆమె పుట్టినరోజుని  ఫారెస్ట్ లో సెలబ్రేట్ చేసిన అఖిల్!

అఖిల్ సార్థక్.. బిగ్ బాస్ ద్వారా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ లో అఖిల్ సార్థక్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనడంలో ఆశ్చర్యం లేదు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్నిరోజులు అతని బిహేవియర్ చాలా మందికి నచ్చేది కాదు. అంతేకాకుండా హౌస్ లో మోనాల్ గజ్జర్ గురించి అఖిల్, అభిజిత్ ల గొడవలు.. వీధుల్లో కుళాయిల దగ్గర ఉండే కొట్లాటలాగా ఉండేవి. కాగా అఖిల్ బిగ్ బాస్-4 రన్నర్ గా నిలిచిన విషయం అందరికి తెలిసిందే. అంతేకాకుండా బిగ్ బాస్ ఓటీటీలో కూడా మరోసారి ఎంట్రీ ఇచ్చి.. అందులో కూడా రన్నరప్ గానే నిలిచాడు అఖిల్ సార్థక్.

అయితే తాజాగా అఖిల్ మంచి పాపులారిటీ సంపాదించుకొని.. ఈవెంట్స్, షోస్ తో బిజీగా ఉంటున్నాడు. అంతేకాకుండా బిబి జోడిలో తేజస్వినితో జతకట్టి మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు. బిబి జోడి షోలో హాట్ పర్ఫామెన్స్ ఎవరిదంటే.. అఖిల్-తేజస్వినిల పేరే వినిపిస్తుంది. బిబి జోడీలో అఖిల్ కి కౌశల్ తో నువ్వా నేనా అంటూ మాటల యుద్ధమే జరిగింది‌. అయితే కొన్ని కారణాల వల్ల అఖిల్ జోడీ ఫైనల్ వరకు వెళ్ళలేదు. అఖిల్ కి కండరాల నొప్పి వల్ల తన కాలికి శస్త్రచికిత్స కూడా జరిగింది. దీంతో డాక్టర్లు కొన్నిరోజులు అఖిల్ ని డ్యాన్స్ చేయవద్దని చెప్పారంట.. అందుకనే బిబి జోడీ షో నుండి అఖిల్ తప్పుకున్నాడు. ఆ తర్వాత అఖిల్, తేజస్విని తరచు పార్టీలంటూ కలుస్తూనే ఉన్నారు. 'అర్థమైందా అరుణ్ కుమార్' వెబ్ సిరీస్ లో లిప్ లాక్ సీన్స్ తో తేజస్విని ఆకట్టుకుంది.

తేజస్విని పుట్టిన రోజుని అఖిల్ ఫారెస్ట్ లో సెలబ్రేట్ చేశాడు. అయితే ఎప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి ఇంట్లోనో, పబ్ లోనో పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకునే తేజస్విని.. ఇలా ఫారెస్ట్ లో సెలబ్రేట్ చేసుకోవడం మొదటిసారి అని, ఫారెస్ట్ లో జరుపుకుంటానని కలలో కూడా అనుకోలేదంట. అక్కడ అఖిల్, తేజస్విని కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసాడు అఖిల్.


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.