English | Telugu

తరుణ్ మాష్టర్ కు ముద్దు పెట్టిన రాధ

'నీతోనే డ్యాన్స్' ఈ వారం ప్రోమో ఆకట్టుకుంటోంది. ఈ ప్రోగ్రాంలో డ్యాన్స్‌ల కంటే మాస్ మసాలా ముద్దులు, హగ్గులు, మధ్యమధ్యలో గొడవలు అబ్బో ఒకటేమిటి ఫుల్ మీల్ షో ఇది. ఇక లేటెస్ట్ ప్రోమోలో అయితే తరుణ్ మాష్టర్ పండగ చేసుకున్నారు. ప్రోమో స్టార్టింగ్‌లోనే నటరాజ్ మాష్టర్ బాలయ్య బాబు గెటప్‌లో నీతూతో కలిసి చేసిన డ్యాన్స్ ఆకట్టుకుంది. బాలయ్య స్టెప్స్ ని అచ్చు గుద్దినట్టు అలానే దింపేశారు నటరాజ్ మాష్టర్. 'సూపర్ స్టార్' థీమ్ తో రాబోయే వారం ఎపిసోడ్ అదరగొట్టబోతోంది. ఈ పెర్ఫామెన్స్‌కు సదా, రాధ కాంప్లిమెంట్లు ఇచ్చేశారు.

తర్వాత యాదమ్మ రాజు.. బాలయ్యను, హీరో నానిని ఇమిటేట్ చేసేసరికి శ్రీముఖితో సహా అందరూ తెగ నవ్వుకున్నారు. ఇక ఆ తర్వాత దీప-సాగర్ పెర్ఫామెన్స్ తో ఫిదా ఐన సదా సాగర్‌కి ఓ హగ్ ఇచ్చింది. అలాగే నిఖిల్-కావ్య జోడి ఎప్పటిలానే బ్లాక్ బస్టర్ . పెర్ఫామెన్స్‌ ఇచ్చారు. దాంతో పేపర్లు చింపి విసిరేశారు తరుణ్ మాష్టర్. ఈసారి ఏకంగా చొక్కా కూడా చించేసుకుంటా అంటూ తెగ ఇంప్రెస్ అయిపోయారు. ఆ తర్వాత ఆట సందీప్-జ్యోతి డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లాస్ట్ వీక్ ఎపిసోడ్ లో సదాని చూసి సిగ్గుపడిన తరుణ్ మాష్టర్ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ లో రాధని ఇంప్రెస్ చేశారు. "నాకు ఒక హీరోయిన్‌ను చూస్తే చాలా ఎక్సయిట్మెంట్ కలిగేది.. ఆ హీరోయిన్ వచ్చేసి నా పక్కన కూర్చున్నారు కదా రాధ. ఆ ఏజ్‌లో అంతా రాధ గారి ఫొటోలు అక్కడకక్కడా పెట్టుకునేవాడిని.. ఎవరూ లేనప్పుడు అలా ఆ ఫొటోలే చూసుకునేవాడిని.." అని మాష్టర్ చెప్పగానే తరుణ్ మాష్టర్ గట్టిగా పట్టుకొని నుదిటి మీద ముద్దు పెట్టేసారు రాధ. దీంతో తరుణ్ మాస్టర్.. రాధ చేతి మీద కిస్ ఇచ్చారు. "కానీ నాకు చిరంజీవి గారిని చూస్తే చాలా జెలస్ వచ్చేసేది వచ్చేది " అంటూ తరుణ్ మాష్టర్ చెప్పడంతో అందరూ నవ్వేశారు .


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.