English | Telugu
జబర్దస్త్ కి తిరిగొచ్చిన చలాకి చంటి..ట్రావెల్ చేసి హ్యాంగోవర్ లో ఉన్నాడన్న కృష్ణభగవాన్
Updated : Jul 28, 2023
బుల్లితెర మీద ఫేమస్ కమెడియన్ చలాకి చంటి. జబర్దస్త్ లో చంటి స్కిట్స్ కి కడుపుబ్బా నవ్వుకోవచ్చు. బిగ్ బాస్ 6 హౌస్ లో కంటెస్టెంట్ గా వెళ్లారు కూడా. అక్కడ కూడా తనదైన మార్క్ కామెడీతో హౌస్ మేట్స్ ని అలరించాడు. ఐతే ఈ ఏడాది ఏప్రిల్ లో చంటికి ఛాతినొప్పి రావడంతో ఆయన్ను కుటుంబసభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా గుండె పోటుగా గుర్తించారు డాక్టర్లు. వెంటనే ఐసీయూకు షిఫ్ట్ చేసి చికిత్సనందించారు. రక్తనాళాల్లో పూడికలున్నట్టు గుర్తించిన డాక్టర్లు స్టంట్ వేశారు. అలా అప్పటి నుంచి నటనకు దూరంగా ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. ఇక ఇప్పుడు చంటి నెమ్మదిగా షోస్ లో మెరుస్తున్నారు..రీసెంట్ గా సుమ అడ్డా షోకి కూడా వచ్చారు.
ఇక ఇప్పుడు జబర్దస్త్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చేసారు. నేచురల్ స్టార్ నాని నటించిన భీమిలి కబడ్డి జట్టు సినిమాతోపాటు పలు సినిమాల్లో నటించాడు చంటి. ఇక చంటి తిరిగి రావడంతో సెట్ లో అందరిలో ఆనందం వెల్లివిరిసింది. యాంకర్ తో సహా అందరూ రంగుల కాయితాలు చింపి అతని మీద పోసి వెల్కమ్ చెప్పారు. ఇందులో ఒక స్కిట్ కూడా వేశారు. హీరో రోల్ లో నటించారు చలాకి చంటి. స్టోరీ ఏమిటి అనేసరికి "ఇంట్లో హీరో ఉంటాడు. అత్తారింటికి వస్తాడు, గొడవ పెట్టుకుంటాడు వెళ్ళిపోతాడు...మళ్ళీ పిలుస్తారు..వస్తాడు..గొడవ పెట్టుకుంటాడు వెళ్ళిపోతాడు"అనేసరికి చంటి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మాములుగా లేవు. అలా కాదు "వెళ్లిపోవడం మళ్ళీ రావడానికి, రావడం మళ్ళీ వెళ్లిపోవడానికి" అంటూ చంటి తిరిగి ఎంట్రీ ఇచ్చిన అంశంపై కౌంటర్ వేశారు ఇంద్రజ. తర్వాత యాంకర్ వచ్చి "ఎందుకు అంత నీరసంగా ఉన్నారు" అని చంటిని అడిగింది. "అమెరికా నుంచి 24 అవర్స్ ట్రావెల్ చేసి వచ్చా...కాస్త" అనేంతలా "హ్యాంగోవర్" అని మాట అందించారు కృష్ణ భగవాన్.. "హ్యాంగోవర్ కాదు సర్" అన్నాడు చంటి.