English | Telugu

రాహుల్ ని గాజులేసుకోమని చెప్పిన స్వప్న.. అంతా తనే చేసిందంట!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -161 లో.. అప్పు, కళ్యాణ్ ఇద్దరు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుంటారు. అప్పుడే ఎదురుగా అప్పు వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు. మీ అక్క పర్ఫ్యూమ్ యాడ్ లో సూపర్ ఉందని అనగానే.. నువ్వు పర్ఫ్యూమ్ ని చూడు, మా అక్కని కాదని అప్పు తన ఫ్రెండ్ పై కోప్పడుతుంది. మీ అక్క ఆ యాడ్ లో చేసి తప్పు చేసిందని కళ్యాణ్ అనగానే.. కళ్యాణ్ పై కోప్పడుతుంది అప్పు.

మరొక వైపు దుగ్గిరాల ఇంట్లో అందరు సైలెంట్ గా కూర్చొని భోజనం చేస్తుంటారు. ఏంటి అందరూ సైలెంట్ గా ఉన్నారని రుద్రాణి అనగానే.. నీ కోడలు చేసిన పనికి కడుపు నిండిపోయిందని అపర్ణ అంటుంది. నా కోడలు నీ కోడలికి అక్కే కదా అని రుద్రాణి అంటుంది. అప్పుడే రాజ్ వచ్చి ఇక మనకి ఏ ప్రాబ్లమ్ లేదు స్వప్న చేసిన యాడ్ టెలికాస్ట్ కాకుండా వాళ్ళకి డబ్బులు ఇచ్చి డిలీట్ చేపించానని రాజ్ అనగానే.. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే స్వప్న వస్తుంది‌. రాజ్ మాటలు విని రాజ్ దగ్గరికి కోపంగా వస్తుంది. ఆ యాడ్ ని ఎందుకు డిలీట్ చేయించావ్? నీకేం అవసరమని రాజ్ ని అడుగుతుంది. అలా రాజ్ పై స్వప్న కోపంగా అరిచేసరికి.. కావ్యకి కోపం వస్తుంది. స్వప్న నువ్వు నా భర్త గురించి తప్పుగా మాట్లాడకు.. నీ జీవితం నాశనం కాకుండా చేసిన నా భర్తపై కోప్పడుతున్నావేంటి.. నా భర్తని ఏమైనా అంటే పళ్ళు రాలగోడతా జాగ్రత్త అని స్వప్నకి కావ్య వార్నింగ్ ఇచ్చి.. రాజ్ కి సారి చెప్పమని స్వప్నకి చెప్తుంది. దాంతో స్వప్న చేసేదేంలేక రాజ్ కి సారి చెప్పి వెళ్తుంది. కావ్య కోపం చూసి ఇంట్లో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత స్వప్న గదిలోకి కోపంగా వెళ్లి .. గదిలోని వస్తువులని కింద పారేస్తుంటుంది. అది చూసిన రాహుల్ రుద్రాణి లు ఇదే మనకి మంచి టైం.. దీని కోపం మనకు ఇప్పుడు హెల్ప్ అవుతుంది వెళ్ళమని రాహుల్ ని స్వప్న దగ్గరికి పంపిస్తుంది రుద్రాణి. సారి స్వప్న అని రాహుల్ అనగానే.. అయ్యో నువ్వేం చేస్తావ్ వాళ్ళు చేసిన దానికి నీకు కాఫీ తెస్తానని స్వప్న వెళ్తుంది.

మరొక వైపు కావ్య రాజ్ దగ్గరికి వచ్చి.. మా అక్క చేసిన యాడ్ డిలీట్ చేయించినందుకు థాంక్స్ అని చెప్తుంది. నేనేం నీ కోసం, మీ అక్క కోసం చేయలేదు. ఈ ఇంటిపరువు కోసం చేసానని చెప్తాడు. మరొకవైపు రాహుల్ కి కాఫీ తీసుకొని వస్తానని వెళ్లిన స్వప్న.. గాజులు తీసుకొని వచ్చి ఇదిగో ఇవి వేసుకో అని అనగానే.. స్వప్నపై రాహుల్ సీరియస్ అవుతాడు. మరి ఏంటి వాళ్ళు నీ భార్యని అన్ని మాటలు అంటుంటే సైలెంట్ గా కూర్చొని ఉన్నావని స్వప్న అంటుంది. దీంతో కోపంగా కాకుండా నెమ్మదిగా డీల్ చెయ్యాలని రాహుల్ అనుకొని.. రాజ్ ఆ యాడ్ డిలీట్ చేయించడానికి కారణం మీ చెల్లెలు కావ్య అని స్వప్నని రెచ్చగొడుతాడు రాహుల్. స్వప్న నిజమే అనుకొని రాహుల్ మాటలు నమ్మేస్తుంది. మరొక వైపు కనకం ఇంటికి సేట్ కొంతమందిని తీసుకొని వచ్చి డబ్బులు ఇవ్వమని అడుగుతాడు. రెండు రోజుల్లో వడ్డీ డబ్బులు ఇవ్వాలని సేట్ వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.