English | Telugu
వసుధార వాళ్ళింట్లో మొదటిసారి భోజనం చేసిన ఏంజిల్!
Updated : Jul 28, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -827 లో.. వసుధారని రిషి కాలేజీలో అందరిముందు కోపంగా మాట్లాడటంతో వసుధార వాళ్ళింటికి వెళ్తుంది. వసుధార ఇంటికి రాకపోవడంతో ఏంజిల్, రిషి టెన్షన్ పడుతారు. దాంతో వసుధారకి రిషి మెసేజ్ చేస్తాడు. ఎక్కడున్నారు మేడమ్ అని రిషి మెసెజ్ చేయగా, నేను మా ఇంట్లో సేఫ్ గా ఉన్నాను. మీరు నా గురించి టెన్షన్ పడకండని వసుధార మెసేజ్ చేస్తుంది.
ఆ తర్వాత వసుధార వాళ్ళింటికి వెళ్లిందట అని ఏంజిల్ తో రిషి చెప్తాడు. మరి కాలేజీ లో నువ్వు వసుధారపై అరిచావు కదా అందుకే వెళ్ళినట్టుంది. నేను వసుధార దగ్గరికి వెళ్లి వస్తాను. నువ్వు వస్తావా అని ఏంజిల్ అడుగుతుంది. లేదు నేను రానని రిషి అంటాడు. ఆ తర్వాత ఏంజిల్ వెళ్తుంటే.. ఆగు ఏంజెల్ నేను వస్తానని ఏంజెల్ తో రిషి బయల్దేర్తాడు. నువ్వు వసుధార కోసం వస్తున్నావ్ కదా అని రిషితో ఏంజిల్ అంటుంది. లేదు నిన్ను ఒంటరిగా పంపించడం ఇష్టం లేక వస్తున్నానని రిషి అంటాడు. కానీ వసుధార చాలా మంచిది రిషి అని ఏంజిల్ అంటుంది కానీ రిషి మాత్రం సైలెంట్ గా ఉంటాడు.
ఇద్దరు కలిసి వసుధార వాళ్ళ ఇంటికి వచ్చాక.. నువ్వు వెళ్ళు నేను రానని రిషి అనగానే.. లోపలికి రా అని వసుధార లోపలికి తీసుకొని వెళ్తుంది. రిషిని చూసిన చక్రపాణి.. అల్లుడు గారు మీరు వచ్చారా అని చక్రపాణి అంటాడు. అలా అనగానే ఏంజిల్ ఒక్కసారిగా షాక్ అవుతుంది. అల్లుడు గారా అని ఏంజిల్ అడుగుతుంది. అల్లుడు గారు కాదమ్మా.. బాబు గారు అన్నానని చక్రపాణి కవర్ చేస్తాడు. వసుధారని చూసిన ఏంజిల్ ఏంటి వసు ఇలా వచ్చేసావని అడుగుతుంది. ఇన్ని రోజులు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. అందుకే వచ్చేసానని వసుధార అంటుంది. సరే జాగ్రత్త అని ఏంజిల్ అంటుంది. మొదటిసారి వచ్చారు.. ఏమైనా తిని వెళ్ళని రిషితో చక్రపాణి అంటాడు. నాకేం అవసరం లేదని రిషి అంటాడు. ఎందుకు రిషి అలా అంటావ్.. వసుధార ఇన్నిరోజులు మన దగ్గర ఉంది కదా.. మనం వాళ్ళ ఇంట్లో తినకుంటే తను ఫీల్ అవుతుందని ఏంజిల్ అంటుంది.
ఆ తర్వాత రిషికి వసుధార మజ్జిగ తీసుకొని వస్తుంది. రిషి ఇబ్బందిగానే మజ్జిగ తాగుతాడు. ఆ తర్వాత వసుధార, ఏంజిల్, చక్రపాణి కలిసి భోజనం చేస్తుంటారు. రిషి మాత్రం హాల్లో కూర్చొని వసుధార వాళ్ళ అమ్మ కన్పించడం లేదని అనుకుంటాడు. రిషి వెళ్తుంటే వసుధార మేడం వాళ్ళ అమ్మ ఇంట్లో లేనట్టున్నారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండని చెప్పి రిషి, ఏంజెల్ వెళ్ళిపోతారు. ఆ తర్వాత వసుధార రిషి తాగిన మజ్జిగ గ్లాస్ లో ఉన్న మిగత మజ్జిగ తాగుతుంది. అప్పుడే ఎందుకు అలా తాగుతున్నవని వసుధారతో రిషి అంటాడు. నా ఇష్టమని వసు అంటుంది. ఆ తర్వాత రిషి కార్ కీస్ తీసుకొని వెళ్ళిపోతాడు. వసుధార మాత్రం గ్లాస్ చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.