English | Telugu
ఆగస్టు 20న కీర్తి భట్ నిశ్చితార్థం.. ఇన్విటేషన్స్ ఇస్తున్న కీర్తి, విజయ్
Updated : Jul 30, 2023
కార్తీకదీపం సీరియల్ లో నటించిన కీర్తి భట్ కి తెలుగు ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బిగ్ బాస్ సీజన్ 6లో చక్కగా ఆడి ఫైనల్ వరకు వెళ్ళింది. టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒక అమ్మాయిగా నిలిచింది. ప్రస్తుతం ఈమె "మధురానగరిలో" అనే సీరియల్ లో నటిస్తోంది. అలాంటి కీర్తి భట్ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతోంది. ఆమె హీరో విజయ్ కార్తిక్ ని లవ్ మ్యారేజ్ చేసుకోనుంది. ఐతే విజయ్ వాళ్ళ పేరెంట్స్ కూడా కీర్తి విషయం తెలిసి చాలా హ్యాపీగా ఇద్దరికీ పెళ్లి చేయడానికి ముందుకొచ్చారు. కీర్తి భట్ తన కోడలు కాదని కూతురని విజయ్ వాళ్ళ అమ్మ ఒక సందర్భంలో చెప్పారు. తనకు పిల్లలు పుట్టరని తెలిసి కూడా ఈ పెళ్ళికి ఒప్పుకోవడం వాళ్ళ గొప్పతనానికి నిదర్శనం అంది కీర్తి భట్. కావాలంటే పిల్లల్ని దత్తత తీసుకుంటామని చెప్పింది కీర్తి.
ఈ సందర్భంగా వీళ్ళు "రింగ్ ఫంక్షన్"ని సెలెబ్రేట్ చేసుకోబోతున్నారు. ఉంగరాలు మార్చుకునే వేడుక ఆగస్టు 20న బేగంపేటలో జరగబోతోందంటూ చెప్పారు ఈ జంట. ఇక ఈ ఫంక్షన్ కి దగ్గర వాళ్ళను పిలుచుకుంటున్నారు. "జానకి కలగనలేదు" సీరియల్ సెట్ కి వెళ్లి అక్కడ షూటింగ్ లో ఉన్న ప్రియాంక జైన్, అమర్ దీప్ చౌదరిని ఇన్వైట్ చేయడానికి వెళ్లారు కీర్తి, విజయ్ . వారిని కలిసి ఇన్విటేషన్ అందించారు. ఇక ఈ హ్యాపీ మూమెంట్ ని ప్రియాంక జైన్ తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో కీర్తి నిశ్చితార్థం విషయం గురించి అందరికీ తెలిసింది. ఇక ఈ రింగ్ ఫంక్షన్ కార్డు చూసాక "మీకు నిజంగా పెళ్లి చేసుకోవాలని ఉందా" అంటూ రివర్స్ లో అడిగింది..పెళ్లి అంటేనే తనకు భయమేస్తోంది అని చెప్పింది ప్రియాంక. ఇక కార్డు అందుకున్న ప్రియాంక వాళ్లకు బెస్ట్ విషెస్ చెప్పింది. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంది. ఇక నెటిజన్స్ కూడా వీళ్లకు విషెస్ చెప్తున్నారు.